Webdunia - Bharat's app for daily news and videos

Install App

భారత్‌లో అక్రమవలసదారులను గెంటేస్తాం : అమిత్ షా

Webdunia
గురువారం, 10 అక్టోబరు 2019 (15:52 IST)
భారత్‌లో అక్రమంగా నివాసం ఉంటున్న వారిని గెంటివేస్తామని కేంద్ర హోం మంత్రి అమిత్ షా మరోమారు ప్రకటించారు. ఇందుకోసం దేశవ్యాప్తంగా ఎన్.ఆర్.సి (నేషనల్ రిజిస్టర్ ఆఫ్ సిటిజన్)ని అమలు చేయనున్నట్టు తెలిపారు. ఎన్.ఆర్.సిని ఇప్పటికే అస్సోం రాష్ట్రంలో విజయవంతంగా అమలు చేశారు. 
 
ఈ నేపథ్యంలో ఆయన హర్యానా రాష్ట్ర ఎన్నికల ప్రచారంలో ప్రసంగిస్తూ, 2024 లోక్‌సభ ఎన్నికల నాటికి దేశంలో అక్రమంగా నివాసం ఉంటున్న వారిని గెంటేస్తామని తెలిపారు. ఇందుకోసం ఎన్.ఆర్.సిని అన్ని రాష్ట్రాల్లో అమలు చేసి తీరుతామన్నారు. 
 
ఇకపోతే, 'ఆర్టికల్‌ 370ని రద్దు చేయాలంటే ఎంతో ధైర్యం కావాలి. అది మన ప్రధాన మంత్రి నరేంద్ర మోడీకి మెండుగా ఉంది. 2024లో మరోసారి ఓట్ల కోసం మీ ముందుకు వస్తాం. కానీ ఆ లోపే బీజేపీ ప్రభుత్వం దేశంలో అక్రమంగా నివాసం ఉంటున్న వారిని దేశం నుంచి పంపించి వేస్తుంది. దాదాపు 70 ఏళ్లుగా ఈ అక్రమ వలసదారులు మన ప్రజలకు అందుతున్న అన్ని సౌకర్యాలను అనుభవిస్తూ.. ధైర్యంగా ఉంటున్నారన్నారు. 
 
బీజేపీ, మోడీ ప్రజలకు మాట ఇచ్చారు. ఇక మీదట ఈ అక్రమ వలసదారులు దేశంలో ఉండబోరు అని స్పష్టం చేశారు. అలానే ప్రతిపక్ష కాంగ్రెస్‌ పార్టీపై విమర్శల వర్షం కురిపించారు. ట్రిపుల్‌ తలాక్‌, ఆర్టికల్‌ 370 రద్దు, అక్రమ వలసదారుల గెంటివేత వంటివి దేశానికి మేలు చేసే అంశాలని.. కానీ అవి కాంగ్రెస్‌కు రుచించడం లేదని అమిత్‌ షా మండిపడ్డారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ఇండస్ట్రీలో ఎవరి కుంపటి వారిదే : అల్లు అరవింద్ సంచలన వ్యాఖ్యలు

పవర్ ఫుల్ పోలీస్ ఆఫీసర్ గా ప్రభాస్ స్పిరిట్ లో కనిపించనున్నారా !

పెంచల్ రెడ్డి జీవిత కథతో ఆపద్భాంధవుడు చిత్రం: భీమగాని సుధాకర్ గౌడ్

Chiranjeevi: చిరంజీవితో విశ్వంభర లో సత్యలోకం చూపిస్తున్న వసిష్ఠ

Gautham Tinnanuri: దర్శకుడు గౌతమ్ తిన్ననూరి డైలమాలో వున్నారా !

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

పిట్యూటరీ గ్రంథి ఆరోగ్యకరంగా లేకపోతే సంతానం శూన్యం, ఎందుకంటే?

వేరుశనగ పల్లీలు తింటున్నారా?

బత్తాయి రసం వర్షాకాలంలో తాగితే.. సీజనల్ వ్యాధులు దూరం

పెరుగుతో వీటిని కలిపి తినకూడదు, ఎందుకంటే?

సత్తెనపల్లి మొల్లమాంబ వృద్ధాశ్రమంలో నాట్స్ అన్నదానం

తర్వాతి కథనం
Show comments