Webdunia - Bharat's app for daily news and videos

Install App

రాంగ్ ప్లేస్‌లో పార్కింగ్.. సీఎం కాన్వాయ్‌ది అయితే మాత్రం.. లాగిపడేయండి.. దటీజ్ యూపీ ట్రాఫిక్

రాష్ట్రంలో నేరాలను గణనీయంగా తగ్గిస్తామని చెప్పిన ముఖ్యమంత్రి ఉపయోగించే కాన్వాయ్‌లోని కారే పోయిందంటే అధికారులు గుండెలు అదిరిపోవా.. అందులోనూ చండశాసనుడైన సన్యాసి ముఖ్యమంత్రి కాన్వాయ్ కారు పోవడం మాటలా.. ఉత్తర ప్రదేశ్‌లో అధికారులను మునిగాళ్ల మీద నిలబెట్టి

Webdunia
శుక్రవారం, 21 ఏప్రియల్ 2017 (04:33 IST)
రాష్ట్రంలో నేరాలను గణనీయంగా తగ్గిస్తామని చెప్పిన ముఖ్యమంత్రి ఉపయోగించే కాన్వాయ్‌లోని కారే పోయిందంటే అధికారులు గుండెలు అదిరిపోవా.. అందులోనూ చండశాసనుడైన సన్యాసి ముఖ్యమంత్రి కాన్వాయ్ కారు పోవడం మాటలా.. ఉత్తర ప్రదేశ్‌లో అధికారులను మునిగాళ్ల మీద నిలబెట్టి మరీ పనిచేయిస్తున్న నూతన ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ కాన్వాయ్ లని కారే చోరీ అయిపోయిందని అధికారులు హడలిపోయారు. చివరకు విషయం తెలిసి బతుకు జీవుడా అని ఊపిరి పీల్చుకున్నారు.
 
ఉత్తరప్రదేశ్‌లో గంటకు మూడు వాహనాలు చోరీకి గురవుతాయని ప్రతీతి. అయితే ఈసారి చోరీ అయింది మాత్రం ఆషామాషీ కారు కాదు.. స్వయానా ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ కాన్వాయ్‌లోని వాహనం. ఝాన్సీ సర్క్యూట్ హౌస్‌లో పార్కింగ్ చేసిన ఆ వాహనం పోయిందని డ్రైవర్ ఫిర్యాదు చేయగానే జిల్లా పోలీసులు ఒక్కసారిగా హడలిపోయారు. రాష్ట్రంలో నేరాలను గణనీయంగా తగ్గిస్తామని చెప్పిన ముఖ్యమంత్రి ఉపయోగించే కాన్వాయ్‌లోని కారే పోయిందంటే ఇక ఎలా సమాధానం చెప్పుకోవాలా అని సతమతమయ్యారు. 
 
విషయం ఏమిటింటే... లక్నోకు 300 కిలోమీటర్ల దూరంలో జిల్లా కేంద్రంలో యోగి ఆదిత్యనాథ్ అక్కడి అధికారులతో సమావేశంలో ఉన్నారు. ఆయన కాన్వాయ్ లోని వాహనాలన్నింటినీ పక్కనే ఉన్న సర్క్యూట్ హౌస్ ప్రాంగణంలో పార్క్ చేశారు. సమావేశం జరుగుతోందని డ్రైవర్లు కాసేపు బయటకు వెళ్లి వచ్చారు. అలా వెళ్లొచ్చి చూసుకుంటే ఒక డ్రైవర్ కారు కనపడలేదు. దాంతో అతడు పోలీసులకు ఫిర్యాదు చేశాడు.
 
దాంతో వణికిపోయిన అధికారులు మొత్తం చెక్‌పోస్టులన్నింటినీ అలర్ట్ చేశారు. ఎక్కడైనా వాహనాలను వదిలిపెట్టారేమో తనిఖీ చేశారు. అయితే ఎవరూ అనుకోని చోట ఆ కారు దొరికింది. ట్రాఫిక్ పోలీసుల దగ్గర!! అవును, ఆ వాహనాన్ని ట్రాఫిక్ పోలీసులు టోయింగ్ చేసి తీసుకెళ్లిపోయారు. దాన్ని రాంగ్ ప్లేసులో పార్కింగ్ చేయడం వల్లే టోయింగ్ చేసి పార్కింగ్ కోసం కేటాయించిన ప్రాంతంలో పెట్టారు.
 
అయినా సీఎం కాన్వాయ్ లోని కారును రాంగ్ ప్లేస్‌లో పెట్టడం ఏమిటి.. కారు పోవడం ఏమిటి? 
 
అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

మే 23వ తేదీ నుంచి థియేటర్లకు "వైభవం"

ఫ్లాష్..ష్లాష్... అఖండ 2లో చైల్డ్ ఆర్టిస్టుగా హర్షాలి మల్హోత్రా !

సౌదీ అరేబియాలో ఘనంగా ఎన్టీఆర్‌ సినీ వజ్రోత్సవ వేడుకలు

గాయాలు, చేతిలో మంగళసూత్రం పట్టుకున్న ప్రదీప్ రంగనాథన్.. డ్యూడ్ ఫస్ట్ లుక్

యశ్వంత్ చిత్రం కథకళి ప్రారంభం చేయడం ఆనందంగా వుంది: నిహారిక

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

Moringa Soup: మునగాకు సూప్ తాగితే మహిళలకు ఎంత మేలో తెలుసా?

ఆస్తమా రోగులు తినకూడని పదార్థాలు, ఏంటవి?

హైదరాబాద్‌లోని GKB ఆప్టికల్స్ స్టోర్‌ను సందర్శించిన క్రికెట్ స్టార్ పాట్ కమ్మిన్స్

Budget Friendly Foods: గుండె ఆరోగ్యానికి బడ్జెట్ ఫ్రెండ్లీ ఆహారాలేంటి?

తర్వాతి కథనం
Show comments