Webdunia - Bharat's app for daily news and videos

Install App

అక్రమ సంబంధం: ప్రియుడితో కలిసి భర్తను కడతేర్చిన భార్య

తన ప్రియుడితో కలిసి కట్టుకున్న భర్తను ఓ వివాహిత కడతేర్చింది. కేవలం పరాయి పురుషునితో ఉన్న వివాహేతర సంబంధానికి స్వస్తి చెప్పాలని కోరినందుకే ఈ అఘాయిత్యానికి పాల్పడింది. అభం శుభం తెలియని చిన్నారులు అనాధలన

Webdunia
సోమవారం, 15 ఆగస్టు 2016 (09:10 IST)
తన ప్రియుడితో కలిసి కట్టుకున్న భర్తను ఓ వివాహిత కడతేర్చింది. కేవలం పరాయి పురుషునితో ఉన్న వివాహేతర సంబంధానికి స్వస్తి చెప్పాలని కోరినందుకే ఈ అఘాయిత్యానికి పాల్పడింది. అభం శుభం తెలియని చిన్నారులు అనాధలను చేసింది. ఈ ఘటన బెంగుళూరులో చోటుచేసుకుంది. ఈ కేసు వివరాలను పరిశీలిస్తే... పదేళ్ల క్రితం పుట్టపర్తి మండలం పెడబల్లికి చెందిన మంజులాబాయికి అదే గ్రామానికి చెందిన యుగంధర్‌తో పెద్దల సమక్షంలో వివాహం జరిగింది. వీరి అన్యోన్య దాంపత్యానికి ఇద్దరు పిల్లలు పుట్టారు. 
 
ఆర్థిక పరిస్థితుల కారణంగా ఈ దంపతులు ఐదేళ్ల క్రితం బెంగుళూరు వలసవెళ్లారు. అక్కడ తాపీ పనిచేసుకుంటూ బతుకు సాగిస్తున్నారు. మంజులాబాయికి అదే గ్రామానికి అంజినాయక్‌తో వివాహేతర సంబంధం ఏర్పడింది.  సజావుగా సాగుతున్న వీరి సంసారంలో కలతలు రేగాయి. దీంతో మంజుల భర్తను పట్టించుకోకుండా ఇష్టానుసారం ప్రవర్తించేది. భార్య ప్రవర్తనతో అనుమానం కలిగిన భర్త ఆమెపై నిఘా పెట్టాడు. విషయం తెలుసుకుని ఆమెని నిలదీశాడు. పలుమార్లు బంధువులు, పెద్దమనుషుల సమక్షంలో పంచాయితీ కూడా పెట్టించాడు. అయినా ఆమె ప్రవర్తనలో మార్పు కనిపించలేదు. 
 
తమ సంబంధానికి భర్త అడ్డుగా ఉన్నాడని భావించి అతడిని చంపేయాలని ప్రియుడితో కలిసి పథకం పన్నింది. పథకం ప్రకారం ఈనెల 11న రాత్రి ప్రియుడు అంజినాయక్‌తో కలిసి నిద్రిస్తున్న యుగంధర్‌నాయక్‌ను అతిదారుణంగా హతమార్చారు. మృతదేహాన్ని సంచిలోపెట్టి ముళ్లపొదల్లో పడేసి, ఎవ్వరికి అనుమానం రాకుండా...తన భర్త కనిపించటం లేదని వాపోయింది. ఇదే విషయాన్ని స్వగ్రామంలోని మామకు తెలిపింది.

మామ స్థానికుల సాయంతో బెంగళూరులో ఆరా తీయటంతో తన కొడుకు హత్యకు గురైనట్లు తెలుసుకుని నివ్వెరపోయాడు. పరారీలో ఉన్న నిందితుడిని గాలించి పట్టుకుని చెట్టుకు కట్టేసి చితకబాది కర్ణాటక పోలీసులకు అప్పగించారు. దీంతో తండ్రిని కోల్పోయి, తల్లి ఊచలు లెక్కపెట్టడంతో చిన్నారులు పిల్లలు అనాధలయ్యారు. తల్లి అక్రమసంబంధం పసిపిల్లల పాలిట శాపంగా మారింది.
అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

రాజకీయాలకు స్వస్తి, గుడ్ బై: నటుడు అలీ (video)

అభిమానితో కలిసి భోజనం చేసిన బాలయ్య.. వీడియో వైరల్ (Video)

'కల్కి 2898 AD'పై కేజీఎఫ్ స్టార్ యష్ ప్రశంసల జల్లు

ట్విట్టర్-ఫేస్ బుక్ పేజీలను క్లోజ్ చేసిన రేణూ దేశాయ్, టార్చర్ పెడుతున్నది పవన్ ఫ్యాన్స్ కాదా?

హైదరాబాద్‌లో తమన్నా భాటియా ఓదెల 2 కీలకమైన యాక్షన్ షెడ్యూల్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

దానిమ్మ కాయలు తింటే ఎన్ని ఆరోగ్య ప్రయోజనాలో తెలుసా?

అలాంటి మగవారికి అశ్వగంధ లేహ్యంతో అద్భుత ప్రయోజనాలు

బరువు తగ్గడం: మీ అర్థరాత్రి ఆకలిని తీర్చడానికి 6 ఆరోగ్యకరమైన స్నాక్స్

పిల్లలు స్వీట్ కార్న్ ఎందుకు తింటే..?

చర్మ సౌందర్యానికి జాస్మిన్ ఆయిల్, 8 ఉపయోగాలు

తర్వాతి కథనం
Show comments