Webdunia - Bharat's app for daily news and videos

Install App

భార్య చితాభస్మం ఎత్తుతూ కుప్పకూలి ప్రాణాలు విడిచిన భర్త...

Webdunia
బుధవారం, 6 ఫిబ్రవరి 2019 (13:42 IST)
భర్తలంటే భార్యలని వేధించి చంపేసేవారే కాదు... వాళ్లకేమైనా అయితే తట్టుకోలేకపోయే వాళ్లు కూడా ఉన్నారు. కానీ... వేధించే భర్తలలాగా వీళ్లు పెద్దగా పాపులర్ కాలేరు... అటువంటి ఒక సంఘటనే ఒకటి జరిగింది. 
 
వివరాలలోకి వెళ్తే... నూతన్‌కల్‌ మండల కేంద్రంలో జరిగిన ఈ ఘటనను గురించి గ్రామస్థులు కథనం మేరకు... గ్రామానికి చెందిన బండ్లపల్లి శ్రీరాములు, మల్లమ్మకు శంకర్‌, ఆంజనేయులు అనే ఇద్దరు కుమారులు, స్వరూప అనే ఓ కుమార్తె ఉన్నారు. ఇద్దరు కుమారులూ, కుమార్తె జీవనోపాధి కోసం రెండేళ్ల క్రితం చెన్నై వెళ్లగా తల్లిదండ్రులు మాత్రం గ్రామంలోనే ఉంటున్నారు. 
 
సుమారు 9 నెలల క్రితం చెన్నైలో ఉంటున్న కుమారుల వద్దకు ఈ దంపతులు వెళ్లడం జరిగింది. అయితే ఈ నెల 2వ తేదీన మల్లమ్మ (48) బీపీ పెరిగి చెన్నైలో మృతి చెందింది. మృతదేహాన్ని స్వగ్రామానికి తీసుకువచ్చి దహన సంస్కారాలు నిర్వహించారు. కాగా... భార్య మృతిని జీర్ణించుకోలేని శ్రీరాములు మూడో రోజు చితాభస్మం ఎత్తుతూ తీవ్ర మనోవేదనకు గురై స్నానాలు చేసి ఇంటికి చేరుకుంటున్న సమయంలో ఒక్కసారిగా గుండెపోటుతో మార్గమధ్యంలోనే మృతి చెందాడు. 
 
మూడురోజుల వ్యవధిలోనే తల్లిదండ్రులు మృతి చెందడంతో కుమారులు, కుమార్తె విలపిస్తున్న తీరు అందరినీ కంటతడి పెట్టించింది. దంపతుల మృతితో గ్రామంలో విషాద ఛాయలు అలుముకున్నాయి.

సంబంధిత వార్తలు

వరలక్ష్మీ శరత్ కుమార్‌ శబరి లో అనగనగా.. పాట విడుదల చేసిన చంద్రబోస్

బుల్లెట్ మంచి సినిమా అందుకే 50 రోజులు పూర్తిచేసుకుంది : చిత్ర యూనిట్

C.D ట్రైలర్‌తో భయపెడుతున్న అదా శర్మ

పవన్ సాటిలేని హీరో, ఆయనకు పొలిటిక్స్ అవసరం లేదు కానీ ప్రజల కోసం: ఘట్టమనేని మంజుల

ఎల్.బి.స్టేడియంలో రామ్‌చరణ్ గేమ్ ఛేంజర్ క్లయిమాక్స్ - తాజా అప్ డేట్

రాగి రోటీలు తినడం వల్ల 9 ప్రయోజనాలు

అతిగా టీ తాగితే కలిగే అనారోగ్యాలు ఏమిటో తెలుసా?

ఖాళీ కడుపుతో కొత్తిమీర నీరు తాగితే 7 గొప్ప ఆరోగ్య ప్రయోజనాలు

పీరియడ్స్ ఆలస్యంగా వస్తున్నాయా? గర్భం కాకుండా ఈ 8 కారణాలు కావచ్చు

అధిక రక్తపోటు అశ్రద్ధ చేస్తే కలిగే దుష్ఫలితాలు ఏంటో తెలుసా?

తర్వాతి కథనం
Show comments