Webdunia - Bharat's app for daily news and videos

Install App

అమ్మో అంతనా...! యోగా డే ఖర్చు.. రూ. 32 కోట్లు. మ్యాట్స్‌ ఖర్చు రూ. 92లక్షలు

Webdunia
శుక్రవారం, 31 జులై 2015 (10:32 IST)
యోగా డే సందర్భంగా అయిన ఖర్చు ఎంతో తెలుసా..! రూ. 32 కోట్లు. ఇది కేవలం కేంద్ర ప్రభుత్వం అందునా కేవలం రాజ్‌పథ్ వద్ద ఖర్చు చేసిన సొమ్ము మాత్రమే. ఇక అక్కడ యోగా చేసిన వారికి కొన్న మ్యాట్స్ ఖర్చే రూ. 92 లక్షలు. 
 
జూన్‌ 21న అంతర్జాతీయ యోగా దినోత్సవం సందర్భంగా ఢిల్లీలోని రాజ్‌పథ్‌ వద్ద భారీ యోగా కార్యక్రమం చేపట్టిన విషయం తెలిసిందే. ఈ యోగా డేలో ఉపయోగించిన మ్యాట్స్‌ కోసం రూ. 92లక్షలు ఖర్చు చేశారు. ఆయుష్‌ మంత్రి శ్రీపాల్‌ నాయక్‌ ఈ విషయాన్ని రాజ్యసభలో రాతపూర్వకంగా తెలిపారు. ఎంఎస్‌ ఆర్క్‌ కాన్సెప్ట్‌ ప్రయివేటు లిమెటెడ్‌ వారు యోగా డే కార్యక్రమ బాధ్యతలు తీసుకున్నారు. 
 
ఇందుకోసం 37వేల యోగా మ్యాట్స్‌ను చైనా నుంచి దిగుమతి చేసుకున్నట్లు మంత్రి తెలిపారు. పన్నులతో సహా వీటి కోసం రూ. 92.5లక్షలు ఖర్చు చేసినట్లు పేర్కొన్నారు. యోగా దినోత్సవ నిర్వహణ కోసం రూ.32 కోట్ల రూపాయలను ఖర్చుచేసినట్లు ఇటీవల కేంద్ర ప్రభుత్వం ఓ ప్రకటనలో తెలిపింది. అయితే ఇక రాష్ట్ర ప్రభుత్వాలు, ప్రైవేటు సంస్థలు చేసిన ఖర్చు ఎంతో..?  

రాజకీయాల్లోకి వచ్చినా సినిమాలకు దూరం కాను.. కంగనా రనౌత్

ధనుష్ నటిస్తున్న రాయన్ ఫస్ట్ సింగిల్‌ కు సమయం వచ్చింది!

మలేషియా లో నవతిహి ఉత్సవం 2024 పేరుతో తెలుగు సినిమా 90 ఏళ్ల వేడుక ఖరారు

వెస్ట్రన్ కంట్రీస్ బాటలోనే బాహుబలి: క్రౌన్ ఆఫ్ బ్లడ్ చేశాం : ఎస్ఎస్ రాజమౌళి

హీరో అల్లు అర్జున్‍‌ను పెళ్లి చేసుకుంటానంటున్న తమిళ నటి!!

శరీరంలోని కొవ్వు కరగడానికి సింపుల్ సూప్

acidity కడుపులో మంట తగ్గటానికి ఈ చిట్కాలు

ఆ సమస్యలకు వెల్లుల్లి వైద్యం, ఏం చేయాలంటే?

బాదంపప్పును ఎండబెట్టినవి లేదా నానబెట్టివి తినాలా?

ఎన్నికల సీజన్‌లో కొన్ని బాదంపప్పులతో చురుకుగా, శక్తివంతంగా ఉండండి

Show comments