Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఇది వివక్ష.. చట్ట విరుద్ధం - ఎస్బీఐకు జాతీయ మహిళా కమిషన్ నోటీసు

Webdunia
శనివారం, 29 జనవరి 2022 (22:04 IST)
మూడు నెలల గర్భంతో ఉన్న మహిళను ఉద్యోగంలో చేరకుండా ఆపినందుకు భారతీయ స్టేట్ బ్యాంకు (ఎస్.బి.ఐ) అధికారుల పట్ల జాతీయ మహిళా కమిషన్ ఆగ్రహం వ్యక్తం చేసింది. అంతటితో ఊరుకోని మహిళా కమిషన్ ఎస్బీఐకు నోటీసు జారీచేసింది. ఎస్.బి.ఐ అధికారులు ఈ మహిళను తాత్కాలిక ఫిట్ అని పేర్కొందని కమిషన్ ఛైర్‌పర్సన్ స్వాతి మలివాల్ ట్వీట్ చేశారు. 
 
స్టేట్ బ్యాంకు ఆఫ్ ఇండియా మూడు నెలల కంటే ఎక్కువ గర్భిణీ స్త్రీలను సేవలో చేరకుండా నిరోధించడానికి మార్గదర్శకాలను జారీచేసిందని కమిషన్ చైర్‌పర్సన్ స్వాతి మలివాల్ ట్వీట్ చేశారు. బ్యాంకు చర్య వివక్షాపూరితమైనదని, చట్టవిరుద్ధమని ఆమె వ్యాఖ్యానించారు. ఇది చట్ట ప్రకారం అందించే ప్రసూతి ప్రయోజనాలపై ప్రభావం చూపుతుందన్నారు. 
 
స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా 3 నెలల కంటే ఎక్కువ గర్భిణీ స్త్రీలను సేవలో చేరకుండా నిరోధించడానికి మార్గదర్శకాలను జారీ చేసింది. వారిని తాత్కాలికంగా అన్‌ఫిట్ అని పేర్కొంది. ఇది వివక్ష. చట్ట విరుద్ధం. ఈ మహిళ వ్యతిరేక పాలన ఉపరించుకోవాలని కోరుతూ ఎస్బీఐకు నోటీసులు జారీ చేయడం జరిగింది. అని చెప్పారు. కాగా, గత నెల 31వ తేదీన ఎస్బీఐ జారీచేసిన సర్క్యులర్‌లో మూడు నెలల కంటే ఎక్కువ గర్భిణీ స్త్రీలను పనిలో చేరకుండా నిలిపివేసింది. 

సంబంధిత వార్తలు

గేమ్ ఛేంజర్ కోసం చెన్నై వెళుతున్న రామ్ చరణ్ లేటెస్ట్

అపార్ట్‌మెంట్‌లో శవమై కనిపించిన భోజ్‌పురి నటి అమృత పాండే.. ఏమైంది?

కల్కి 2898 ఎడి చిత్రంలో ప్రభాస్, కమల్ హాసన్ పాత్రలు స్పూర్తి వారివేనట

అశోక్ గల్లా, వారణాసి మానస చిత్రం పేరు దేవకీ నందన వాసుదేవ

కామెడీ, హర్రర్ తో తిండిబోతు దెయ్యం ప్రారంభం

ఉదయం ఖాళీ కడుపుతో కాఫీ తాగడం మంచిదా చెడ్డదా?

వేసవిలో సపోటా జ్యూస్ తాగితే?

వేసవిలో మంచినీళ్లు ఇలా తాగితే డీహైడ్రేషన్‌కి దూరం

యూరిక్ యాసిడ్ పెరుగుతోందని తెలుసుకునేది ఎలా?

ఫెర్టిలిటీపై ఫెర్టిలిటీ నిపుణుల ఫెర్టిజ్ఞాన్ సదస్సు

తర్వాతి కథనం
Show comments