Webdunia - Bharat's app for daily news and videos

Install App

ముంబైలో దారుణం.. ఐదేళ్ళ పాపను 15 అంతస్తుల భవంతి నుంచి విసిరేసిన మహిళ

దేశ ఆర్థిక రాజధాని ముంబైలో దారుణం జరిగింది. ఓ మహిళా కానిస్టేబుల్‌తో మరో మహిళ గొడవపడింది. అంతటితో కసి తీరక ఆ మహిళా కానిస్టేబుల్‌కు చెందిన ఐదేళ్ల కుమార్తెను 15 అంతస్తుల భవనం నుంచి కిందికి విసిరేసింది. తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ అత్యంత పాశవిక చర్య వివరా

Webdunia
మంగళవారం, 20 డిశెంబరు 2016 (11:05 IST)
దేశ ఆర్థిక రాజధాని ముంబైలో దారుణం జరిగింది. ఓ మహిళా కానిస్టేబుల్‌తో మరో మహిళ గొడవపడింది. అంతటితో కసి తీరక ఆ మహిళా కానిస్టేబుల్‌కు చెందిన ఐదేళ్ల కుమార్తెను 15 అంతస్తుల భవనం నుంచి కిందికి విసిరేసిన ఘటన ఒకటి వెలుగులోకి వచ్చింది. ఈ వివరాలను పరిశీలిస్తే...
 
ముంబైలోని బైకుల్లాలో గల న్యూ హింద్‌ మాదా కాలనీలో 22 అంతస్తుల భవనం ఉంది. ఇందులో అశోక్‌, ఆర్తి అనే దంపతులు 15వ అంతస్తులో నివశిస్తున్నారు. వీరిలో ఆర్తి వర్లీ ట్రాఫిక్‌ పోలీస్‌ కానిస్టేబుల్‌‌గా పనిచేస్తుండగా అశోక్‌ మాత్రం ఆటో మొబైల్‌ వ్యాపారం చూసుకోవడంతోపాటు ఓ షోరూంలో పనిచేస్తున్నాడు. సోమవారం ఆర్తి తన ఉద్యోగానికి వెళ్లగా అశోక్‌ ఇంట్లోనే ఉన్నాడు. వీరికి ఐదేళ్ళ పాప ఉంది. 
 
ఈమె గ్లోరియా ప్రి ప్రైమరీ స్కూల్లో చదువుతోంది. ఈ పాప బయట ఆడుకుంటూ ఉన్నది. అయితే, ఆ పాపను ఉన్నట్టుండి 15వ ఫ్లోర్‌ నుంచి కిందకు ఓ మహిళ తోసేసింది. ఆ భవనంలో ఉన్నవారందరినీ ఈ సంఘటన తీవ్రంగా కలిచివేసేలా చేసింది. దీనిపై పోలీసులు కేసు నమోదు చేసి విచారణ చేపట్టారు.

మహిళా కానిస్టేబుల్‌‌తో ఉన్న గొడవ కారణంగానే పసికందుకు ఆ మహిళ కిందికి విసిరేసి ఉంటుందని భావిస్తున్నారు. పరారీలో ఉన్న మహిళా నిందితురాలి కోసం పోలీసులు గాలిస్తున్నారు. భవనంలోని సీసీటీవీ ఫుటేజీని పోలీసులు పరిశీలిస్తున్నారు. 
అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

బోల్డ్‌గా నటిస్తే అలాంటోళ్లమా? అనసూయ ప్రశ్న

తెలుగు, హిందీ భాషల్లో రాబోతోన్న సట్టముమ్ నీతియుమ్

ఏలుమలై నుంచి సిధ్ శ్రీరామ్ ఆలపించిన రా చిలకా మెలోడీ సాంగ్

Prabhas: ప్రభాస్ కొత్త లుక్ తో పూరి జగన్నాథ్, ఛార్మికి పలుకరింపు

మెగాస్టార్ చిరంజీవి తో డాన్స్ ఆనందంతోపాటు గౌరవంగా వుంది : మౌని రాయ్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

తీపి మొక్కజొన్న తింటే?

బొప్పాయి ఆరోగ్యానికి మంచిదే, కానీ వీరు తినకూడదు

కరివేపాకుతో చెడు కొవ్వు, రక్తపోటుకి చెక్

ఆల్‌బుకరా పండ్లతో ఆరోగ్య ప్రయోజనాలు

జామకాయ తింటే ఎన్ని ప్రయోజనాలు, ఏంటి?

తర్వాతి కథనం
Show comments