Webdunia - Bharat's app for daily news and videos

Install App

పెళ్లిపందిట్లోనే భర్తకు బడితపూజ చేసిన భార్య... లుథియానాలో ఘటన

రెండో పెళ్లి చేసుకునేందుకు యత్నించిన భర్తను పెళ్లి పందింట్లోనే భార్య బడితపూజ చేసింది. ఈ సంఘటన పంజాబ్ రాష్ట్రంలోని లుథియానాలో జరిగింది. తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ వివరాలను పరిశీలిస్తే లుథియానాలో ఓ కళ్య

Webdunia
మంగళవారం, 7 మార్చి 2017 (09:44 IST)
రెండో పెళ్లి చేసుకునేందుకు యత్నించిన భర్తను పెళ్లి పందింట్లోనే భార్య బడితపూజ చేసింది. ఈ సంఘటన పంజాబ్ రాష్ట్రంలోని లుథియానాలో జరిగింది. తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ వివరాలను పరిశీలిస్తే లుథియానాలో ఓ కళ్యాణ మండపంలో వివాహం జరగడానికి అన్ని ఏర్పాట్లూ పూర్తి చేశారు. వరుడు, వధువు తరపు బంధువులంతా వేడుక వేదిక వద్దకు చేరుకున్నారు. ఇంతలో ఆ కళ్యాణ మండపం వద్దకు ఓ మహిళ కారులో నలుగురు బంధువులతో కలిసి వచ్చింది. 
 
నేరుగా వరుడెక్కడ? అని ఆడపెళ్లివారిని ప్రశ్నించింది. మేడ మీదున్నాడనడంతో అక్కడికి చేరుకుని, ఎవర్ని మోసం చేస్తావంటూ అందరి ముందూ లెంపలు వాయించింది. కాలర్ పట్టి నిలదీసింది. ఈ హఠాత్పరిణామంతో మేల్కొన్న వరుడి బంధువులు ఆమెను అడ్డుకునేందుకు ప్రయత్నించారు. వారిపై కూడా చేయి చేసుకుంది. 
 
ఇంతలో మరికొందరు అసలేం జరుగుతోందని ప్రశ్నించడంతో తాను అతని మొదటి భార్యనని చెప్పింది. దీంతో అంతా షాక్ తిన్నారు. అందరి ముందు భర్తను కొడుతూ కాలర్ పట్టుకుని ఆమె ఈడ్చుకొచ్చింది. ఇంతలో పోలీసులు రావడంతో తాను ఆమెతో విడాకులు తీసుకున్నానని, అందుకు సంబంధించిన పత్రాలు తన వద్ద ఉన్నాయని వరుడు చెబుతున్నా, ఆమె అతనిపై కలబడి చితక్కొట్టడం విశేషం. 
అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

బద్మాషులు నుండి లోకం మారిందా.. సాంగ్ రిలీజ్

23 లాంటి సినిమా తీయడం ఫిల్మ్ మేకర్ గా వెరీ ఛాలెంజింగ్ : డైరెక్టర్ రాజ్ ఆర్

రెట్రో మిస్ అయినా, మాస్ జాతర వరించింది, కామెడీ కూడా చేయబోతున్నా : నవీన్ చంద్ర

ముగ్గురు కోడళ్ల మరణాల చుట్టూ సాగే అయ్యనా మానే సిరీస్ తెలుగులో రాబోతోంది

మర్డర్ మిస్టరీ-క్రైమ్ థ్రిల్లర్ గా విజయ్ ఆంటోని మార్గన్‌ సిద్ధం

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ప్రతి ఉదయం నా హృదయం నీకై పుష్పించెనులే

మిర్రోర్ సీనియర్ మహిళల కోసం రూపొందించిన MILY

రోజూ ఒక చెంచా తేనె సేవిస్తే ఏమవుతుంది?

ఇండియాలో ప్రీమియం లెదర్ స్లిప్-ఆన్ ఫర్ మెన్‌తో కొత్త విభాగంలో రేర్’జ్ బై రేర్ రాబిట్

Moringa Soup: మునగాకు సూప్ తాగితే మహిళలకు ఎంత మేలో తెలుసా?

తర్వాతి కథనం
Show comments