Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఆయనే ఓ వివాదాల పుట్ట... కానీ ఇకపై వద్దంటున్నారు.. ఆహా రాజకీయమా..!

గత రెండేళ్లకుపైగా ఈ యోగి కమ్ రాజకీయనేత చేసిన వ్యాఖ్యలు దేశంలో ఎంత దుమారం లేపాయో అందరికీ తెలుసు. ముస్లింలు ఎంత ఎక్కువగా ఉంటే అంత అధికంగా అక్కడ గొడవలు జరుగుతాయని వ్యాఖ్యానించారు. మదర్ థరెసా సేవ పేరిట క్రేస్తవుల జనాభా పెంచేందుకు ప్రయత్నించారనీ ఆరోపించార

Webdunia
సోమవారం, 20 మార్చి 2017 (09:41 IST)
గత రెండేళ్లకుపైగా ఈ యోగి కమ్ రాజకీయనేత చేసిన వ్యాఖ్యలు దేశంలో ఎంత దుమారం లేపాయో అందరికీ తెలుసు. ముస్లింలు ఎంత ఎక్కువగా ఉంటే అంత అధికంగా అక్కడ గొడవలు జరుగుతాయని వ్యాఖ్యానించారు. మదర్ థరెసా సేవ పేరిట క్రేస్తవుల జనాభా పెంచేందుకు ప్రయత్నించారనీ ఆరోపించారు. ఇలాంటివి ఎన్నో మరి. కానీ అధికారం చేతిలోకి వచ్చేసరికి ఒక్కసారిగా మారిపోయారు. పార్టీ కార్యకర్తలు, నేతలు అనాలోచిత వ్యాఖ్యలు చేయవద్దని ఆదేశం జారా చేసేశారు. ఇది ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాధ్ గొడవ.
 
హిందూ అతివాదిగా పేరొందిన యోగి ఆదిత్యనాథ్‌ ముఖ్యమంత్రిగా తన ఇన్నింగ్స్‌ను ఆదివారం ప్రారంభించారు. దేశంలో అత్యంత కీలకమైన ఉత్తరప్రదేశ్‌ రాష్ట్రానికి ఆయనను సీఎంగా బీజేపీ ఎంచుకోవడంపై పలు విమర్శలు, అనుమానాలు వ్యక్తమవుతున్న నేపథ్యంలో ప్రమాణ స్వీకారం అనంతరం తాను అందరినీ సమానంగా చూస్తానని, ఏ వర్గంపైనా వివక్ష చూపబోనని యోగి పేర్కొన్నారు. తమ ఎన్నికల నినాదమైన ’సబ్‌కా సాథ్‌, సబ్‌కా వికాస్‌’ (అందరికీ చేయూత, అందరికీ ప్రగతి) నేరవేరుస్తానని అన్నారు.
 
సీఎంగా పగ్గాలు చేపట్టిన అనంతరం యోగి పార్టీ శ్రేణులను ఉద్దేశించి మాట్లాడుతూ ఘాటు సూచనలు చేశారు. పార్టీ కార్యకర్తలు, నేతలు అనాలోచిత వ్యాఖ్యలు చేయవద్దని ఆయన సూచించినట్టు తెలిసింది. అదేవిధంగా పార్టీ శ్రేణులంతా తమ ఆదాయమూలాలను, ఆదాయ వివరాలను వెల్లడించాలని చెప్పారు.
 
కాగా, సీఎం యోగితో కలిపి 47మందితో కొలువుదీరిన యూపీ కేబినెట్‌లో పలువురు ఆశావహులకు చాన్స్‌ దక్కలేదు. తొలిసారి ఎమ్మెల్యేగా పోటీ చేసి గెలుపొందిన కేంద్ర హోంమంత్రి రాజ్‌నాథ్‌ సింగ్‌ తనయుడు పంకజ్‌ సింగ్‌కు నిరాశే ఎదురైంది. అదేవిధంగా మాజీ సీఎం కల్యాణ్‌ సింగ్‌ మనవడికి, బీజేపీ సీనియర్‌ నేత లాల్జీ టాండన్‌ తనయుడికి కూడా మంత్రివర్గంలో చాన్స్‌ దక్కలేదు. యూపీ కేబినెట్‌లో చాలావరకు బీజేపీ చీఫ్‌ అమిత్‌ షా సన్నిహితులకు పెద్దపీట దక్కింది. ఆయనకు విశ్వసనీయులుగా ముద్రపడిన శ్రీకాంత్‌వర్మ, సిద్ధార్థనాథ్‌ సింగ్‌, దినేశ్‌ శర్మ, కేశవప్రసాద్‌ మౌర్య తదితరులకు కీలక మంత్రి పదవులు దక్కాయి.
 
అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

అన్‌స్టాపబుల్ షోలో రామ్ చరణ్ కు తోడుగా శర్వానంద్ ప్రమోషన్

ఎనిమిది సంవత్సరాలు పూర్తి చేసుకున్న నేషనల్ క్రష్ రశ్మిక మందన్నా

రెండు ముక్కలు దిశగా తెలుగు టీవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ ?

ప్రదీప్ మాచిరాజు, చంద్రిక రవిపై స్పెషల్ మాస్ సాంగ్ చిత్రీకరణ

బెల్లంకొండ సాయి శ్రీనివాస్, అదితి శంకర్ ల భైరవం ఫస్ట్ సింగిల్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

కిడ్నీ హెల్త్ ఫుడ్స్ ఇవే

గుమ్మడి విత్తనాలు తింటే ప్రయోజనాలు

భోజనం తిన్న వెంటనే స్వీట్లు తినవచ్చా?

అలోవెరా-ఉసిరి రసం ఉదయాన్నే తాగితే?

steps to control diabetes మధుమేహం అదుపుకి జాగ్రత్తలు ఇవే

తర్వాతి కథనం
Show comments