Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఇద్దరూ ఒకే గదిలో వున్నారు.. ఏమైందో ఏమో కానీ.. అతడు అలా కనిపించాడు..?

Webdunia
శుక్రవారం, 26 మార్చి 2021 (08:03 IST)
ప్రేమ, పెళ్ళి, సహజీవనం ప్రస్తుతం ఈజీ అయిపోయింది. ఇంటికి తెలియకుండా చాలామంది సహజీవనం పేరిట కలిసివుంటున్నారు. ఇలా ఓ ప్రైవేట్ కంపెనీలో పనిచేసే ఇద్దరు ఉద్యోగులు ఒకే ఇంట్లో అద్దెకు వున్నారు. ఆమెతో పెరిగిన పరిచయం చనువుగా మారి ఇద్దరూ కలిసి అదే అద్దె ఇంట్లో ఉండేంతలా పరిస్థితి మారింది. కొన్నాళ్లు ఇద్దరూ అదే ఇంట్లో ఉంటూ, తింటూ బాగానే ఉన్నారు. కానీ.. ఏమైందో తెలియదు ఆ యువకుడు నాలుగు రోజుల క్రితం అదే ఇంట్లో శవమై కనిపించాడు. 
 
పూర్తి వివరాల్లోకి వెళితే.. కర్ణాటకలోని బళ్లారి తాలూకా తోరణగల్లులోని బాబానగర్‌లో పశ్చిమ బెంగాల్‌కు చెందిన అశిశ్(28) నివాసముంటున్నాడు. స్థానిక ప్రైవేట్ కంపెనీలో పనిచేస్తున్న క్రమంలో ఓ మహిళతో పరిచయం ఏర్పడింది. ఆ మహిళతో కలిసే గత కొన్నేళ్లుగా యువకుడు అద్దె ఇంట్లో నివాసముంటున్నాడు. ఏమైందో తెలియదు గానీ.. అశిశ్ నాలుగు రోజుల క్రితం శవమై కనిపించాడు. అప్పటి నుంచి ఆ మహిళ కూడా అదృశ్యమైంది. అశిశ్ చనిపోయిన విషయం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.
 
అశిశ్ అద్దెకు ఉంటున్న గదిలో నుంచి దుర్వాసన రావడంతో ఇంటి యజమాని పోలీసులకు సమాచారమందించాడు. పోలీసులు గది తలుపులు తీసి చూడగా.. అశిశ్ శవం కనిపించింది. హత్య జరిగిన తీరును గమనించిన పోలీసులు.. నాలుగు రోజుల క్రితమే అశిశ్ హత్యకు గురైనట్లు చెప్పారు. ఈ హత్య ఘటనను పరిశీలిస్తే.. యువకుడిని ఆ మహిళతో పాటు మరికొందరు కలిసి హతమార్చి ఉంటారని పోలీసులు అనుమానం వ్యక్తం చేశారు.
 
ఇంటి యజమాని ఫిర్యాదు ఆధారంగా తోరణగల్లు పోలీసులు అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. ఆ మహిళ కోసం పోలీసులు గాలిస్తున్నారు. అశిశ్ మృతదేహాన్ని పోస్ట్‌మార్టం నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Photos in Sydney: ఫోటోలను క్లిక్ మనిపించింది ఎవరు..? సమంత సమాధానం ఏంటంటే?

రేపటి నుండి మ్యాడ్ స్వ్కేర్ స్క్రీనింగ్ లలో కింగ్ డమ్ టీజర్ ఎట్రాక్షన్

OG సినిమాలో నన్ను ధ్వేషిస్తారు, ప్రేమిస్తారు : అభిమన్యు సింగ్

Ntr: జపాన్‌ లో అందమైన జ్ఞాపకాలే గుర్తొస్తాయి : ఎన్టీఆర్

VB ఎంటర్‌టైన్‌మెంట్స్ ఫిల్మ్ అండ్ టీవీ, డిజిటల్ మీడియా అవార్డ్స్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

30 ఏళ్లు పైబడిన మహిళలు తప్పనిసరిగా తినవలసిన పండ్లు

Green Peas: పచ్చి బఠానీలను ఎవరు తినకూడదో తెలుసా?

Jaggery Tea : మధుమేహ వ్యాధిగ్రస్తులు బెల్లం టీ తాగవచ్చా?

లోబీపి లక్షణాలు, సమస్యలు ఏంటి?

Healthy diet For Kids: పిల్లల ఆహారంలో పోషకాహారం.. ఎలాంటి ఫుడ్ ఇవ్వాలి..

తర్వాతి కథనం
Show comments