ఓ మహిళ కట్టుకున్న భర్తకు తేరుకోలేని షాకిచ్చింది. పెట్రోల్ కొట్టించుకునేందుకు బంకుకు వచ్చారు. ఆతనితో పాటు వచ్చిన భార్య.. ఫోనులో మాట్లాడుతూ, మరో బైకులో ఎక్కి వెళ్లిపోయింది. ఈ దృశ్యాలను చూసిన భర్త ఖంగుతిన్నాడు. దీనికి సంబంధించిన వీడియో ఒకటి ఇపుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. ఈ వివరాలను పరిశీలిస్తే,
ఓ మహిళ తన భర్తతో పాటు బైకుపై వెళుతుంది. అయితే, మధ్యలో ఆ వ్యక్తి పెట్రోల్ కొట్టించుకోవడానికి బంక్‌లోకి వెళ్లాడు. పెట్రోల్ కొట్టించుకునే సమయంలో అతడి భార్య బండి దిగి ఫోన్ మాట్లాడుకుంటూ నడుచుకంటూ దూరంగా వెళ్ళి నిలబడింది. ఆమె భర్తకు ముందు వైపు మరో వ్యక్తి కూడా తన బైకుకు పెట్రోల్ కొట్టించుకుంటున్నాడు.
ఆ సమయంలో ఎవరూ ఊహించని ఘటన ఒకటి చోటుచేసుకుంది. ఫోన్ మాట్లాడుతున్న ఆ మహిళ అపరిచిత వ్యక్తి బైకు ఎక్కి కూర్చొంది. అతను కూడా ఫోన్ ధ్యాసలో పడి ఆమెను ఎక్కించుకుని వెళ్ళిపోయాడు. ఇది గమనించిన ఆమె భర్త అక్కడే పెట్రోల్ పట్టించుకుంటూ ఉన్నాడు.
ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది. దీనిపై నెటిజన్లు వివిధ రకాలుగా కామెంట్స్ చేస్తున్నారు. ఫోన్ ధ్యాసలో పడితే ఇలాగే ఉంటుంది మరి అంటున్నారు. భర్త, సోదరుడితో కలిసి బాగానే యాక్టింగ్ చేసింది అంటూ ఇంకొందరు అన్నారు. ఇన్‌స్టాలో వైరల్ అవుతున్న ఈ వీడియోను 1.72 లక్షల మంది వీక్షించగా, 1700కు పైగా లైక్స్ వచ్చాయి.