Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఆస్తి కోసం ప్రియుడితో కలిసి తల్లిదండ్రులను హత్య చేసిన మహిళ

Webdunia
మంగళవారం, 12 మార్చి 2019 (16:24 IST)
ఆస్తి కోసం ప్రియుడితో కలిసి కన్నవారిని చంపింది ఓ మహిళ. టీలో నిద్రమాత్రలు కలిపి ఈ దారుణానికి ఒడిగట్టింది. వివరాల్లోకి వెళితే, ఢిల్లీ శివారులోని దీపక్‌ విహార్‌కు చెందిన 26 సంవత్సరాల దవిందర్‌ కౌర్ అనే వివాహిత ఒక యేడాది కాలంగా భర్తకు దూరంగా ఉంటోంది. 
 
ఈమెకు లక్నోకు చెందిన ప్రిన్స్‌ దీక్షిత్‌ అనే వ్యక్తితో ఏర్పడిన పరిచయం కాస్త సాహజీవనానికి దారితీసింది. కౌర్ తల్లిదండ్రులకు ఢిల్లీలోని దీపక్‌ విహార్‌లోని నిలోథి ఎక్స్‌టెన్షన్‌లో విలువైన స్థలం ఉంది. దాన్ని తన పేరు మీద రాయాలని తల్లిందండ్రులపై ఆమె ఒత్తిడి చేయగా, అందుకు వారు నిరాకరించారు. 
 
దీంతో తన ప్రియుడితో కలిసి కన్న తల్లిదండ్రులను హత్య చేయాలని ప్లాన్ చేసింది. తల్లి జగీర్‌ కౌర తండ్రి అంత్యక్రియల నిమిత్తం గత నెల 10వ  జలంధర్‌కి వెళ్లింది. ఆ సమయంలో ఇంట్లో ఒంటరిగా ఉన్న తండ్రి గుర్మీత్‌సింగ్‌కు 21వ తేదీన దవిందర్‌ నిద్రమాత్రలు కలిపి టీ ఇచ్చింది. కూతురు ప్రేమగా టీ ఇచ్చిందని తీసుకుని తాగిన అతను మత్తులోకి జారుకున్నాడు. 
 
అప్పుడు ప్రియుడు, అతని స్నేహితులతో కలిసి దిండుతో కప్పి ఊపిరి ఆడకుండా చేసి తండ్రిని చంపేసింది. శవాన్ని సూట్‌కేస్‌లో కుక్కి సయీద్‌ నంగ్లోయి గ్రామ సమీపంలోని కాలువలో పడేశారు. ఈ నెల 2న ఇంటికి తిరిగొచ్చిన తల్లిని కూడా ఇదే ప్రణాళికతో టీలో మత్తుమందు కలిపి దిండుతో అదిమి చంపేశారు. ఆ శవాన్ని కూడా సూట్‌కేస్‌లో కుక్కి కాలువలో పడేశారు. 8, 9 తేదీల్లో వరుసగా సూట్‌కేస్‌లు బయటపడటంతో అనుమానం వచ్చిన పోలీసులు విచారణ జరిపారు. దవిందర్‌, ప్రిన్స్‌ దీక్షిత్‌‌ల కాల్ డేటాని సేకరించారు. సీసీటీవీ ఫూటేజీ ఆధారంగా నేరస్తులను పట్టుకున్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

రాజాసాబ్ నుంచి సంజూ బాబాకు శుభాకాంక్షలు తెలుపుతూ సంజయ్ దత్ లుక్

Gopichand: గోపీచంద్ రెండు సినిమాలపై శ్రద్ధ పెడుతున్నాడు

సంగీత దర్శకుడు అనిరుధ్‌ను కిడ్నాప్ చేస్తానంటున్న విజయ్ దేవరకొండ

హెబ్బా పటేల్, రేఖ నిరోషా నటించిన థాంక్యూ డియర్ విడుదలకు సిద్ధమైంది

వార్ 2 లోని హృతిక్, కియారా డ్యూయెట్ సాంగ్ కోసం బ్రహ్మాస్త్ర కేసరియా టీం

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

బొప్పాయి ఆరోగ్యానికి మంచిదే, కానీ వీరు తినకూడదు

కరివేపాకుతో చెడు కొవ్వు, రక్తపోటుకి చెక్

ఆల్‌బుకరా పండ్లతో ఆరోగ్య ప్రయోజనాలు

జామకాయ తింటే ఎన్ని ప్రయోజనాలు, ఏంటి?

Snacks: బరువు తగ్గాలనుకునే మహిళలు హెల్దీ స్నాక్స్ తీసుకోవచ్చు.. ఎలాగంటే?

తర్వాతి కథనం
Show comments