Webdunia - Bharat's app for daily news and videos

Install App

కొత్త పార్టీ ఏర్పాటు దిశగా యోగేంద్ర - ప్రశాంత్ భూషణ్‌లు!

Webdunia
మంగళవారం, 31 మార్చి 2015 (10:20 IST)
ఢిల్లీలో ఆమ్ ఆద్మీ పార్టీ రాజకీయాలు రోజుకో విధంగా మారిపోతున్నాయి. ఆ పార్టీ జాతీయ కౌన్సిల్ నుంచి బహిష్కరణకు గురైన పార్టీ సీనియర్ నేతలు యోగేంద్ర యాదవ్, ప్రశాంత్ భూషణ్‌లు కొత్త పార్టీని స్థాపించే దిశగా అడుగులు వేస్తున్నారు. ఇదే జరిగితే ఆప్‌కు పక్కలో బల్లెంలా మారనుంది. 
 
పలు కీలక అంశాలపై ఢిల్లీ ముఖ్యమంత్రి, ఆప్ కన్వీనర్ కేజ్రీవాల్‌పై బహిరంగంగా విమర్శలు ఎక్కుపెట్టిన వీరిద్దరిపై ఇటీవలే పార్టీ చర్యలు తీసుకుంది. పార్టీ చర్యలను తీవ్రంగా పరిగణించిన వీరిద్దరూ పార్టీలో అసంతృప్తులను దరిచేర్చి కొత్త పార్టీని స్థాపించాలని యోచిస్తున్నారు. 
 
ఇందులోభాగంగా రాజ్యాంగ నిర్మాత బీఆర్ అంబేద్కర్ జయంతిని పురస్కరించుకుని ఏప్రిల్ 14వ తేదీన తమ మద్దతుదారులతో కీలక భేటీ నిర్వహించేందుకు వీరు సన్నాహాలు చేస్తున్నట్టు సమాచారం. 
 
ఆప్‌లో లోక్‌పాల్ స్థానం నుంచి బహిష్కరణకు గురైన రాందాస్‌తో పాటు పార్టీని వీడిన సామాజిక ఉద్యమకారిణి మేధా పాట్కర్ తదితరులను కూడా వీరు తమ భేటీకి ఆహ్వానిస్తున్నారు. వీరి యత్నాలు ఫలించి కొత్త పార్టీ అవతరిస్తే, కేజ్రీవాల్‌కు నిజంగా పక్కలో బల్లెం తయారైనట్టే.

మహేష్ బాబు సినిమాపై ఆంగ్ల పత్రికలో వచ్చిన వార్తకు నిర్మాత కె.ఎల్. నారాయణ ఖండన

వీరభద్ర స్వామి ఆలయానికి జూనియర్ ఎన్టీఆర్ గుప్త విరాళం

అల్లు అర్జున్ ఆర్మీ అంత పనిచేసింది.. నాగబాబు ట్విట్టర్ డియాక్టివేట్

రెండు వారాల పాటు థియేటర్లు మూసివేత.. కారణం ఇదే

రాజు యాదవ్‌ చిత్రం ఏపీ, తెలంగాణలో విడుదల చేస్తున్నాం : బన్నీ వాస్

మహిళలు రోజూ ఒక దానిమ్మను ఎందుకు తీసుకోవాలి?

‘కీప్ ప్లేయింగ్‘ పేరుతో బ్రాండ్ అంబాసిడర్ తాప్సీ పన్నుతో కలిసి వోగ్ ఐవేర్ క్యాంపెయిన్

కరివేపాకు టీ ఆరోగ్య ప్రయోజనాలు

వేరుశనగ పల్లీలు ఎందుకు తినాలి?

టీ తాగేవారు తెలుసుకోవాల్సిన విషయాలు

Show comments