Webdunia - Bharat's app for daily news and videos

Install App

నయీమ్ బాధితులకు గుడ్ న్యూస్.. భూములను తిరిగి ఇచ్చేస్తున్నాం.. సిట్ అధికారులు

గ్యాంగ్‌స్టర్ నయీమ్ కేసులో సిట్ అధికారులు దర్యాప్తును ముమ్మరం చేస్తున్నారు. ఇంకా నయీం కేసును విచారిస్తున్న సిట్ ఓ కీలక నిర్ణయం తీసుకుంది. నయీం బెదిరింపులకు లొంగిపోయి భూములిచ్చేసిన బాధితులకు న్యాయం చేయ

Webdunia
ఆదివారం, 20 నవంబరు 2016 (10:36 IST)
గ్యాంగ్‌స్టర్ నయీమ్ కేసులో సిట్ అధికారులు దర్యాప్తును ముమ్మరం చేస్తున్నారు. ఇంకా నయీం కేసును విచారిస్తున్న సిట్ ఓ కీలక నిర్ణయం తీసుకుంది. నయీం బెదిరింపులకు లొంగిపోయి భూములిచ్చేసిన బాధితులకు న్యాయం చేయాలని సిట్ అధికారులు భావిస్తున్నారు. ఇందులో భాగంగా నయీమ్ అక్రమంగా ఆక్రమించుకున్న భూముల డాక్యుమెంట్లను బాధితులకు తిరిగిచ్చేయాలని సిట్, ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపినట్లు తెలుస్తోంది. 
 
ఈ భూముల విలువ దాదాపు వెయ్యి కోట్లు ఉంటుందని అంచనా. ప్రభుత్వం ఈ ప్రతిపాదనకు ఆమోదం తెలుపగానే ఈ భూముల పత్రాలను తిరిగిచ్చే అవకాశముంది. ఇదిలా ఉంటే.. గ్యాంగ్‌స్టర్ నయీమ్ తన బావను మూడేళ్ల కిందట రంగారెడ్డి జిల్లా శంషాబాద్ ప్రాంతంలోనే హత్య చేసినట్లు సిట్ విచారణలో తేలింది.

అతని సోదరి భర్త విజయ్‌కుమార్ అలియాస్ నదీమ్‌ను అతి కిరాతంగా మట్టుపెట్టి శంషాబాద్ మండలం పెద్దతూప్ర సమీపంలో పెట్రోలు పోసి తగులబెట్టాడు. ఈ కేసు ఇప్పటి వరకు మిస్టరీగానే ఉండగా.. నయీమ్ ఎన్ కౌంటర్ అనంతరం అతని అనుచరులను సిట్ అధికారుల విచారణ చేస్తుండడంతో పెద్దతూప్రలో జరిగిన హత్య విషయం వెలుగుచూసింది.
అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

జ్యోతిష్యుడు వేణుస్వామితో పూజలు చేయించుకున్న పవన్ హీరోయిన్!!

'ఏమాయ చేసావే' నుంచి నన్ను మీ మనిషిలా భావించారు : సమంత

"ది 100 మూవీ" ట్రైలర్‌ను లాంఛ్ చేసిన పవర్ స్టార్

Nayanthara: మూర్ఖుడిని వివాహం చేసుకోవడం తప్పు.. నన్ను ఒంటరిగా వదిలేయండి.. నయనతార?

స్వార్థంతో తెలుగు ఫిలింఛాంబర్ ఎన్నికలకు అడ్డుకుంటున్నారు : నిర్మాతలు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

చక్కగా కొవ్వును కరిగించే చెక్క

Monsoon AC Safety: బయట వర్షం పడుతుంటే.. ఏసీ వాడటం సురక్షితమేనా?

కొవ్వును కరిగించే తెల్ల బఠానీలు

పీరియడ్స్ సమయంలో స్త్రీలు చేయదగని వ్యాయామాలు, ఏంటవి?

బత్తాయి రసం తాగితే ఆరోగ్యానికి కలిగే మేలు ఏమిటి?

తర్వాతి కథనం
Show comments