Webdunia - Bharat's app for daily news and videos

Install App

నీకు చేతకాదు, అందుకే నీ భార్య మాతో ఎఫైర్ అన్నందుకు కరెంట్ తీగలు పట్టుకున్నాడు

Webdunia
బుధవారం, 1 ఏప్రియల్ 2020 (21:44 IST)
అక్రమ సంబంధాలు ఎంతోమంది ప్రాణాలను తీస్తున్నాయి. క్షణికావేశంలో ప్రాణాలు తీయడమో, తీసుకోవడమో చేస్తున్నారు. ఇలా చాలామంది జీవితాలు అర్థాంతరంగా ఆగిపోతున్నాయి. వివాహం చేసుకున్న భర్తకు లైంగిక సుఖంపై ఆసక్తి లేకపోవడంతో భార్య ఏకంగా ముగ్గురు యువకులతో వివాహేతర సంబంధం పెట్టుకుంది. భార్యకు నచ్చజెప్పి ఏమీ చేయలేని నిస్సహాయ స్థితిలో ఆత్మహత్య చేసుకున్నాడో భర్త. 
 
రాజస్థాన్ లోని రాజ్ కోట్‌లో నివాసముంటున్న గాంధీరామ్ ప్రహ్లాద్, మహేశ్వరిలకు ఆరు నెలల క్రితం వివాహమైంది. ఇద్దరూ కూలి పనిచేసుకుని జీవనం సాగించేవారు. గాంధీరామ్ ప్రహ్లాద్‌కు దాంపత్య జీవితంపై ఆసక్తి లేదు. ఈ విషయంలో భర్తపై ఎన్నోసార్లు ఒత్తిడి తెచ్చింది భార్య. అయితే తనకు ఆసక్తి లేదని.. మళ్ళీమళ్ళీ అడగవద్దని భార్యను పక్కకు పెట్టేవాడు ప్రహ్లాద్.
 
దీంతో భార్య విరహం తట్టుకోలేకపోయింది. తనతో పాటు కూలి పనిచేసే నరసింహ, రవిశంకర్, మహేష్‌లతో ఆమె వివాహేతర సంబంధం పెట్టుకుంది. ఈ తంతు కాస్త నెలరోజుల నుంచి సాగుతోంది. ఇంటికే ప్రియుళ్ళను పిలిపించుకుని ఆ పని కానిచ్చేది మహేశ్వరి. భర్తకు విషయం తెలిసింది.
 
భార్యను మందలించాడు. అలా అలా గ్రామంలో అందరికీ తెలిసింది. పరువు పోతుందని భార్యను ప్రాదేయపడ్డాడు. అయినా ఆమెలో మార్పు రాలేదు. దీంతో సోమవారం సాయంత్రం కూలి పని ముగించుకుని ఇంటికి వస్తూ మార్గమధ్యంలో విద్యుత్ వైర్లను పట్టుకున్నాడు ప్రహ్లాద్. దీంతో అక్కడికక్కడే కరెంట్ షాక్ తగిలి చనిపోయాడు. విషయం తెలుసుకున్న పోలీసులు మహేశ్వరితో పాటు ముగ్గురు నిందితులును అదుపులోకి తీసుకున్నారు.

సంబంధిత వార్తలు

వరలక్ష్మీ శరత్ కుమార్‌ శబరి లో అనగనగా.. పాట విడుదల చేసిన చంద్రబోస్

బుల్లెట్ మంచి సినిమా అందుకే 50 రోజులు పూర్తిచేసుకుంది : చిత్ర యూనిట్

C.D ట్రైలర్‌తో భయపెడుతున్న అదా శర్మ

పవన్ సాటిలేని హీరో, ఆయనకు పొలిటిక్స్ అవసరం లేదు కానీ ప్రజల కోసం: ఘట్టమనేని మంజుల

ఎల్.బి.స్టేడియంలో రామ్‌చరణ్ గేమ్ ఛేంజర్ క్లయిమాక్స్ - తాజా అప్ డేట్

రాగి రోటీలు తినడం వల్ల 9 ప్రయోజనాలు

అతిగా టీ తాగితే కలిగే అనారోగ్యాలు ఏమిటో తెలుసా?

ఖాళీ కడుపుతో కొత్తిమీర నీరు తాగితే 7 గొప్ప ఆరోగ్య ప్రయోజనాలు

పీరియడ్స్ ఆలస్యంగా వస్తున్నాయా? గర్భం కాకుండా ఈ 8 కారణాలు కావచ్చు

అధిక రక్తపోటు అశ్రద్ధ చేస్తే కలిగే దుష్ఫలితాలు ఏంటో తెలుసా?

తర్వాతి కథనం