Webdunia - Bharat's app for daily news and videos

Install App

ప్రియురాలి సలహాను పాటించిన ప్రియుడు.. భార్యను అలా చేశాడు..?

Webdunia
బుధవారం, 14 నవంబరు 2018 (12:57 IST)
స్మార్ట్ ఫోన్ల కాలం జరుగుతోంది. వీటి ప్రభావంతో మానవీయ విలువలు మంటగలిసిపోతున్నాయి. సోషల్ మీడియా ద్వారా చోటుచేసుకునే నేరాల సంఖ్య పెరిగిపోతున్నాయి. అక్రమ సంబంధాలు పెచ్చరిల్లిపోతున్నాయి. తాజాగా వివాహితుడైన ఓ వ్యక్తితో అక్రమ సంబంధం పెట్టుకున్న యువతి అతడిని రహస్యంగా పెళ్లి చేసుకుంది. అంతేగాకుండా.. అదే వ్యక్తి చేతనే అతడి భార్యను హతమార్చింది. ఈ ఘటన హర్యానా, గురుగ్రామ్‌లో చోటుచేసుకుంది.  
 
వివరాల్లోకి వెళితే.. గురుగ్రామ్‌లోని వ్యాలీ వ్యూ ఎస్టేట్‌ అపార్ట్‌మెంట్‌లో విక్రమ్ సింగ్ చౌహాన్, దీపిక దంపతులు నివాసం ఉంటున్నారు. ఈ నేపథ్యంలో అదే ప్రాంతంలో ఉంటున్న షెఫాలీ భాసిన్ తివారీ అనే మహిళతో విక్రమ్‌కు పరిచయం ఏర్పడింది. అది కాస్తా అక్రమ సంబంధానికి దారితీసింది. దీంతో వీరిద్దరూ ఆరు నెలల క్రితం రహస్యంగా పెళ్లి చేసుకున్నారు. ఈ అక్రమ సంబంధం గురించి తెలుసుకున్న దీపిక భర్తను నిలదీసింది. ఈ సందర్భంగా భార్యాభర్తల మధ్య వాగ్వాదం చోటుచేసుకుంది. 
 
దీంతో విక్రమ్ వెంటనే షెఫాలీకి మెసేజ్ పెట్టాడు. వెంటనే స్పందించిన ఆమె.. దీపికను వాళ్లు నివాసముంటున్న ఎనిమిదో అంతస్తు నుంచి తోసేయాలని సూచించింది. ఆ సలహా నచ్చడంతో భార్యను అపార్ట్‌మెంట్ ఎనిమిదో అంతస్తు నుంచి విక్రమ్ తోసేశాడు. ఈ ఘటనలో విక్రమ్ భార్య తీవ్ర గాయాలతో మృతి చెందింది. అంతేగాకుండా.. ప్రమాదవశాత్తూ తన భార్య బిల్డింగ్ నుంచి పడిపోయిందని చెప్పాడు. 
 
అయితే విక్రమ్ ప్రవర్తనను అనుమానించిన పోలీసులు అతని కాల్ డేటా, మెసేజ్‌ను పరిశీలించగా, షెఫాలీతో కలసి దీపిక హత్యకు కుట్ర పన్నినట్లు తేలింది. దీంతో ఇద్దరు నిందితులపై కేసు నమోదుచేసిన పోలీసులు దర్యాప్తు చేపట్టారు.

సంబంధిత వార్తలు

సినారేకు నివాళిగా రాబోతున్న "నా ఉచ్ఛ్వాసం కవనం" ప్రోగ్రాం కర్టెన్ రైజర్ కార్యక్రమం

కౌంట్‌డౌన్ ప్రారంభం: మాగ్నమ్ ఓపస్ 'కల్కి 2898 AD' అప్‌డేట్

లాక్‌డౌన్‌లో పవిత్రతో ఎఫైర్, నా ముఖం చూస్తేనే అసహ్యించుకునేవాడు: చంద్రకాంత్ భార్య

యేవమ్ చిత్రంలో ‘వశిష్ట ఎన్ సింహ’ గా యుగంధర్

శ్రీ గణేష్‌ దర్శకత్వంలో ద్విభాషా చిత్రం సిద్దార్థ్ 40 అనౌన్స్ మెంట్

ఫోలిక్యులర్ లింఫోమా స్టేజ్ IV చికిత్సలో విజయవాడ అమెరికన్ ఆంకాలజీ ఇన్‌స్టిట్యూట్ విశేషమైన విజయం

చేతులతో భోజనం తినడం వల్ల 5 ఉత్తమ ఆరోగ్య ప్రయోజనాలు

పెద్ద ఉల్లిపాయలు తింటే గొప్ప ప్రయోజనాలు, ఏంటవి?

ఆదివారం అంటేనే బిర్యానీ లాగిస్తున్నారా? ఇవి తప్పవండోయ్!

పనస పండ్లలోని పోషకాలేంటి..? ఎవరు తినకూడదు?

తర్వాతి కథనం
Show comments