Webdunia - Bharat's app for daily news and videos

Install App

అలా చేస్తే పాఠశాలల గుర్తింపు రద్దు చేస్తామంటున్న ఢిల్లీ సీఎం

ఠాగూర్
మంగళవారం, 15 ఏప్రియల్ 2025 (18:46 IST)
ఢిల్లీలోని ప్రైవేటు పాఠశాలల యాజమాన్యాలకు ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి రేఖా గుప్తా గట్టి హెచ్చరిక చేశారు. ఏకపక్షంగా ఫీజులు పెంచడం, వేధించడం వంటి చర్యలకు పాల్పడితే పాఠశాలల గుర్తింపును రద్దు చేస్తామని హెచ్చరించింది. పాఠశాలలో ఇష్టారాజ్యంగా ఫీజులు పెంపును నిరసిస్తూ విద్యార్థుల తల్లిదండ్రులు ఆందోళనకు దిగారు. మోడల్ టౌన్‌లోని క్వీన్ మేరీ స్కూల్ యాజమాన్యం విద్యార్థుల తల్లిదండ్రులను వేధింపులకు గురిచేసిందనే ఆరోపణలు వచ్చాయి. ఈ నేపథ్యంలో పాఠశాల యాజమాన్యం కొందరు విద్యార్థులను బహిష్కరించినట్టు తెలుస్తోంది. 
 
ఈ విషయాన్ని తల్లిదండ్రులు ముఖ్యమంత్రి రేఖా గుప్తా దృష్టికి తీసుకెళ్లారు. దీంతో ఆమె స్పందిస్తూ, పాఠశాలల్లో ఇష్టారాజ్యంగా ఫీజులు పెంచడం, విద్యార్థుల తల్లిదండ్రులను వేధించడం వంటి చర్యలకు పాల్పడితే ఎంతమాత్రం సహించేది లేదన్నారు. ఫీజుల పెంపు విషయంలో పాఠశాలల యాజమాన్యాలు కొన్ని నియమనిబంధనలు తప్పనిసరిగా పాటించాలని ఆయన సూచించారు. అసాధారణంగా ఫీజులు పెంచరాదని, విద్యార్థులను అకారణంగా వేధించరాదని హితవు పలికారు. 
 
నిబంధనలు పాటించని పాఠశాలలపై చర్యలు తప్పవని ఆమె హెచ్చరించారు. ప్రభుత్వానికి ఫిర్యాదులు వస్తే సంబంధిత పాఠశాలలకు నోటీసులు పంపిస్తామని తెలిపారు. అవసరమైతే రిజిస్ట్రేషన్లు కూడా రద్దు చేస్తామని పునరుద్ఘాటించారు. ప్రతి బిడ్డకు న్యాయం, గౌరవం, సరైన విద్య లభించాలన్నదే తమ ప్రభుత్వ ధ్యేయమన్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

90 సెకన్ల డెడ్ హ్యాంగ్ ఛాలెంజ్‌ను స్వీకరించిన సమంత రూతు ప్రభు (video)

Lavanya Tripathi: పెండ్లిచేసుకున్న భర్తను సతీ లీలావతి ఎందుకు కొడుతోంది ?

మళ్లీ వార్తల్లో నిలిచిన సినీ నటి కల్పిక.. సిగరెట్స్ ఏది రా.. అంటూ గొడవ (video)

Cooli: నటీనటులతో రజనీకాంత్ కూలీ ట్రైలర్ అనౌన్స్ మెంట్ పోస్టర్ రిలీజ్

ANirudh: మనసులో భయం మరోపక్క మంచి సినిమా అనే ధైర్యం : విజయ్ దేవరకొండ

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

కరివేపాకుతో చెడు కొవ్వు, రక్తపోటుకి చెక్

ఆల్‌బుకరా పండ్లతో ఆరోగ్య ప్రయోజనాలు

జామకాయ తింటే ఎన్ని ప్రయోజనాలు, ఏంటి?

Snacks: బరువు తగ్గాలనుకునే మహిళలు హెల్దీ స్నాక్స్ తీసుకోవచ్చు.. ఎలాగంటే?

4 అలవాట్లు వుంటే వెన్నునొప్పి వదలదట, ఏంటవి?

తర్వాతి కథనం
Show comments