Webdunia - Bharat's app for daily news and videos

Install App

మోడీ దీవెనలు చిన్నమ్మకు కలిసిరాలేదా? అబ్బే.. ఇలా జరిగిపోయిందేమిటి?

దివంగత ముఖ్యమంత్రి జయలలిత లేని లోటు తమిళనాట స్పష్టంగా తెలిసిపోతుంది. డీఎంకే పార్టీ కురువృద్ధుడు, మాజీ సీఎం కరుణానిధి కూడా అనారోగ్యం నుంచి మెల్ల మెల్లగా కోలుకుంటుండంతో రాజకీయ తంత్రాలకు చోటులేకుండా పోయి

Webdunia
బుధవారం, 19 ఏప్రియల్ 2017 (17:57 IST)
దివంగత ముఖ్యమంత్రి జయలలిత లేని లోటు తమిళనాట స్పష్టంగా తెలిసిపోతుంది. డీఎంకే పార్టీ కురువృద్ధుడు, మాజీ సీఎం కరుణానిధి కూడా అనారోగ్యం నుంచి మెల్ల మెల్లగా కోలుకుంటుండంతో రాజకీయ తంత్రాలకు చోటులేకుండా పోయింది. దీంతో అధికారం చేతిలో లేకపోవడంతో కరుణ తనయుడు స్టాలిన్ కూడా మిన్నకుండిపోయారు.

ఈ నేపథ్యంలో అమ్మ మరణానికి అనంతరం పన్నీర్ సీఎం అయినా.. చిన్నమ్మే అంతా తానై చూసుకుంది. పార్టీని, తమిళ రాష్ట్రాన్ని శాసించాలనుకుంది. కానీ ఇంతలోనే అక్రమాస్తుల కేసు, పన్నీర్ సెల్వం తిరగబడటంతో చిన్నమ్మ జైలుకు వెళ్లిపోయింది. 
 
ప్రస్తుతం దినకరన్ కూడా రెండాకుల చిహ్నం కోసం ఈసీ లంచం ఇవ్వజూపారనే కేసులో ఇరుక్కున్నాడు. దీంతో ఓపీఎస్-పళని సామి వర్గాలు చేతులు కలిపేందుకు రెడీ అయ్యాయి. అలాగే చర్చల ద్వారా సమస్యలు పరిష్కరించుకుని.. అమ్మ ఆశయాలను నెరవేర్చేందుకు అన్నాడీఎంకే పార్టీని, రెండాకుల చిహ్నాన్ని సొంతం చేసుకునేందుకు సన్నద్ధమైనాయి. అంతేగాకుండా మంత్రిగా ఓపీఎస్ ఇక కొనసాగేది లేదని.. ఆయన్ని సీఎం చేయడం ద్వారానే అన్నాడీఎంకే పార్టీలో మళ్లీ ముసలం ప్రారంభం కాదని ఓపీఎస్ వర్గం పట్టుబడుతోంది.
 
ఈ నేపథ్యంలో తమిళనాడు రాజకీయాలపై సోషల్ మీడియాలో నెటిజన్లు రకరకాల ట్వీట్లు, పోస్టులతో అభిప్రాయాలు పంచుకుంటున్నారు. తాజాగా తమిళనాడు దివంగత సీఎం జయలలిత భౌతికకాయాన్ని సందర్శించిన ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ శశికళను ఓదార్చారు. అప్పట్లో మోడీ తన చేయిని శశికళ నెత్తిపై పెట్టి ఓదార్చే ఫోటోపై చాలా స్టోరీలొచ్చాయి. ఇక శశికళకు తిరుగులేదని, అన్నాడీఎంకెలో జయలలిత మాదిరిగానే ఆమె పెద్ద శక్తిగా మారుతుందంటూ రకరకాల వార్తలు సోషల్ మీడియాలో చక్కర్లు కొట్టాయి.
 
తాజాగా అదే ఫోటో ఇప్పుడు నెట్టింట్లో తెగ హల్‌చల్ చేస్తోంది. మోడీ చేయి పెడితే మటాషేనంటూ రకరకాల క్యాప్షన్స్‌తో హంగామా చేస్తున్నాయి. ఇప్పటికే ఆస్తుల కేసులో శశికళ జైలు జీవితం గడుపుతుండగా, ఆమె మేనల్లుడు దినకరన్ లంచం కేసులో అడ్డంగా బుక్కయ్యాడు. దీంతో ప్రధాని మోడీ దీవెనలు చిన్నమ్మకు ఏమాత్రం కలిసిరాలేదని నెటిజన్లు అభిప్రాయపడుతున్నారు. ఇంకా జయమ్మ ఆత్మనే చిన్నమ్మను జైలుకు పంపిందని.. పన్నీరుకు మద్దతుగా నిలిచి.. పార్టీ మేలు కోసం దినకరన్‌కు గండికొట్టేలా చేసిందని నెటిజన్లు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.

సినారేకు నివాళిగా రాబోతున్న "నా ఉచ్ఛ్వాసం కవనం" ప్రోగ్రాం కర్టెన్ రైజర్ కార్యక్రమం

కౌంట్‌డౌన్ ప్రారంభం: మాగ్నమ్ ఓపస్ 'కల్కి 2898 AD' అప్‌డేట్

లాక్‌డౌన్‌లో పవిత్రతో ఎఫైర్, నా ముఖం చూస్తేనే అసహ్యించుకునేవాడు: చంద్రకాంత్ భార్య

యేవమ్ చిత్రంలో ‘వశిష్ట ఎన్ సింహ’ గా యుగంధర్

శ్రీ గణేష్‌ దర్శకత్వంలో ద్విభాషా చిత్రం సిద్దార్థ్ 40 అనౌన్స్ మెంట్

ఫోలిక్యులర్ లింఫోమా స్టేజ్ IV చికిత్సలో విజయవాడ అమెరికన్ ఆంకాలజీ ఇన్‌స్టిట్యూట్ విశేషమైన విజయం

చేతులతో భోజనం తినడం వల్ల 5 ఉత్తమ ఆరోగ్య ప్రయోజనాలు

పెద్ద ఉల్లిపాయలు తింటే గొప్ప ప్రయోజనాలు, ఏంటవి?

ఆదివారం అంటేనే బిర్యానీ లాగిస్తున్నారా? ఇవి తప్పవండోయ్!

పనస పండ్లలోని పోషకాలేంటి..? ఎవరు తినకూడదు?

తర్వాతి కథనం
Show comments