Webdunia - Bharat's app for daily news and videos

Install App

అర్థరాత్రి చాటింగ్ వద్దన్న భర్త.. చెంప పగులగొట్టిన భార్య...

సోషల్ మీడియా, ఫేస్‌బుక్ చాటింగ్‌లు పలువురి కాపురాల్లో చిచ్చురేపుతున్నాయి. ఫలితంగా అనేక మంది భార్యాభర్తలు విడాకులు తీసుకుంటున్నారు. మరికొందరైతే బలవన్మరణాలకూ పాల్పడుతున్నారు. తాజాగా అర్థరాత్రి వేళ చాటిం

Webdunia
బుధవారం, 22 ఆగస్టు 2018 (09:39 IST)
సోషల్ మీడియా, ఫేస్‌బుక్ చాటింగ్‌లు పలువురి కాపురాల్లో చిచ్చురేపుతున్నాయి. ఫలితంగా అనేక మంది భార్యాభర్తలు విడాకులు తీసుకుంటున్నారు. మరికొందరైతే బలవన్మరణాలకూ పాల్పడుతున్నారు. తాజాగా అర్థరాత్రి వేళ చాటింగ్ వద్దన్న భర్తను భార్య చెంప పగులగొట్టింది. దీన్ని అవమానంగా భావించిన ఆ భర్త విషం తాగి ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు.
 
గుజరాత్‌ రాష్ట్రంలోని రాజ్‌కోట్‌‌లో జరిగిన ఈ ఘటన వివరాలను పరిశీలిస్తే, రాజ్‌కోట్‌లోని ఖోజా సొసైటీలో ఉంటూ వెల్డింగ్ పనులు చేసే కరీం హిరాణీ(42) రెండేళ్లుగా ఆఫ్రికాలో ఉద్యోగం చేస్తున్నాడు. ఇటీవలే అతను భార్య, ఇద్దరు పిల్లలను చూసేందుకు వచ్చాడు. అయితే భార్య ఎప్పుడు చూసినా వాట్సప్‌లో చాటింగ్ చేస్తూ కనిపించేది. దీంతో అతను మందలించాడు. 
 
ఆగ్రహంతో ఆమె అతనిపై చేయిచేసుకుని చెంప పగులగొట్టింది. ఈ చర్యతో కలత చెందిన కరీం హిరాణీ విషం తాగాడు. చుట్టుపక్కలవారు అతనిని ఆసుపత్రికి తరలించారు. కాగా ఈ దంపతుల మధ్య గతంలో కూడా అనేక వివాదాలు చోటుచేసుకున్నట్టు పోలీసుల విచారణలో తేలింది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

మళ్ళీ మరోసారి మన టైమ్ రావాలంటున్న చిరంజీవి, బాబీ

‘వార్ 2’ టీజర్‌కు వచ్చిన స్పందన చూస్తే ఎంతో ఆనందంగా వుంది :ఎన్టీఆర్

నేను ద్రోణాచార్యుని కాదు, ఇంకా విద్యార్థినే, మీరు కలిసి నేర్చుకోండి : కమల్ హాసన్

Poonam Kaur: త్రివిక్రమ్ శ్రీనివాస్‌పై మళ్లీ ఇన్‌స్టా స్టోరీ.. వదిలేది లేదంటున్న పూనమ్

Peddi: సత్తిబాబు కిళ్లీకొట్టు దగ్గర పెద్ది షూటింగ్ లో రామ్ చరణ్, బుజ్జిబాబు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

వేరుశనగ చిక్కీ ఆరోగ్య ప్రయోజనాలు

ఒకసారి లవంగం టీ తాగి చూడండి

ఎముక బలం తగ్గుతోందా? ఐతే ఇవి తినాలి

థైమోమాతో కూడిన అత్యంత అరుదైన మియాస్తీనియా గ్రావిస్ కేసుకు విజయవంతంగా ఏఓఐ చికిత్స

తాటి ముంజలు తింటే ప్రయోజనాలు ఏమిటి?

తర్వాతి కథనం
Show comments