Webdunia - Bharat's app for daily news and videos

Install App

నా భార్యను నిత్యానంద చెరబట్టాడు.. రక్షించండి... కలెక్టర్‌కు వినతి

వివాదాస్పద ఆధ్యాత్మికవేత్త నిత్యానంద స్వామి మరోమారు వార్తలకెక్కారు. తన భార్యను నిత్యానంద చెరబట్టాడనీ, ఆయననుంచి తన భార్యను రక్షించి తనకు అప్పగించాలని నామక్కల్ జిల్లా కలెక్టర్‌కు ఓ వ్యక్తి వినతిపత్రం అం

Webdunia
మంగళవారం, 12 జూన్ 2018 (10:50 IST)
వివాదాస్పద ఆధ్యాత్మికవేత్త నిత్యానంద స్వామి మరోమారు వార్తలకెక్కారు. తన భార్యను నిత్యానంద చెరబట్టాడనీ, ఆయననుంచి తన భార్యను రక్షించి తనకు అప్పగించాలని నామక్కల్ జిల్లా కలెక్టర్‌కు ఓ వ్యక్తి వినతిపత్రం అందజేశాడు. తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ వివరాలను పరిశీలిస్తే...
 
నామక్కల్ పట్టణానికి చెందిన ఓ వ్యక్తి కలెక్టర్‌కు ఇచ్చిన వినతిపత్రంలో తన భార్య, కుమారుడు కొన్ని నెలల క్రితం బెంగుళూరులోని నిత్యానంద ఆశ్రమానికి వెళ్లారని, ఆ తర్వాత వారు తిరిగి రాలేదని పిటిషన్‌లో బాధితుడు పేర్కొన్నాడు. 
 
ఈ విషయం గురించి ఇప్పటికే నామక్కల్ టౌన్ పోలీసులకు ఫిర్యాదు చేయగా, బెంగుళూరుకు వెళ్లిన పోలీసులు తన కుమారుడిని విడిపించారని తెలిపాడు. కానీ, తన భార్య ఆచూకీ మాత్రం ఇంత వరకు తెలియరాలేదని వాపోయాడు.
 
ఫలితంగా తాను గత ఎనిమిది నెలలుగా మానసిక వేదనను అనుభవిస్తున్నట్టు చెప్పాడు. ప్రస్తుతం తనకు ఆత్మహత్య తప్పమరో దారి లేదని... తన భార్యను నిత్యానంద నుంచి విడిపించాలని కోరాడు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

మెగాస్టార్ చిరంజీవి 'విశ్వంభర' నుంచి క్రేజీ అప్‌డేట్!

ఎఫ్ఎన్ సీసీ లీజు విషయం ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తా : దిల్ రాజు

Pradeep: పబ్లిసిటీకి ప్లస్ అవుతుందనే పవన్ కళ్యాణ్ టైటిల్ పెట్టాం : డైరెక్టర్స్ నితిన్ & భరత్

పాము నేపథ్యంలో ఫణి మోషన్ పోస్టర్ లాంఛ్ చేసిన కె రాఘవేంద్రరావు

Dil Raju: శిరీష్ కొడుకు ఆశిష్ హీరోగా దిల్ రాజు 60వ మూవీ ప్రకటన

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఈ ప్రపంచ ఆరోగ్య దినోత్సవ వేళ, కాలిఫోర్నియా బాదంపప్పులతో మీ ఆరోగ్యం

కిడ్నీ స్టోన్స్ తగ్గించేందుకు సింపుల్ టిప్స్

వేసవిలో లోదుస్తులు బిగుతుగా ధరించారంటే? రాత్రిపూట వేసుకోవద్దు..

వారానికి మూడు రోజుల పాటు కొబ్బరి నీళ్లు తాగితే?

హింద్‌వేర్ స్మార్ట్ అప్లయెన్సెస్ వారి మార్కస్ 80 బిల్ట్-ఇన్ ఓవెన్‌తో వంట

తర్వాతి కథనం
Show comments