Webdunia - Bharat's app for daily news and videos

Install App

తండ్రి అంత్యక్రియల కంటే 23 కోట్ల మంది ప్రజలను రక్షించాలి : సీఎం యోగి

Webdunia
సోమవారం, 20 ఏప్రియల్ 2020 (17:46 IST)
ఉత్తరప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ తన తండ్రిని కడసారి చూపు చూడలేకపోయారు. యోగి ఆదిత్యనాథ్ తండ్రి ఆనంద్ సింగ్ బిష్ట్ సోమవారం కన్నుమూశారు. ఆయన వయసు 89 యేళ్లు. ఈయన అనారోగ్యంతో ఢిల్లీలోని ఎయిమ్స్‌లో చికిత్స పొందుతూ చనిపోయారు. దేశవ్యాప్తంగా కరోనా లాక్‌డౌన్ కొనసాగుతుండటంతో తండ్రి అంత్యక్రియల్లో సీఎం యోగి పాల్గొనలేకపోయారు. 
 
ఈ వార్త అందిన వెంటనే సీఎం యోగి స్పందించారు. తన తండ్రి మృతిపై తీవ్ర విచారం వ్యక్తం చేస్తూ, మంగళవారం నిర్వహించనున్న తన తండ్రి అంతిమసంస్కారాలకు తాను హాజరు కాలేకపోతున్నానని, 'కరోనా' కట్టడికి చేస్తున్న పోరాటం నేపథ్యంలోనే తాను ఈ నిర్ణయం తీసుకున్నట్టు తెలిపారు. 
 
తన తండ్రి మరణవార్త విని చాలా బాధపడ్డానని అన్నారు. నమ్మకంగా ఉండటం, కష్టపడడం, నిస్వార్థంగా ఉండటం గురించి తన తండ్రి తనకు ఎప్పుడూ చెబుతుండేవారని ఈ సందర్భంగా ముఖ్యమంత్రి యోగి గుర్తు చేసుకున్నారు. తన తండ్రి చివరి క్షణాల్లో ఆయనతో గడుపుదామనుకున్నాను కానీ, రాష్ట్రంలోని 23 కోట్ల మంది ప్రజలను రక్షించాల్సిన బాధ్యత తనపై ఉందన్నారు. 
 
కాగా, ఉత్తరాఖండ్‌లోని పౌరి జిల్లాలోని స్వగ్రామానికి ఆనంద్ సింగ్ బిష్ట్ భౌతిక కాయాన్ని తరలించనున్నారు. మంగళవారం తన తండ్రి అంత్యక్రియలకు హాజరుకానున్న తన తల్లి, బంధువులు లాక్‌డౌన్ నిబంధనలను పాటించాలని కోరారు. లాక్ డౌన్ ముగిసిన తర్వాత తాను అక్కడికి వెళతానని చెప్పారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

టాలీవుడ్ నిర్మాత వేదరాజు టింబర్ మృతి

తొలి చిత్రానికి సంతకం చేసిన మత్తుకళ్ల మోనాలిసా (Video)

చేసిన షూటింగ్ అంతా డస్ట్ బిన్ లో వేసిన హీరో?

జీవా, అర్జున్ సర్జా - అగత్యా రిలీజ్ డేట్ పోస్ట్‌పోన్

ప్రభాస్ భారీ యాక్షన్ సీన్స్ క్రియేటివ్ గా ఎలా చేస్తున్నాడో తెలుసా?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఇబ్బంది పెట్టే మైగ్రేన్‌ను వదిలించుకోవడానికి సింపుల్ చిట్కాలు

ఖాళీ కడుపుతో వేప నీరు తాగితే కలిగే ప్రయోజనాలు

వళ్లు వేడిబడింది, జ్వరం వచ్చిందేమో? ఎంత ఉష్ణోగ్రత వుంటే జ్వరం?

జలుబు, దగ్గుకి అల్లంతో పెరటి వైద్యం

టీలు, కాఫీలకు బదులు ఈ జావ తాగరాదూ?

తర్వాతి కథనం
Show comments