Webdunia - Bharat's app for daily news and videos

Install App

బ్యాంక్ మేనేజర్ కోరిక తీర్చమన్నాడు.. అంతే అపరకాళిగా మారిపోయింది.. కర్రతో?

మహిళలపై అకృత్యాలు పెచ్చరిల్లిపోతున్నాయి. అయినా దాడులు, వేధింపులకు మాత్రం బ్రేక్ పడట్లేదు. తన కోరిక తీర్చాలనే బ్యాంక్ మేనేజర్‌కు ఆ మహిళ చుక్కలు చూపించింది

Webdunia
మంగళవారం, 16 అక్టోబరు 2018 (17:21 IST)
మహిళలపై అకృత్యాలు పెచ్చరిల్లిపోతున్నాయి. అయినా దాడులు, వేధింపులకు మాత్రం బ్రేక్ పడట్లేదు. తన కోరిక తీర్చాలనే బ్యాంక్ మేనేజర్‌కు ఆ మహిళ చుక్కలు చూపించింది. ఈ ఘటన కర్ణాటకలోని దావణగెరెలో జరిగింది. 
 
వివరాల్లోకి వెళ్తే, రుణం కోసం ఓ మహిళ బ్యాంకుకు వెళ్లింది. మేనేజర్ లోను గురించి మాట్లాడకుండా.. లోను మంజూరు చేయాలంటే.. తన కోరిక తీర్చాలన్నాడు. అంతటితో ఆగకుండా సదరు బ్యాంక్ మేనేజర్ వెకిలి చేష్టలు చేశాడు. దీంతో ఆవేశానికి లోనైన ఆ మహిళ అపరకాళిగా మారిపోయింది. అంతే కర్ర తీసుకుని అతనికి దేహశుద్ధి చేసింది. 
 
చెప్పుతో కొట్టింది. బయటకు లాక్కొచ్చి అతన్ని చితకబాదింది. తనను వదిలేయాలని, మరోసారి ఇలాంటి తప్పు చేయబోనని ఆమె కాళ్లు పట్టుకున్నాడు బ్యాంక్ మేనేజర్. బ్యాంకు మేనేజర్ అయినా తన వద్ద వికృతంగా ప్రవర్తించిన కారణంగా అక్కడికక్కడే అతనికి బుద్ధి చెప్పడంపై నెటిజన్లు ఆ మహిళలపై ప్రశంసలు గుప్పిస్తున్నారు. 
 
ఇలా ధైర్యంతో ఎదురు తిరిగితే వేధింపులకు సంబంధించిన కేసులు తగ్గుతాయని నెటిజన్లు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. ఈ ఘటనకు సంబంధించిన వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Ramcharan & Alluarjun : పుష్ప 2 వర్సెస్ గేమ్ ఛేంజర్ - కలెక్షన్లకు రేవంత్ రెడ్డి బ్రేక్?

గేమ్ చేంజ‌ర్‌ నుంచి క్రేజీ డోప్ సాంగ్ వచ్చేసింది

Poonam Kaur: పుష్ప -2 ‌పై పూనమ్ కౌర్ ప్రశంసలు.. జాతర సీన్ అదిరింది.. స్పందించేదేలే!

సంధ్య థియేటర్‌ నుంచి బయటికి అల్లు అర్జున్‌.. సీసీ టీవీ దృశ్యాలు వైరల్‌ (video)

అల్లు అర్జున్ సినిమాల్లో మాదిరి నిజ జీవితంలో నటిస్తున్నట్లు కనిపిస్తోంది.. చామల

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

రాగి పాత్రలో మంచినీటిని తాగితే 7 ఫలితాలు

హైదరాబాద్ లోని నాగోల్‌లో రిలయన్స్ రిటైల్ ‘యూస్టా’ సరికొత్త స్టోర్ ప్రారంభం

పాలు తాగితే 8 ప్రయోజనాలు, ఏమిటి?

శీతాకాలంలో తినాల్సిన ఆహార పదార్థాలు ఏంటి?

ప్రతిష్టాత్మక IIT మద్రాస్ CSR అవార్డు 2024 గెలుచుకున్న హెర్బాలైఫ్ ఇండియా

తర్వాతి కథనం