Webdunia - Bharat's app for daily news and videos

Install App

రోజూ గుడికెళ్లే యువతి.. కన్నేసిన 65 ఏళ్ల పూజారి.. తల్లిని చేశాడు..

Webdunia
శుక్రవారం, 12 అక్టోబరు 2018 (13:56 IST)
మహిళలపై వేధింపులు, అరాచకాలు పెచ్చరిల్లిపోతున్నాయి. మీ టూ ఉద్యమం జరుగుతున్నా.. మహిళలపై అకృత్యాలకు పాల్పడే వారి సంఖ్య ఏమాత్రం తగ్గలేదు. తాజాగా జమ్మూకశ్మీర్‌లో దారుణం జరిగింది. యువతిపై ఓ ఆలయ పుజారి ఏడాదిపాటు అత్యాచారానికి పాల్పడ్డాడు. ఈ క్రమంలో ఆమె గర్భం దాల్చింది. 
 
వివరాల్లోకి వెళితే.. జమ్మూకాశ్మీర్, రేయాసి జిల్లాకు చెందిన ఓ 19 ఏళ్ల యువతి తన గ్రామంలోని గుడికి రోజూ వెళ్లేది. ఈ క్రమంలో గుడిలోని పూజారి (65)తో ఆమెకు పరిచయం ఏర్పడింది. ఆ యువతిపై కన్నేసిన వృద్ధ పూజారి యువతిని లోబరుచుకుని ఏడాది పాటు అత్యాచారానికి పాల్పడ్డాడు.

ఈ క్రమంలో ఈ నెల 6వ తేదీన యువతి తీవ్రమైన కడుపునొప్పితో స్థానిక ఆస్పత్రిలో చేరింది. ఆమెను పరీక్షించిన వైద్యులకు గర్భం దాల్చినట్లు అనుమానం రావడంతో జమ్మూలోని ప్రసూతి ఆస్పత్రికి వెళ్లాల్సిందిగా సూచించారు.
 
జమ్మూకు వెళ్లిన యువతికి అక్కడి వైద్యులు సీజేరియన్ చేసి డెలీవరి చేశారు. ఈ క్రమంలో బాలిక మృతశిశువుకి జన్మనిచ్చింది. ఈ ఘటనపై బాధితురాలి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు.

కానీ ఇంతలో సదరు వృద్ధ పూజారి తాను దేవుడిగా ప్రకటించుకుని పూజారిగా మారిపోయాడు. అతడి బండారం బయటపడటంతో పారిపోయాడు. ప్రస్తుతం పోలీసులు పూజారి కోసం గాలింపు చర్యలు చేపట్టారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

సినీ కార్మికులకు వేతనాలు 30 శాతం పెంచాలి : అమ్మిరాజు కానుమిల్లి

Niharika: సంప్రదాయం దుస్తులతో పెండ్లి కూతురులా ముస్తాబయిన నీహారిక కొణిదల

ఒక్క కూలీ కోసం యుద్ధమే జరుగుతోందని చెప్పే రజనీకాంత్ కూలీ ట్రైలర్

అర్జున్ రెడ్డి టైంలోనే సుకుమార్ తో సినిమా అనుకున్నాం : విజయ్ దేవరకొండ

ఫ్యామిలీ ఎమోషన్స్, ఎంటర్ టైన్ మెంట్ తో లిటిల్ హార్ట్స్ సిద్ధం

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

గుత్తి వంకాయ కూర ఆరోగ్య ప్రయోజనాలు

అనారోగ్య సమస్యలతో బాధపడుతూ కొబ్బరి నీళ్లు తాగుతున్నారా?

Goat Milk: మహిళలకు మేకపాలు ఎలా మేలు చేస్తుందో తెలుసా?

విడాకులు తీసుకున్న మహిళను పెళ్లాడితే ఎలా వుంటుంది?

కుషాల్స్ ఫ్యాషన్ జ్యువెలరీ, నటి ఆషికా రంగనాథ్‌తో వరమహాలక్ష్మిని జరుపుకోండి

తర్వాతి కథనం
Show comments