Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఆవు పొలంలోకి వచ్చిన పాపానికి మహిళను వివస్త్ర చేశారు.. చేతి వేళ్ళను కోసేశారు..!

ఆవు పొలంలోకి వచ్చిన పాపానికి ఓ మహిళపై దారుణంగా ప్రవర్తించారు ఆ ఏడుగురు మృగాళ్లు. మహిళను వివస్త్ర చేసి దారుణంగా కొట్టారు. ఆపై పదునైన ఆయుధాలతో ఆమె చేతి వేళ్లను కోసిపారేశారు. ఈ ఘటన పశ్చిమ బెంగాల్‌లోని మ

Webdunia
మంగళవారం, 19 జులై 2016 (13:00 IST)
ఆవు పొలంలోకి వచ్చిన పాపానికి ఓ మహిళపై దారుణంగా ప్రవర్తించారు ఆ ఏడుగురు మృగాళ్లు. మహిళను వివస్త్ర  చేసి దారుణంగా కొట్టారు. ఆపై పదునైన ఆయుధాలతో ఆమె చేతి వేళ్లను కోసిపారేశారు. ఈ ఘటన పశ్చిమ బెంగాల్‌లోని మాల్డా జిల్లాలో చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే మాల్డా జిల్లాకు చెందిన ఓ మహిళ సాయంత్రం పూట ఆవును ఇంట్లోని పాకలో కట్టేసింది. 
 
అయితే ఆ ఆవు అర్థరాత్రి పూట తాడును విడిపించుకుని పక్కనే ఉన్న హరున్ షేక్ పొలంలోకి వెళ్ళింది. దీంతో కోపంతో ఊగిపోయిన హరున్ షేక్.. తన పంటను మేసిందనే కోపంతో ఏడుగురుతో కలిసి ఆ మూగజీవిని కాళ్లు విరిగేలా కొట్టి హింసించారు. దాన్ని చూసిన ఆ మహిళ కొట్టొద్దని అడ్డు రావడంతో.. ఆమెను వివస్త్రను చేసి చితకబాదారు. అంతటితో ఆగకుండా పదునైన చాకుతో ఆమె చేతి వేళ్ళను కోసేశారు. 
 
అడ్డొచ్చిన ఆమె కొడుకును కూడా చితక్కొట్టారు. వారి కేకలు విని గ్రామస్తులు అక్కడికి చేరారు. గ్రామస్తుల రాకను గమనించిన ఆ దుర్మార్గులు అక్కడి నుంచి ఉడాయించారు. తీవ్ర గాయాలపాలైన ఆ మహిళను, ఆమె కొడుకును ఆసుపత్రికి తరలించారు. ఆవు పొలంలోకి వచ్చిన కారణంతో తన భార్యను చంపాలని చూశారని.. అంతేగాకుండా కేసు నమోదు చేస్తే అంతు చూస్తామంటూ బెదిరిస్తున్నారని బాధితురాలి భర్త వాపోతున్నారు.

పెళ్లిపీటలెక్కనున్న హీరో ప్రభాస్.. ట్వీట్ చేసిన బాహుబలి!!

మహేష్ బాబు సినిమాపై ఆంగ్ల పత్రికలో వచ్చిన వార్తకు నిర్మాత కె.ఎల్. నారాయణ ఖండన

వీరభద్ర స్వామి ఆలయానికి జూనియర్ ఎన్టీఆర్ గుప్త విరాళం

అల్లు అర్జున్ ఆర్మీ అంత పనిచేసింది.. నాగబాబు ట్విట్టర్ డియాక్టివేట్

రెండు వారాల పాటు థియేటర్లు మూసివేత.. కారణం ఇదే

మహిళలు రోజూ ఒక దానిమ్మను ఎందుకు తీసుకోవాలి?

‘కీప్ ప్లేయింగ్‘ పేరుతో బ్రాండ్ అంబాసిడర్ తాప్సీ పన్నుతో కలిసి వోగ్ ఐవేర్ క్యాంపెయిన్

కరివేపాకు టీ ఆరోగ్య ప్రయోజనాలు

వేరుశనగ పల్లీలు ఎందుకు తినాలి?

టీ తాగేవారు తెలుసుకోవాల్సిన విషయాలు

తర్వాతి కథనం
Show comments