Webdunia - Bharat's app for daily news and videos

Install App

బ్లూవేల్ ఆన్‌లైన్ గేమ్‌కి మరో విద్యార్థి బలి.. ప్లాస్టిక్ కవర్‌ను చుట్టుకుని?

బ్లూవేల్ ఆన్‌లైన్ గేమ్‌కి మరో విద్యార్థి బలైపోయాడు. ఇప్పటికే ప్రపంచ వ్యాప్తంగా ఎంతో మంది ప్రాణాలు తీసిన ఈ గేమ్‌‌పై ఆసక్తి పెంచుకున్న ఓ విద్యార్థి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఈ వీడియోగేమ్ ఆడుతున్న వారు 50

Webdunia
ఆదివారం, 13 ఆగస్టు 2017 (18:08 IST)
బ్లూవేల్ ఆన్‌లైన్ గేమ్‌కి మరో విద్యార్థి బలైపోయాడు. ఇప్పటికే ప్రపంచ వ్యాప్తంగా ఎంతో మంది ప్రాణాలు తీసిన ఈ గేమ్‌‌పై ఆసక్తి పెంచుకున్న ఓ విద్యార్థి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఈ వీడియోగేమ్ ఆడుతున్న వారు 50 దశలు పూర్తి చేసిన తర్వాత చివ‌రి టాస్క్‌గా ఆత్మ‌హత్య చేసుకోవాల్సి ఉంటుంది. ఇదే తరహాలో  పశ్చిమ బెంగాల్‌లోని మిడ్నాపూర్‌ జిల్లాకు చెందిన పదో విద్యార్థి అంకన్‌ బలవన్మరణానికి పాల్పడ్డాడు. 
 
శనివారం పాఠ‌శాల నుంచి వచ్చిన తర్వాత స్నానం చేసి వస్తానని చెప్పి బాత్‌రూమ్‌లోకి వెళ్లాడు. బాత్రూమ్‌లో మెడచుట్టూ పాలిథిన్‌ కవర్‌ను గట్టిగా చుట్టుకొని ఆత్మహత్య చేసుకున్నాడు. అంత‌కుముందే ఆ విద్యార్థి బ్లూవేల్‌ గేమ్‌ ఆడుతూ కనిపించాడని పోలీసులు చెప్తున్నారు. బాత్‌రూమ్‌లో అపస్మారక స్థితిలో పడివున్న అంకన్‌ను ఆతడి తల్లిదండ్రులు ఆస్పత్రికి తరలించినప్పటికీ.. ఆ బాలుడు అప్పటికే ప్రాణాలు కోల్పోయినట్లు వైద్యులు నిర్ధారించారు.
అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

బిగ్ బాస్‌ ఇంట్లో మొదలైన ప్రేమ.. అమీర్‌ను పెళ్లాడనున్న పావని రెడ్డి

భారతీయ సినిమా కథల్లోకి హిందూయిజం, ఆధ్యాత్మికత ప్రవేశిస్తున్నాయా? ప్రత్యేక కథనం

మస్తాన్ సాయి వల్ల దర్గాకు అపవిత్రత... గవర్నర్‌కు లావణ్య లేఖ

రజనీకాంత్‌ కూలీలో అమితాబ్‌, నాగార్జున ఎంట్రీ షురూ !

కార్తీక్ ఆర్యన్‌తో గ్లామర్ డోస్ పెంచేసిన శ్రీలీల.. బాలీవుడ్‌లో హిట్టవుతుందా? (video)

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

న్యూజెర్సీలో నాట్స్ ఆర్ధిక అవగాహన సదస్సు

సందీప్ మక్తాలా, బాబా రామ్‌దేవ్ సమన్వయంతో సమగ్ర ఆరోగ్య విప్లవం

GBS Virus: మహారాష్ట్రలో కొత్త వైరస్.. ఏపీలోనూ పదేళ్ల బాలుడి మృతి.. లక్షణాలివే.. అలెర్ట్

ఎసిడిటీని పెంచే 10 ఆహారాలు, ఏంటవి?

తర్వాతి కథనం
Show comments