Webdunia - Bharat's app for daily news and videos

Install App

500 కేజీల ఈజిప్టు మహిళకు ముంబైలో చికిత్స.. సుష్మా స్వరాజ్ ఉదారత వల్లే?

80 కేజీలు కాదు.. 100 కేజీలు కాదు. ఏకంగా అరటన్ను బరువుతో కూడిన మహిళ గురించే ప్రస్తుతం సోషల్ మీడియాలో జోరుగా చర్చ సాగుతోంది. భారీ బరువుతో ఎక్కడికీ కదల్లేక మంచానికే పరిమితమైన ఓ ఈజిప్టు మహిళకు భారత్‌ లో చ

Webdunia
బుధవారం, 7 డిశెంబరు 2016 (10:54 IST)
80 కేజీలు కాదు.. 100 కేజీలు కాదు. ఏకంగా అరటన్ను బరువుతో కూడిన మహిళ గురించే ప్రస్తుతం సోషల్ మీడియాలో జోరుగా చర్చ సాగుతోంది. భారీ బరువుతో ఎక్కడికీ కదల్లేక మంచానికే పరిమితమైన ఓ ఈజిప్టు మహిళకు భారత్‌ లో చికిత్స పొందేందుకు అనుమతి లభించింది. ఈజిప్టులోని భారత రాయబార కార్యాలయం ఆమెకు వీసా మంజూరు చేసింది. 
 
భారత విదేశాంగ మంత్రి సుష్మా స్వరాజ్‌ ఉదారత వల్లే ఆమెకు ఈ వీసా దక్కింది. ఎమాన్‌ అహ్మద్‌(36) ఈజిప్టులోని అలెగ్జాండ్రియా ప్రాంతానికి చెందిన మహిళకు భారత్‌లో చికిత్స చేయనుంది. సదరు మహిళ 500 కేజీల బరువుతుంది. స్థూలకాయం కారణంగా పాఠశాలకు వెళ్లే సమయంలోనే బరువు పెరగడం ప్రారంభమైంది. దీంతో చదువు మధ్యలోనే ఆపేసింది. 
 
అయితే, ఆమెకు ముంబయిలోని వైద్యులు చికిత్స చేసేందుకు ముందుకొచ్చారు. ఆమెకు వీసా ఇచ్చి ముంబయిలో చికిత్స పొందేందుకు అవకాశం ఇ‍వ్వాలని బేరియాట్రిక్‌ సర్జన్‌ విదేశాంగ మంత్రి సుష్మా స్వరాజ్‌ కు విజ్ఞప్తి చేశారు. ఆస్పత్రిలో అనారోగ్యంతో చికిత్స పొందుతున్నప్పటికీ సుష్మా చేయూత నివ్వడంపై దేశ వ్యాప్తంగా ప్రశంసలు వెల్లువెత్తుతున్నాయి.  ప్రస్తుతం సుష్మా స్వరాజ్‌ మూత్రపిండాల సమస్యతో ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న సంగతి తెలిసిందే. 
 
దీనికి స్పందించిన సుష్మా 'ఈ విషయాన్ని నా దృష్టికి తీసుకొచ్చినందుకు ధన్యవాదాలు. ఆమెకు మేం తప్పకుండా సహాయం చేస్తాం' అంటూ ట్వీట్ చేశారు. ఆ మాట ప్రకారమే మంగళవారం భారత రాయబార కార్యాలయం ఎమాన్‌ కు వీసా మంజూరు చేసింది. దీంతో త్వరలోనే ఆమె భారత్‌‌కు వచ్చి ముంబయిలో చికిత్స పొందనుంది.
అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Kingdom: యాక్షన్ ప్రోమోతో విజయ్ దేవరకొండ కింగ్‌డమ్ కొత్త అప్ డేట్

మాధవరం గామాన్ని ఆదర్శంగా Mr. సోల్జర్ చిత్రం సిద్ధం

AR Rahman: ఎస్‌జె సూర్య పాన్ ఇండియా ఫిల్మ్ కిల్లర్ కు ఏఆర్ రెహమాన్ మ్యూజిక్

విజయ్ సేతుపతి, సంయుక్త, పూరి జగన్నాథ్ చిత్రం రెగ్యులర్ షూటింగ్ ప్రారంభం

Sridevi: కేజేఆర్ హీరోగా కోర్ట్ ఫేమ్ శ్రీదేవి హీరోయిన్ గా చిత్రం

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఆ మొక్క ఆకులో నానో బంగారు కణాలు!!

బరువు తగ్గాలనుకుంటున్నారా? సగ్గుబియ్యం ఓ వరం!

నేరేడు పళ్ల సీజన్... నేరేడు ప్రయోజనాలెన్నో!

Back pain: మహిళలకు వెన్నునొప్పి ఎందుకు వస్తుందో తెలుసా?

చక్కగా కొవ్వును కరిగించే చెక్క

తర్వాతి కథనం
Show comments