Webdunia - Bharat's app for daily news and videos

Install App

బంగారం స్మగ్లింగ్ కేసులో కన్నడ నటి రన్యా రావు అరెస్టు - 14 కేజీల బంగారం స్వాధీనం!

ఠాగూర్
బుధవారం, 5 మార్చి 2025 (18:02 IST)
సీనియర్ ఐపీఎస్ అధికారి, కర్నాటక రాష్ట్ర పోలీస్ హౌసింగ్ కార్పొరేషన్ డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ (డీఐజీ) రామచంద్రరావు కుమార్తె, కన్నడ నటి రన్యా రావు నుంచి 14 కేజీలకు పైగా స్మగ్లింగ్ బంగారాన్ని స్వాధీనం చేసుకున్నారు. ఆ తర్వాత కెంపేగౌడ అంతర్జాతీయ విమానాశ్రయంలో ఆమెను పోలీసులు అరెస్టు చేశారు. 
 
దుబాయ్ నుంచి బెంగుళూరుకు బంగారాన్ని అక్రమంగా తరలిస్తుండగా కస్టమ్స్ అధికారులకు ఆమె పట్టుబడ్డారు. మాణిక్య చిత్రంలో సుధీప్ సరసన నటించి గుర్తింపు తెచ్చుకున్న 3 యేళ్ల రన్యా రావు గోల్డ్ స్మిగ్లింగ్ వ్యవహారం ఇపుడు శాండిల్‌వుడ్‌లో చర్చనీయాంశంగా మారింది. 
 
ఆమె లోదుస్తుల్లో బంగారాన్ని స్మగ్లింగ్ చేస్తూ ఎయిర్ పోర్టు భద్రతా సిబ్బందికి దొరికిపోయారు. ఈ వ్యవహారంలో పలువురు ప్రముఖుల ప్రమేయం ఉన్నట్టు తెలుస్తుంది. రన్యారువుకు ఎస్కార్ట్‌గా వచ్చిన పోలీసులపై కూడా డైరెక్టరేట్ ఆఫ్ రెవెన్యూ ఇంటెలిజెన్స్ అధికారులు దృష్టిసారించారు. ఈ స్మగ్లింగ్‌లో ఎవరెవరి పాత్ర ఉందనేదానిపై ఆరా తీస్తున్నారు. అలాగే, మనీలాండరింగ్ కేసులో ఈ నటి వద్ద ఈడీ అధికారులు ప్రశ్నించేందుకు సిద్ధమవుతున్నారు. 
 
మరోవైపు, రన్యారావును కోర్టులో హాజరుపరచగా ఆమెకు బెంగుళూరు కోర్టు 14 రోజుల రిమాండ్ విధించింది. ఆమె విదేశాల నుంచి ఢిల్లీ మీదుగా బెంగుళూరుకు బంగారం స్మగ్లింగ్ చేస్తున్నట్టు ప్రాథమికంగా గుర్తించారు. పైగా, రెండు వారాల వ్యవధిలో ఆమె నాలుగుసార్లు బెంగుళూర్ నుంచి దుబాయ్‌కు వెళ్లి వచ్చినట్టు ఆధారాలు లభించాయి. అలాగే, ఎయిర్‌పోర్టుకు వచ్చిన ప్రతిసారి ఆమె పోలీస్ సెక్యూరిటీతో ఇంటికి వెళ్లేది. ఆమె నుంచి స్వాధీనం చేసుకున్న బంగారం విలువ రూ.12 కోట్లుగా ఉంటుందని సమాచారం. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

అఖిల్ అక్కినేని న‌టించిన ఏజెంట్ మూవీ సోనీ లివ్‌లో స్ట్రీమింగ్

రాజమండ్రి లో జయప్రద సోదరుడు రాజబాబు అస్థికల నిమజ్జనం

Sai Tej: వెయ్యి మంది డ్యాన్సర్స్ తో 125 కోట్ల బడ్జెట్‌తో సంబరాల ఏటిగట్టు షూటింగ్

ప్రేమించడం లేదా అన్నది తన వ్యక్తిగతం : సమంత

Samantha: ఇంకోసారి ప్రేమలో పడి ఆలోచనే సమంతకు లేదా? జెస్సీ రోల్ అంటే చాలా ఇష్టం

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

Dry Fruits: పెరుగులో డ్రై ఫ్రూట్స్ కలిపి పిల్లలకు ఇవ్వడం చేస్తే?

మహిళలు రోజూ గంట సేపు వాకింగ్ చేస్తే.. ఏంటి లాభం?

ఫ్లూ సమస్యను తరిమికొట్టండి: ఆరోగ్యంగా పనిచేయండి!

వేసవిలో చెరుకురసం ఎందుకు తాగాలో తెలుసా?

రక్త మూల కణ దానంపై అవగాహన కల్పించేందుకు చేతులు కలిపిన DKMS ఇండియా- IIT హైదరాబాద్

తర్వాతి కథనం
Show comments