Webdunia - Bharat's app for daily news and videos

Install App

డబ్బు కోసం నాలుగేళ్ళ బాలుడిని కిడ్నాప్ చేసిన ప్రేమికులు

టీవీ క్రైమ్ సీరియల్‌ను స్ఫూర్తిగా తీసుకున్న ఓ ప్రేమజంట... వరుసకు సోదరుడయ్యే నాలుగేళ్ళ బాలుడిని కిడ్నాప్ చేశారు. ఆ తర్వాత తమ బండారం బయటపడటంతో జైలు పాలయ్యారు. రాజస్థాన్ రాష్ట్రంలోని జోధ్‌పూర్‌లో జరిగిన

Webdunia
సోమవారం, 17 అక్టోబరు 2016 (14:04 IST)
టీవీ క్రైమ్ సీరియల్‌ను స్ఫూర్తిగా తీసుకున్న ఓ ప్రేమజంట... వరుసకు సోదరుడయ్యే నాలుగేళ్ళ బాలుడిని కిడ్నాప్ చేశారు. ఆ తర్వాత తమ బండారం బయటపడటంతో జైలు పాలయ్యారు. రాజస్థాన్ రాష్ట్రంలోని జోధ్‌పూర్‌లో జరిగిన ఈ ఘటన వివరాలను పరిశీలిస్తే...
 
ఈ ప్రాంతానికి చెందిన పూర్ణిషా (22), మయాంక్ మెహతాలు ప్రేమికులు. విలాసవంతమైన జీవితం గడిపేందుకు డబ్బు సంపాదించాలన్న దుర్బుద్ధితో వీరిద్దరు కలిసి డబ్బు కోసం అడ్డదారులు తొక్కారు. ఇందుకోసం మయాంక్ తన స్నేహితులను కూడా ఉపయోగించుకున్నాడు. 
 
తమకు వరుసకు సోదరుడయ్యే నాలుగేళ్ల బాలుడు భండారీని.. మోటార్ సైకిల్‌పై తిప్పుతానని మానసరోవర్ కాలనీలోని ఇంటి నుంచి తీసుకెళ్లింది. ఆ తర్వాత బాలుడిని తన ప్రియుడికి అప్పగించింది. రూ.50 లక్షలు ఇస్తేనే భండారిని వదులుతామని అతడి తండ్రి రితేశ్‌కు కిడ్నాపర్లు ఫోన్ చేశారు. 
 
దీంతో అతడు పోలీసులను ఆశ్రయించాడు. నాలుగు గంటల్లోనే పోలీసులు కేసును ఛేదించి మహామందిర్ ప్రాంతం నుంచి బాలుడిని సురక్షితంగా విడిపించారు. డబ్బుల కోసమే ఈ పని చేసినట్టు వారు పోలీసుల ఎదుట చెప్పడంతో వారిపై మోసం, కిడ్నప్ సెక్షన్ల కింద కేసులు నమోదు చేసి అరెస్టు చేశారు. 
అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Santhanam: డీడీ నెక్ట్స్ లెవల్: రోడ్డున పోయే ప్రతి ఒక్కరికీ సమాధానం చెప్పాల్సిన పనిలేదు..

బద్మాషులు నుండి లోకం మారిందా.. సాంగ్ రిలీజ్

23 లాంటి సినిమా తీయడం ఫిల్మ్ మేకర్ గా వెరీ ఛాలెంజింగ్ : డైరెక్టర్ రాజ్ ఆర్

రెట్రో మిస్ అయినా, మాస్ జాతర వరించింది, కామెడీ కూడా చేయబోతున్నా : నవీన్ చంద్ర

ముగ్గురు కోడళ్ల మరణాల చుట్టూ సాగే అయ్యనా మానే సిరీస్ తెలుగులో రాబోతోంది

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

భారత్ లోకి రే-బాన్ మెటా గ్లాసెస్ మెటా ఏఐ ఇంటిగ్రేటెడ్, స్టైల్స్

పైల్స్ తగ్గేందుకు సింపుల్ టిప్స్

పసుపు, మిరియాల పొడిని కలిపిన గోల్డెన్ మిల్క్ తాగితే?

ప్రతి ఉదయం నా హృదయం నీకై పుష్పించెనులే

మిర్రోర్ సీనియర్ మహిళల కోసం రూపొందించిన MILY

తర్వాతి కథనం
Show comments