Webdunia - Bharat's app for daily news and videos

Install App

సచిన్... నాతో పెట్టుకున్నది మర్చిపో...: అలాగా... ఐతే ఈ సంగీతం మధ్యే చావు... సచిన్

మంద్రమైన సంగీతం. సుమధుర గీతాలు... ఆ తర్వాత డ్రమ్స్. మరికాసేపటికి ఆ సంగీతానికి తగినట్లుగా నాట్యం. ఇదీ ఇప్పటి కుర్రకారు ఎంజాయ్‌మెంట్స్‌లో కొన్ని. డ్యాన్స్ చేయాలంటే ప్రాక్టీసు కావాలి కదా. మరి ప్రాక్టీసు

Webdunia
గురువారం, 30 జూన్ 2016 (17:06 IST)
మంద్రమైన సంగీతం. సుమధుర గీతాలు... ఆ తర్వాత డ్రమ్స్. మరికాసేపటికి ఆ సంగీతానికి తగినట్లుగా నాట్యం. ఇదీ ఇప్పటి కుర్రకారు ఎంజాయ్‌మెంట్స్‌లో కొన్ని. డ్యాన్స్ చేయాలంటే ప్రాక్టీసు కావాలి కదా. మరి ప్రాక్టీసు కావాలంటే డ్యాన్స్ స్కూలుకు వెళ్లాలి కదా. అలాగే 23 ఏళ్ల యోగిత అనే అమ్మాయి న్యూ ఢిల్లీలోని ఇగ్నోకు సమీపంలో సచిన్ అనే 24 ఏళ్ల యువకుడు నడుపుతున్న డ్యాన్సు స్కూలుకు పాఠాలు నేర్చుకునేందుకు వెళ్లింది. ఇది ఏడాది క్రితం మాట.
 
ఐతే ఆమె అలా స్కూలుకు వెళ్లిన మొదటిరోజే సచిన్ ప్రేమలో పడిపోయింది. ఇద్దరూ ఇక సంగీత పాఠాలతో పాటు ప్రేమ పాఠాలు కూడా నేర్చుకున్నారు. ఇద్దరిమధ్య ఎఫైర్ చాలా దృఢంగా మారిపోయింది. అంతలో ప్రేయసిలో మార్పు. తను మరో యువకుడిని పెళ్లాడబోతున్నట్లు సచిన్‌తో చెప్పేసింది. తనను మర్చిపోవాలని అంది. ఏడాదిగా సాగుతున్న ఎఫైర్‌కి ఇంతటితో ఫుల్ స్టాప్ పెట్టేద్దాం అని చెప్పింది. అంతే... షాక్ తిన్న సచిన్ పైకి ఏమీ చెప్పలేదు. 
 
తనదైన శైలిలో డ్యాన్సు స్కూలుకు డెకరేట్ చేశాడు. సర్లే... పాఠాలు నేర్చుకుందువు రా అని పిలిచి... ఆమె మెడకు కరెంటు వైర్లను బిగించి హత్య చేశాడు. ఆ తర్వాత అతడు కూడా ఉరి వేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. విషయం తెలుసుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.

లాక్‌డౌన్‌లో పవిత్రతో ఎఫైర్, నా ముఖం చూస్తేనే అసహ్యించుకునేవాడు: చంద్రకాంత్ భార్య

యేవమ్ చిత్రంలో ‘వశిష్ట ఎన్ సింహ’ గా యుగంధర్

శ్రీ గణేష్‌ దర్శకత్వంలో ద్విభాషా చిత్రం సిద్దార్థ్ 40 అనౌన్స్ మెంట్

సరికొత్త రొమాంటిక్ లవ్ స్టోరిగా సిల్క్ శారీ విడుదల సిద్ధమైంది

ఆనంద్ దేవరకొండ గం..గం..గణేశా ట్రైలర్ సిద్ధం

చేతులతో భోజనం తినడం వల్ల 5 ఉత్తమ ఆరోగ్య ప్రయోజనాలు

పెద్ద ఉల్లిపాయలు తింటే గొప్ప ప్రయోజనాలు, ఏంటవి?

ఆదివారం అంటేనే బిర్యానీ లాగిస్తున్నారా? ఇవి తప్పవండోయ్!

పనస పండ్లలోని పోషకాలేంటి..? ఎవరు తినకూడదు?

రాత్రి పడుకునే ముందు ఖర్జూరం పాలు తాగితే?

తర్వాతి కథనం
Show comments