Webdunia - Bharat's app for daily news and videos

Install App

మళ్లీ పరీక్షలు నిర్వహిస్తే.. ఆత్మహత్య చేసుకొంటా.. బీహార్ టాపర్ హెచ్చరిక

తనకు మళ్లీ పరీక్షలు నిర్వహిస్తే ఆత్మహత్య చేసుకుంటానని బీహార్ ఇంటర్ పరీక్షల్లో రాష్ట్ర స్థాయిలో టాపర్‌గా నిలిచిన విద్యార్థి సౌరభ్ శ్రేష్ఠ హెచ్చరించాడు.

Webdunia
సోమవారం, 6 జూన్ 2016 (08:32 IST)
తనకు మళ్లీ పరీక్షలు నిర్వహిస్తే ఆత్మహత్య చేసుకుంటానని బీహార్ ఇంటర్ పరీక్షల్లో రాష్ట్ర స్థాయిలో టాపర్‌గా నిలిచిన విద్యార్థి సౌరభ్ శ్రేష్ఠ హెచ్చరించాడు. ఇటీవల వెల్లడైన బీహార్ రాష్ట్ర ఇంటర్ పరీక్షల్లో పది మంది విద్యార్థినీ విద్యార్థులు టాపర్లుగా నిలిచిన విషయం తెల్సిందే. 
 
బీహార్‌లో టాప్ ర్యాంకర్లుగా నిలిచిన 10 మందిలో కొందరికి తగిన సామర్థ్యంలేదని, వారికి సబ్జెక్టులపై కనీస అవగాహన లేదంటూ మీడియాలో వచ్చిన కథనాలు దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించాయి. ఈ క్రమంలో ప్రభుత్వం 15 మంది విద్యావేత్తలతో కమిటీ ఏర్పాటు చేసి.. పది మంది టాపర్లను మరోసారి పరీక్షించాలని ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి నితీశ్ కుమార్ ఆదేశించారు. 
 
ఈ నేపథ్యంలో సౌరభ్ శ్రేష్ఠ మాట్లాడుతూ.. మొదటి ర్యాంకర్‌గా నిలిచేందుకు తనకు సామర్థ్యం లేదని మీడియా బయటపెట్టడంతో తాను తీవ్ర మానసిక ఒత్తిడికి గురవుతున్నట్లు పేర్కొన్నాడు. సౌరభ్ శ్రేష్ఠను కమిటీ పిలిపించగా.. తనను ప్రశ్నలు అడిగితే ఆత్మహత్య చేసుకొంటానని బెదిరించాడు. దీంతో ఆందోళన చెందిన కమిటీ అతడిని బయటకు పంపి.. కొంత విరామం తర్వాత మళ్లీ పిలిపించింది. అయితే, కమిటీ అడిగిన ఒక్క ప్రశ్నకు కూడా అతడు సమాధానం చెప్పలేదని తెలిసింది.
అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

త్రివిక్రమ్ కూడా అలాగే చేస్తాడుగా, మరి మీరేమంటారు?: పూనమ్ కౌర్ ట్వీట్ వైరల్

మహాకుంభ మేళా 2025 ఎక్స్ క్లూజివ్ రైట్స్ తీసుకున్న శ్రేయాస్ మీడియా

తెలుగులో శివరాజ్ కుమార్ యాక్షన్ థ్రిల్లర్ భైరతి రణగల్

ప్రారంభంలో చాన్స్ కోసం బెక్కెం వేణుగోపాల్ ఆఫీసుకు వెళ్లేవాడిని : తేజా సజ్జా

మురారికి దేవకి నందన వాసుదేవకి చాలా వ్యత్యాసం వుంది : డైరెక్టర్ అర్జున్ జంధ్యాల

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

మహిళల్లో జ్ఞాపకశక్తి పెరగాలంటే.. రోజూ ఓ కోడిగుడ్డు తినాల్సిందేనట

క్యాల్షియం స్థాయిలను వృద్ధి చేసే 6 సహజసిద్ధ పానీయాలు, ఏంటవి?

బెల్లంతో చేసిన నువ్వుండలు తింటే ప్రయోజనాలు

తిరుపతిలో తమ మొదటి స్టోర్‌ను ప్రారంభించిన ప్రముఖ లగ్జరీ ఫర్నిచర్ బ్రాండ్ డురియన్

యూరిక్ యాసిడ్ తగ్గించే పండ్లు ఏంటి?

తర్వాతి కథనం
Show comments