Webdunia - Bharat's app for daily news and videos

Install App

గర్భానికి తండ్రే కారణం.. మైనర్ బాలిక గర్భస్రావానికి అనుమతి.. వైద్యుల సలహాతో?

హర్యానాలో పదేళ్ల మైనర్ గర్భస్రావానికి అనుమతి లభించినట్లు వార్తలు వస్తున్నాయి. రోహ్‌టక్‌కు చెందిన మైనర్ బాలిక తన పెంపుడు తండ్రిచే అత్యాచారానికి గురైంది. అనారోగ్యం కారణంగా ఆస్పత్రికి చిన్నారిని తీసుకెళ్

Webdunia
గురువారం, 18 మే 2017 (16:19 IST)
హర్యానాలో పదేళ్ల మైనర్ గర్భస్రావానికి అనుమతి లభించినట్లు వార్తలు వస్తున్నాయి. రోహ్‌టక్‌కు చెందిన మైనర్ బాలిక తన పెంపుడు తండ్రిచే అత్యాచారానికి గురైంది. అనారోగ్యం కారణంగా ఆస్పత్రికి చిన్నారిని తీసుకెళ్లిన ఆ తల్లికి వైద్యులు షాకిచ్చారు. చిన్నారి గర్భంగా ఉందని తేల్చారు. దీంతో మైనర్ బాలిక వద్ద జరిపిన విచారణలో తాను అత్యాచారానికి గురైనట్లు తెలిసింది. 
 
తన గర్భానికి కారణం పెంపుడు తండ్రేనని వెల్లడించింది. ఈ విషయాన్ని బయటికి చెప్తే.. చంపేస్తానని బెదిరించడంతో మైనర్ బాలిక ఈ వ్యవహారాన్ని దాచేసినట్లు పోలీసులు తెలిపారు. బాధితురాలి తల్లి ఇచ్చిన ఫిర్యాదు మేరకు రంగంలోకి దిగిన పోలీసులు మైనర్‌పై అత్యాచారానికి పాల్పడిన వ్యక్తిని అరెస్ట్ చేశారు. 
 
ఇంకా మైనర్ బాలిక అబార్షన్‌కు అనుమతి ఇవ్వాలని బాధితురాలి తల్లితో పాటు బంధువులు రోహ్‌టక్ కోర్టును ఆశ్రయించారు. ఇందుకు కోర్టు కూడా అనుమతి ఇచ్చింది. వైద్యుల సలహా మేరకు ఆ బాలికకు గర్భస్రావానికి అనుమతి ఇవ్వాలని సిఫార్సు చేసింది.

బులుగు రంగు చీరలో మెరిసిన జాన్వీ కపూర్

కేన్స్ ఫిల్మ్ ఫెస్టివల్‌లో ‘కన్నప్ప టీం సందడి- ఆకట్టుకున్న కన్నప్ప టీజర్

భవితను మార్చిన వ్యక్తి కథతో విజయ్ ఆంటోనీ తుఫాన్ రాబోతుంది

అనుష్క, విజయశాంతి లతో మూవీ చేస్తానంటున్న నిర్మాత ఎస్ కే బషీద్

బెంగళూరు రేవ్ పార్టీ.. ఎంట్రీ ఫీజు రూ.50 లక్షలు

చియా గింజలు తింటే ఎలాంటి ఉపయోగాలు?

రెక్టల్ క్యాన్సర్ రోగిని కాపాడేందుకు ట్రూబీమ్ రాపిడార్క్ సాంకేతికత: అమెరికన్ ఆంకాలజీ ఇన్‌స్టిట్యూట్

డ్రై ఫ్రూట్స్‌ను ఖాళీ కడుపుతో తింటే ఎంత లాభమో?

నారింజ పండ్లు తీసుకుంటే.. డీహైడ్రేషన్‌ పరార్.. గుండె ఆరోగ్యానికి మేలు..

పాలులో రొట్టె కలిపి తింటే 8 అద్భుతమైన ప్రయోజనాలు, ఏంటవి?

తర్వాతి కథనం
Show comments