10 నిమిషాలు ఆలస్యమై విమానం ఎక్కలేకపోయింది, బతికి బైటపడింది

ఐవీఆర్
శుక్రవారం, 13 జూన్ 2025 (13:34 IST)
అహ్మదాబాద్ ఎయిర్ ఇండియా విమానం ఎక్కేందుకు నానా తంటాలు పడుతూ వచ్చిన భూమి చౌహాన్ అనే మహిళ తృటిలో ప్రమాదం నుంచి తప్పించుకున్నారు. అది ఎలాగంటే... విమానం ఎక్కేందుకు ఆమె ఇంటి నుంచి బయలుదేరారు. ఐతే విపరీతమైన ట్రాఫిక్ సమస్యల కారణంగా ఆమె విమానాశ్రయానికి వచ్చేసరికి 10 నిమిషాలు ఆలస్యమైంది. దీనితో విమానం ఎక్కేందుకు కుదరదనీ, చెక్ ఇన్ టైం అయిపోయిందంటూ ఎయిర్ ఇండియా సిబ్బంది ఆమెను లోపలికి వెళ్లనివ్వలేదు.
 
గేటు వద్దే ఆపేశారు. ఇంతలో ఆమె ఎక్కాల్సిన ఎయిర్ ఇండియా విమానం ఆమె కళ్ల ముందే టేకాఫ్ తీసుకుని గాల్లోకి ఎగిరింది. దీనితో ఆమె వెనుదిరిగి వెళ్లబోతుండగా.. జస్ట్ ఐదు నిమిషాల్లోనే తను ఎక్కాల్సిన విమానం కూలిపోయిందన్న వార్త విని షాక్ తిన్నది. తనను ఈ ప్రమాదం నుంచి ఆ భగవంతుడే కాపాడారంటూ ఆమె చెప్పుకొచ్చింది.
 
కాగా అహ్మదాబాద్ నుంచి లండన్ వెళుతున్న ఏఐ 171 ఎయిర్ ఇండియా విమానం నిన్న మధ్యాహ్నం టేకాఫ్ తీసుకున్న కొద్ది నిమాషాలకే కూలిపోయింది. ఈ ఘటనలో 241 మంది మృతి చెందగా ఒకే ఒక్కడు ప్రాణాలతో బైటపడ్డాడు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Akanda 2: ఏ సౌండ్ కు నవ్వుతానో.. నరుకుతానో నాకే తెలియదు అంటున్న బాలక్రిష్ణ

చెవిటి, మూగ అమ్మాయి ని ప్రేమించే యువకుడి గాథతో మోగ్లీ

Ram Charan : పెద్ది షూటింగ్ కోసం శ్రీలంకకు బయలుదేరిన రామ్ చరణ్

Revanth Reddy: ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ని ఆహ్వానించిన నారా రోహిత్

Heba Patel: పోస్ట్ ప్రొడక్షన్ ల్లో అనిరుధ్, హెబా పటేల్ మారియో

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

మోతాదుకి మించి చపాతీలు తింటే ఏం జరుగుతుందో తెలుసా?

ఆహారంలో అతి చక్కెర వాడేవాళ్లు తగ్గించేస్తే ఏం జరుగుతుందో తెలుసా?

మిస్సోరీలో దిగ్విజయంగా నాట్స్ వాలీబాల్, త్రోబాల్ టోర్నమెంట్స్

మసాలా టీ తాగడం వలన కలిగే ఆరోగ్య ప్రయోజనాలు ఏంటి?

ఆరోగ్యకరమైన కేశాల కోసం వాల్ నట్స్

తర్వాతి కథనం
Show comments