Webdunia - Bharat's app for daily news and videos

Install App

మహారాష్ట్ర కొత్త హోం మంత్రిగా దిలీప్ వాల్సె పాటిల్

Webdunia
మంగళవారం, 6 ఏప్రియల్ 2021 (10:45 IST)
మహారాష్ట్ర రాష్ట్ర నూత‌న‌ హోంశాఖ మంత్రిగా నేష‌న‌లిస్ట్ కాంగ్రెస్ పార్టీ (ఎన్సీపీ) నేత దిలీప్‌ వాల్షే పాటిల్‌ నియమితులయ్యారు. ఇప్ప‌టివ‌ర‌కు హోంమంత్రిగా ఉన్న అనిల్‌ దేశ్‌ముఖ్‌ అవినీతి ఆరోపణలపై సీబీఐ విచారణకు బాంబే హైకోర్టు ఆదేశించారు. ఈ నేపథ్యంలో అనిల్ దేశ్‌ముఖ్ తన పదవికి రాజీనామా చేశారు.
 
దీంతో ఇప్పటికే ఎక్సైజ్‌ శాఖ మంత్రిగా కొనసాగుతున్న దిలీప్‌ వాల్షేకు రాష్ట్ర ముఖ్య‌మంత్రి ఉద్ధ‌వ్ ఠాక్రే.. హోంశాఖ బాధ్యతలు అప్పగించారు. ప్రస్తుతం దిలీప్‌ వాల్షే నిర్వహిస్తున్న ఎక్సైజ్‌ శాఖను డిప్యూటీ సీఎంగా ఉన్న అజిత్‌ పవార్‌కు అప్పగించాలని మ‌హారాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది.
 
1954 అక్టోబర్ 30వ తేదీన అంబెగాన్‌లో జన్మించిన దిలీప్‌ వాల్షేకు రాజ‌కీయాల‌తో సంబంధం ఉంది. రాజకీయ కుటుంబం నుంచే వ‌చ్చిన దిలీప్ వాల్షే ఎన్సీపీ అధినేత శరద్‌ పవార్‌ స్నేహితుడు- కాంగ్రెస్‌ మాజీ ఎమ్మెల్యే దత్తాత్రేయ్‌ వాల్షే పాటిల్ కుమారుడు. శరద్‌ పవార్‌కు వ్యక్తిగత సహాయకుడిగా దిలీప్‌ వాల్షే తన కెరీర్‌ను ప్రారంభించారు.
 
ఈయ‌న ప‌వార్ వ్య‌క్తిగ‌త స‌హాయకుడిగా కెరీర్ ప్రారంభించారు. 1990లో కాంగ్రెస్ టికెట్ మీద అంబెగావ్ నుంచి పోటీ చేసి గెలిచారు.  నాటి నుంచి అదే స్థానం నుంచి వరుసగా విజయం సాధిస్తున్నారు. 1999లో ఎన్సీపీ ఏర్పాటైనప్పుడు ఆయన పవార్‌ వెంట నడిచారు.
 
త‌ర్వాత‌ కాంగ్రెస్‌ నేతృత్వంలోని విలాస్‌రావ్‌ దేశ్‌ముఖ్‌ కేబినెట్‌లో విద్యుత్‌, వైద్యవిద్య శాఖల‌ మంత్రిగా పనిచేశారు. 2009 నుంచి 2014 వరకు మహారాష్ట్ర అసెంబ్లీ స్పీకర్‌గా ప‌ని చేశారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

కర్మ ఏం చెబుతుందంటే... నయనతార ఆసక్తికర ట్వీట్

"వికటకవి"కి వ‌ర్క్ చేయ‌టం డిఫ‌రెంట్ ఎక్స్‌పీరియెన్స్‌: జోశ్యుల‌ గాయ‌త్రి దేవి

నందమూరి మోక్షజ్ఞ చరిష్మాటిక్ న్యూ స్టిల్‌ రిలీజ్

సోనూసూద్‌కు సంకల్ప్ కిరణ్ పురస్కారంతో సత్కారం

ఏఆర్ రెహ్మాన్-సైరా విడాకులు రద్దు అవుతాయా? సైరా లాయర్ ఏమన్నారు?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

Mint Juice, శీతాకాలంలో పుదీనా రసం తాగితే?

లెమన్ టీ తాగుతున్నారా? ఐతే వీటిని తినకండి

లవంగం పాలు ఆరోగ్య ప్రయోజనాలు

చియా విత్తనాలు అద్భుత ప్రయోజనాలు

Winter Fruit కమలా పండ్లును తింటే ప్రయోజనాలు

తర్వాతి కథనం
Show comments