Webdunia - Bharat's app for daily news and videos

Install App

అన్నను పక్కకు నెట్టి పెళ్లికూతురు మెడలో తాళి కట్టిన తమ్ముడు.. పెళ్లికొడుకు ఏడుస్తూ?

ప్రేమ ఎప్పుడు ఎక్కడ ఎలా పుడుతుందో ఎవరికీ తెలియదు. అలా పుట్టిన ప్రేమ ఎంతకైనా తెగించేలా మనిషిని ప్రేరేపిస్తుంది. సాధారణంగా సినిమాలలో జరిగే కొన్ని సంఘటనలు అడపాదడపా నిజ జీవితంలోనూ జరుగుతూ ఉంటాయి. అలాంటి ఘ

Webdunia
శుక్రవారం, 2 జూన్ 2017 (13:22 IST)
ప్రేమ ఎప్పుడు ఎక్కడ ఎలా పుడుతుందో ఎవరికీ తెలియదు. అలా పుట్టిన ప్రేమ ఎంతకైనా తెగించేలా మనిషిని ప్రేరేపిస్తుంది. సాధారణంగా సినిమాలలో జరిగే కొన్ని సంఘటనలు అడపాదడపా నిజ జీవితంలోనూ జరుగుతూ ఉంటాయి. అలాంటి ఘటనే తమిళనాడులో చోటు చేసుకుంది.
 
తమిళనాడులోని ఇలవంపట్టి వెన్‌కల్ సమీపంలోని మురుగన్ ఆలయంలో వివాహం జరుగుతోంది. మరి కొన్ని క్షణాల్లో పెళ్లికొడుకు వధువు మెడలో తాళి కడితే తంతు పూర్తవుతుంది. సరిగ్గా అప్పుడే ఎవరూ ఊహించని విధంగా వరుని తమ్ముడు పెళ్లిపీటలపై ఉన్న తన అన్నని పక్కకు తోసేసి పెళ్లికూతురు మెడలో తాళి కట్టేశాడు. దీనితో అక్కడున్న పెళ్లి పెద్దలంతా అవాక్కయి, తర్వాత అతడిని చితకబాదారు.
 
వివరాలలోకి వెళితే తమిళనాడు వేలూరు జిల్లా తిరుపత్తూరు సమీపంలోని సెల్లరైపట్టికి చెందిన కామరాజ్‌కు రంజిత్, రాజేష్, వినోద్ అనే ముగ్గురు కొడుకులు ఉన్నారు. ఆరు నెలల ముందు రెండో కొడుకు రాజేష్‌కు మధురైకి చెందిన ఒక యువతితో వివాహం నిశ్చయించారు. రాజేష్ పెళ్లి చూపులకు వెళ్లినప్పుడే వినోద్, పెళ్లి కుమార్తె ఒకరినొకరు చూసుకుని, తొలి చూపులోనే ప్రేమలో పడ్డారు. ఆ విషయాన్ని బయటకు చెప్పకుండా అప్పటి నుండి ప్రతిరోజూ ఫోన్‌లో మాట్లాడుకునేవారు.
 
చివరకు పెళ్లి పందిట్లో సంఘటన జరిగిన తర్వాత, పెళ్లి పెద్దలు పెళ్లి కూతురు, వినోద్ ఇద్దరితో మాట్లాడగా అసలు విషయం బయటపెట్టారు. అమ్మాయి కూడా ఇష్టపడుతుండటంతో ఇక పెద్దలు చేసేదేమీలేక అక్షింతలు చల్లి వెళ్లిపోయారు. ఇక పెళ్లి కొడుకు ఏడుస్తూ అక్కడి నుండి వెళ్లిపోయాడు.

ఎం.ఎల్.ఎ.లను కిడ్నాప్ చేసిన రామ్ చరణ్ - తాజా అప్ డేట్

దేవర లో 19 న ఎర్రసముద్రం ఎగిసెగిసిపడుద్ది : రామ జోగయ్యశాస్త్రి

సుచి లీక్స్ గోల.. ధనుష్, త్రిషనే కాదు.. మాజీ భర్తను కూడా వదిలిపెట్టలేదు..

పుష్ప2 నుంచి దాక్షాయణి గా అనసూయ తిరిగి రానుంది

థియేటర్ల మూత అనంతరం డైరెక్టర్స్ అసోసియేషన్ ఈవెంట్

వేరుశనగ పల్లీలు ఎందుకు తినాలి?

టీ తాగేవారు తెలుసుకోవాల్సిన విషయాలు

మెదడు ఆరోగ్యంపై ప్రభావం చూపే శారీరక శ్రమ

పరగడపున వేప నీరు తాగితే కలిగే ప్రయోజనాలు ఇవే

పిల్లల మానసిక ఆరోగ్యానికి దెబ్బతీసే జంక్ ఫుడ్.. ఎలా?

తర్వాతి కథనం
Show comments