కరోనా మహమ్మారి ఇంకా ప్రపంచాన్ని వదల్లేదు.. డబ్ల్యూహెచ్‌వో

Webdunia
సోమవారం, 25 అక్టోబరు 2021 (23:53 IST)
కరోనా మహమ్మారి ఇంకా ప్రపంచాన్ని వదల్లేదని.. ప్రపంచ దేశాలు అప్రమత్తంగా ఉండాలని ప్రపంచ ఆరోగ్య సంస్థ హెచ్చరించింది. ప్రపంచ ఆరోగ్య సమీక్షా కార్యక్రమంలో డబ్ల్యూహెచ్‌వో (ప్రపంచ ఆరోగ్య సంస్థ) చీఫ్ టెడ్రోస్ అధానమ్‌ ఘెబ్రియేసస్ మాట్లాడుతూ ఈ వ్యాఖ్యలు చేశారు. ఇప్పటికీ వారానికి 50 వేల కరోనా మరణాలు ప్రపంచ వ్యాప్తంగా నమోదవుతున్న విషయాన్ని ఆయన గుర్తుచేశారు.
 
ఇలాంటి పరిస్థితుల్లో కరోనా మహమ్మారి తగ్గిపోయిందని భావించడం సరికాదని అభిప్రాయపడ్డారు. ప్రపంచం కోరుకున్నప్పుడే ఈ మహమ్మారిని అంతమొందిచగలమని టెడ్రోస్ చెప్పారు. తమ జనాభాలో 40 శాతంపైగా ప్రజలకు వ్యాక్సిన్ అందించిన జీ20 దేశాలు ఇకపై కోవ్యాక్స్‌పై దృష్టి సారించాలని కోరారు. ప్రపంచంలోని పేద దేశాలకు వ్యాక్సిన్ అందించేందుకు ప్రపంచ ఆరోగ్య సంస్థ కోవ్యాక్స్‌ మిషన్‌ ప్రారంభించిన సంగతి తెలిసిందే. 
 
అలాగే ఆఫ్రికా దేశాల కోసం ఆఫ్రికన్ వ్యాక్సిన్ అక్విషన్ ట్రస్ట్ (ఏవీఏటీ) అనే స్వచ్ఛంద సంస్థ కూడా వ్యాక్సిన్‌ సేకరణ కోసం కృషి చేస్తోంది. జీ20 దేశాలు ఈ రెండు పథకాల్లో యాక్టివ్‌గా పాలుపంచుకోవాలని టెడ్రోస్ విజ్ఞప్తి చేశారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Harish Kalyan: హ‌రీష్ క‌ళ్యాణ్ హీరోగా దాషమకాన్ టైటిల్ ప్రోమో

Ramana Gogula: ఆస్ట్రేలియా టూ అమెరికా..రమణ గోగుల మ్యూజిక్ జాతర

చిరంజీవిని శ్రీనివాస కళ్యాణ మహోత్సవానికి ఆహ్వానించిన వంశీ కృష్ణ

Anaswara Rajan: ఛాంపియన్ నుంచి చంద్రకళగా అనస్వర రాజన్ గ్లింప్స్ రిలీజ్

Bunny Vas: ఐ బొమ్మ రవి సపోర్టర్లపై బన్నీ వాస్ ఎదురుదాడి

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

కూరల్లో వేసుకునే కరివేపాకును అలా తీసిపడేయకండి, ఎందుకంటే?

Winter Health, హానికరమైన వ్యాధులను దూరం చేసే పసుపు

పోషకాలు తగ్గకుండా వీగన్ డైట్‌కు మారడం ఎలా?

చలికాలంలో ఎలాంటి కూరగాయలు తినాలో తెలుసా?

మైగ్రేన్ నుండి వేగవంతమైన ఉపశమనం కోసం ఓరల్ ఔషధాన్ని ప్రారంభించిన ఫైజర్

తర్వాతి కథనం
Show comments