జాతీయ సెలవుదినం జాబితా నుంచి క్రిస్మస్ తొలగింపు.. మండిపడిన మమత!

Webdunia
మంగళవారం, 22 డిశెంబరు 2020 (12:25 IST)
క్రైస్తవ సోదరులు జరుపుకునే అతిముఖ్యమైన పండుగల్లో ఒకటి క్రిస్మస్. డిసెంబరు 25వ తేదీన జాతీయ సెలవుదినంగా ఇప్పటివరకు పాటిస్తూ వచ్చారు. కానీ, జాతీయ సెలవు దినం జాబితా నుంచి కిస్మస్‌ను కేంద్రం తొలగించింది. దీనిపై వెస్ట్ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ మండిపడ్డారు. 
 
క్రైస్తవులు అత్యంత వైభవంగా జరుపుకునే క్రిస్మస్ పర్వదినం నాడు జాతీయ సెలవు దినాన్ని ప్రకటించక పోవడమనేది మత ద్వేష రాజకీయాలను ప్రోత్సహించాలన్న బీజేపీ అజెండాయేనని ఆమె ఆరోపించారు. 
 
తాజాగా కోల్‌కతాలోని పార్క్ స్ట్రీట్‌లో జరిగిన క్రిస్మస్ వేడుకల్లో పాల్గొన్న ఆమె, "గత సంవత్సరం చెప్పాను, ఇంతకుముందు కూడా చెప్పాను. జీసస్ జన్మదినాన్ని జాతీయ సెలవుగా ఎందుకు ప్రకటించడం లేదు? గతంలో ఉన్న సెలవును బీజేపీ ప్రభుత్వం ఎందుకు తొలగించింది? ప్రతి ఒక్కరికీ సెంటిమెంట్లు ఉంటాయి. క్రిస్మస్ పండగ ఏం తప్పు చేసింది. ఈ పండగను ప్రపంచమంతా జరుపుకుంటారని తెలియదా?" అని మమత ప్రశ్నించారు.
 
కాగా, ఈ యేడాది కరోనా మహమ్మారి కారణంగా పూర్తి స్థాయి వేడుకలకు కొన్ని అవాంతరాలు ఏర్పడ్డాయని పేర్కొన్న ఆమె, ప్రజలంతా మాస్క్‌లు ధరించి, భౌతిక దూరం పాటిస్తూ, ఏసు జన్మదిన వేడుకలను జరుపుకోవాలని సూచించారు. 
 
మన దేశంలో లౌకికవాదాన్ని నాశనం చేయడమే బీజేపీ లక్ష్యంగా కనిపిస్తోందని ఆమె మండిపడ్డారు. ప్రస్తుతం దేశంలో అత్యంత క్రూరమైన మత రాజకీయాలు సాగుతున్నాయని, దీన్ని తాను తీవ్రంగా ఖండిస్తున్నానని మమతా బెనర్జీ చెప్పుకొచ్చారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Rashmika: గోండ్ తెగల బ్యాక్ డ్రాప్ లో రష్మిక మందన్న.. మైసా

Dil Raju: రామానాయుడు, శ్యామ్ ప్రసాద్ రెడ్డి ని స్ఫూర్తిగా తీసుకున్నా : దిల్ రాజు

Sharva : మోటార్ సైకిల్ రేసర్ గా శర్వా.. బైకర్ చిత్రం ఫస్ట్ లుక్

Chiranjeevi: సైకిళ్లపై స్కూల్ పిల్లలుతో సవారీ చేస్తూ మన శంకరవర ప్రసాద్ గారు

భవిష్యత్‌లో సన్యాసం స్వీకరిస్తా : పవన్ కళ్యాణ్ మాజీ సతీమణి

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

మిస్సోరీలో దిగ్విజయంగా నాట్స్ వాలీబాల్, త్రోబాల్ టోర్నమెంట్స్

మసాలా టీ తాగడం వలన కలిగే ఆరోగ్య ప్రయోజనాలు ఏంటి?

ఆరోగ్యకరమైన కేశాల కోసం వాల్ నట్స్

స్వ డైమండ్స్ బ్రాండ్ అంబాసిడర్‌గా ప్రీతి జింటా

ప్రపంచ ఆర్థరైటిస్‌ దినోత్సవం: రుమటాయిడ్ ఆర్థరైటిస్‌ను ముందస్తుగా గుర్తించడం ఎందుకు ముఖ్యం?

తర్వాతి కథనం
Show comments