Webdunia - Bharat's app for daily news and videos

Install App

భార్యాభర్తల గొడవ.. భార్యను హత్య చేసి.. శవాన్ని ప్లాస్టిక్ కవర్‌లో చుట్టి పరార్

Webdunia
మంగళవారం, 25 అక్టోబరు 2022 (19:13 IST)
భార్యాభర్తల గొడవ.. హత్యకు దారితీసింది. భార్యాభర్తల మధ్య ఏర్పడిన గొడవ హత్యకు కారణమైంది. భార్య గొంతు కోసి భర్త హత్య చేసి.. శవాన్ని ప్లాస్టిక్ కవర్‌లో చుట్టి పరారైన ఘటన కేరళ, ఎర్నాకులంలో చోటుచేసుకుంది. కుళ్లిన స్థితిలో ఉన్న మహిళ మృతదేహం నుంచి దుర్వాసన రావడం వల్ల పోలీసులకు ఇంటి యజమాని సమాచారం అందించాడు.
 
వివరాల్లోకి వెళితే.. మహారాష్ట్రకు చెందిన దంపతులు ఎర్నాకులంలోని గిరినగర్‌లో ఏడాదిగా అద్దెకు ఇంట్లో వుంటున్నారు. వీరిద్దరి మధ్య జరిగే గొడవలు తారాస్థాయికి చేరుకున్నాయి. క్షణికావేశానికి గురైన భర్త భార్య గొంతు కోసి చంపేశాడు. అంతటితో వదలక మృతదేహాన్ని ప్లాస్టిక్ కవర్‌లో చుట్టి పడేశాడు. 
 
అయితే ఆ ఇంటి నుంచి దుర్వాసన రావడంతో ఇంటి ఓనర్ అక్టోబర్ 14న సాయంత్రం పోలీసులకు సమాచారం అందించాడు. ఈ ఘటనా స్థలికి చేరుకున్న పోలీసులు.. శవాన్ని పోస్టుమార్టం నిమిత్తం తరలించారు. భార్యను హత్య చేసి నిందితుడు పారిపోయి వుండవచ్చునని పోలీసులు అనుమానిస్తున్నారు. ఈ ఘటనపై దర్యాప్తు కొనసాగిస్తున్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

బద్రీనాథ్‌లో ఐటమ్ గర్ల్‌కు గుడి లేదు.. గాడిద గుడ్డూ లేదు: పూజారులు

కమల్ హాసన్ థగ్ లైఫ్ నుంచి మొదటి సింగిల్ జింగుచా గ్రాండ్ రిలీజ్

హాస్పిటల్ నేపథ్యంలో డియర్ ఉమ రివ్యూ: సుమయ రెడ్డి అదరగొట్టింది..

పుష్ప-2 నుంచి పీలింగ్స్ పాటను అదరగొట్టిన ఆంధ్రా మహిళా (వీడియో)

అర్జున్ S/O వైజయంతి మూవీ రివ్యూ రిపోర్ట్... ఎలా వుందంటే?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

లెమన్ టీ ఆరోగ్య ప్రయోజనాలు

మహిళలు రోజువారీ ఆహారంలో అశ్వగంధను చేర్చుకోవడం మంచిదా?

కార్డియోమెటబాలిక్ ఆరోగ్యం, బరువు నిర్వహణకు బాదం పప్పులు

మెదడు పనితీరును పెంచే ఫుడ్

తల్లిదండ్రులు గుర్తించుకోవాలి... పిల్లల ముందు దుస్తులు మార్చుకోవద్దు..

తర్వాతి కథనం
Show comments