Webdunia - Bharat's app for daily news and videos

Install App

రిక్షావాలాతో అఫైర్.. అడ్డొచ్చిన భర్తను చంపేసిన భార్య

విద్యావంతురాలైన ఓ మహిళ ఉద్యోగిని రిక్షావాలాతో శారీరక సంబంధం పెట్టుకుని, అడ్డొచ్చిన భర్తను కడతేర్చింది. ఈ దారుణం గుజరాత్‌ రాష్ట్రంలోని వల్సాడ్‌లో జరిగింది. తాజాగా వెలుగులోకి వచ్చిన ఈవివరాలను పరిశీలిస్త

Webdunia
మంగళవారం, 23 జనవరి 2018 (09:01 IST)
విద్యావంతురాలైన ఓ మహిళ ఉద్యోగిని రిక్షావాలాతో శారీరక సంబంధం పెట్టుకుని, అడ్డొచ్చిన భర్తను కడతేర్చింది. ఈ దారుణం గుజరాత్‌ రాష్ట్రంలోని వల్సాడ్‌లో జరిగింది. తాజాగా వెలుగులోకి వచ్చిన ఈవివరాలను పరిశీలిస్తే, 
 
ఫల్ఘరా గ్రామంలో జయసుఖ్ రామా ఘోడియాపటేల్ అనే వ్యక్తికి భార్య శోభన, ఇద్దరు పిల్లలు ఉన్నారు. శోభన ప్రతీరోజూ అజిత్ అనే వ్యక్తి రిక్షాలో కూర్చుని ఉద్యోగానికి వెళుతుంటుంది. ఈ నేపథ్యంలో వారిద్దరి మధ్య వివాహేతర సంబంధం ఏర్పడింది. ఈ విషయం జయసుఖ్‌కు తెలిసింది. 
 
దీంతో భార్యాభర్తల మనస్పర్థలు తలెత్తాయి. తర్వాత శోభనతోపాటు భర్త కూడా ఆదే రిక్షాలో ఆఫీసుకు రాకపోకలు సాగించడం మొదలు పెట్టాడు. ఈ క్రమంలో సోమవారం భార్యాభర్తలిద్దరూ అదే రిక్షాలో కూర్చున్నారు. దారిలో నిర్మానుష్య ప్రదేశం రాగానే శోభన ఆమె ప్రేమికుడైన రిక్షావాలాలు కలిసి జయసుఖ్‌పై మారణాయుధంతో దాడిచేసిన చంపేశారు. 
 
మృతదేహాన్ని రోడ్డు పక్కన పడేసి ఇరువురూ పరారయ్యారు. దీనిపై సమాచారం అందుకున్న స్థానికులు హత్యా స్థలానికి వెళ్లి మృతదేహాన్ని స్వాధీనం చేసుకున్నారు. కేసు నమోదు చేసి భార్య శోభనను అరెస్టు చేయగా, పరారీలో ఉన్న రిక్షావాలా కోసం గాలిస్తున్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ఒక సెక్షన్ మీడియా అత్యుత్సాహం చూపుతుంది : ఆర్జీవీ

సిల్క్ స్మిత అఫీషియల్ బయోపిక్ లో చంద్రిక రవి

శ్రీ కనకదుర్గమ్మవారి ఆశీస్సులు కోరిన హరిహరవీరమల్లు టీమ్

ముంబై మెట్రో రైలెక్కిన పుష్ప 2.. ఎందుకు? (video)

కన్నప్ప లో శ్రీ కాళహస్తి పురాణ కథ తెలిపే గిరిజనులుగా అరియానా, వివియానా

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

Asthma in Winter Season, ఈ సమస్యను తెచ్చే ఆహార పదార్ధాలు, పరిస్థితులు

ఓట్స్ తింటే కలిగే ఆరోగ్య ప్రయోజనాలు

విటమిన్ డి లభించే 5 పదార్థాలు, ఏంటవి?

గర్భాశయ క్యాన్సర్‌తో బాధ పడుతున్న 83 ఏళ్ల మహిళకు విజయవంతంగా చికిత్స

Mint Juice, శీతాకాలంలో పుదీనా రసం తాగితే?

తర్వాతి కథనం
Show comments