Woman: చికెన్ వండలేదని భార్యను హత్య చేశాడు.. దుప్పటిలో చుట్టి గంగానదిలో పారేశాడు

సెల్వి
శనివారం, 13 సెప్టెంబరు 2025 (10:27 IST)
Chicken
భార్యాభర్తల గొడవలు ప్రస్తుతం హత్యలకు దారితీస్తున్నాయి. క్షణికావేశానికి కోపానికి గురై భాగస్వాములను దారుణంగా హత్య చేస్తున్నారు. తాజాగా యూపీలో భార్యను భర్త హత్య చేశాడు. వివరాల్లోకి వెళ్తే.. ఉత్తరప్రదేశ్‌లోని అమ్రోహాలో 21 ఏళ్ల రీనా అనే యువతికి వివాహం జరిగింది. 
 
అయితే ఇంట్లో చికెన్ వండకుండా వెజ్ కర్రీ వండినందుకు ఓ భర్త భార్యపై తీవ్రంగా దాడి చేశాడు. ఈ క్రమంలో ఆ భార్య ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకుంది. అయితే ఇది చికెన్ వండలేదని కాదని, వరకట్న హత్య అని కుటుంబ సభ్యులు అంటున్నారు. కావాలనే భర్త ఆమెను హత్య చేసి ఆత్మహత్యగా చిత్రీకరించాడని కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు. 
 
భార్యను చంపిన తర్వాత నిగమ్ బంధువుల సహాయంతో రీనా మృతదేహాన్ని ఒక దుప్పటిలో చుట్టి మట్టితో నింపి, గంగానదిలో పడేశాడు. ఆపై భార్య కనిపించలేదని డ్రామా చేసాడు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు జరపడంతో భర్తే హంతకుడిని తేలింది. నిగమ్‌తో పాటు అతని బంధువులను పోలీసులు అరెస్టు చేశారు. వీరికి కఠిన శిక్ష విధించాలని బాధితరాలి కుటుంబ సభ్యులు డిమాండ్ చేస్తున్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Meesala Pilla: చిరంజీవి చరిష్మా అలాంటింది.. ఇండియన్ టాప్ ట్రెండింగ్‌లో మీసాల పిల్ల (video)

ఆర్టిస్టుల సమస్యలను దాటి తెరకెక్కిన పండంటి కాపురం ఒక తెలుగు క్లాసిక్

Bandla Ganesh: బండ్ల గణేష్ ఇంట్లో దీపావళి పార్టీ కారణం అదే..

Pawan Kalyan: పవన్ కల్యాణ్ సినిమా ప్రయాణం ఇంకా ముగియలేదా? నెక్ట్స్ సినిమా ఎవరితో?

K Ramp: కొందరు కావాలనే K-ర్యాంప్ మూవీపై పక్షపాతం చూపిస్తున్నారు : నిర్మాత

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

మిస్సోరీలో దిగ్విజయంగా నాట్స్ వాలీబాల్, త్రోబాల్ టోర్నమెంట్స్

మసాలా టీ తాగడం వలన కలిగే ఆరోగ్య ప్రయోజనాలు ఏంటి?

ఆరోగ్యకరమైన కేశాల కోసం వాల్ నట్స్

స్వ డైమండ్స్ బ్రాండ్ అంబాసిడర్‌గా ప్రీతి జింటా

ప్రపంచ ఆర్థరైటిస్‌ దినోత్సవం: రుమటాయిడ్ ఆర్థరైటిస్‌ను ముందస్తుగా గుర్తించడం ఎందుకు ముఖ్యం?

తర్వాతి కథనం
Show comments