'జయలలిత' చికిత్స గుట్టు లీజియన్ గ్రూప్ చేతిలో... తాము నోరు తెరిస్తే భారత్‌లో కల్లోలమేనని ప్రకటన..

చెన్నైలోని అపోలో ఆస్పత్రిలో దివంగత తమిళనాడు ముఖ్యమంత్రి జయలలిత 75 రోజుల చికిత్స తర్వాత తుదిశ్వాస విడిచిన నేపథ్యంలో లీజియన్ గ్రూపు ప్రకటన సంచలనం సృష్టిస్తోంది. ‘అమ్మ’ చివరి క్షణంలో అపోలో కేంద్రంగా రాజక

Webdunia
మంగళవారం, 13 డిశెంబరు 2016 (08:27 IST)
చెన్నైలోని అపోలో ఆస్పత్రిలో దివంగత తమిళనాడు ముఖ్యమంత్రి జయలలిత 75 రోజుల చికిత్స తర్వాత తుదిశ్వాస విడిచిన నేపథ్యంలో లీజియన్ గ్రూపు ప్రకటన సంచలనం సృష్టిస్తోంది. ‘అమ్మ’ చివరి క్షణంలో అపోలో కేంద్రంగా రాజకీయాలు నడిచిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో లీజియన్ ప్రకటన తీవ్ర సంచలనమైంది. అపోలో ఆస్పత్రికి చెందిన కంప్యూటర్‌ సర్వర్లకు సంబంధించిన పూర్తి వివరాలు తమ వద్ద ఉన్నాయని ప్రకటించింది. 
 
నిజానికి ఈ సంస్థ దేశంలోని వివిధ రంగాలకు చెందిన పలువురు ప్రముఖుల ట్విట్టర్ అకౌంట్లను హ్యాక్ చేసిన ‘లీజియన్’ గ్రూప్ తాజాగా మరో బాంబు పేల్చింది. అపోలో ఆస్పత్రి సర్వర్లకు సంబంధించిన వివరాలు తమ వద్ద ఉన్నాయని, అందులో భారత్‌కు చెందిన ప్రముఖ రాజకీయ నాయకుల డేటా ఉందని పేర్కొంది. దానిని కానీ బయటపెడితే భారత్‌లో కల్లోలం తప్పదని స్పష్టం చేసింది.
 
భారత సర్వర్ల నుంచి క్రోడీకరించిన సమాచారంలో భారత ప్రముఖులకు సంబంధించిన డేటా తమ వద్ద ఉందని లీజియన్ వివరించింది. భారత్‌లోని ప్రముఖుల ట్విట్టర్ ఖాతాలను హ్యాక్ చేస్తున్న లీజియన్ కాంగ్రెస్ పార్టీ ఉపాధ్యక్షుడు రాహుల్‌ గాంధీ, పారిశ్రామిక వేత్త విజయ్‌మాల్యా, జర్నలిస్టు బర్ఖాదత్, రవిష్ కుమార్ వంటి వారి ట్విట్టర్ ఖాతాలను హ్యాక్ చేసింది. కాగా తమ తదుపరి లక్ష్యం ఐపీఎల్ మాజీ చైర్మన్ లలిత్ మోడీ అని చెప్పిన లీజియన్ ప్రతినిధి అక్రమార్కుల వివరాలిస్తే మరిన్ని హ్యాక్‌లు చేస్తామని వెల్లడించింది.
అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Vishnu : శ్రీ విష్ణు, నయన సారిక జంటగా విష్ణు విన్యాసం రాబోతుంది

Bobby Simha: బాబీ సింహా, హెబ్బా పటేల్ జంట గా చిత్రం ప్రారంభం

Jin: భూతనాల చెరువు నేపథ్యంగా జిన్ మూవీ సిద్దమైంది

నటిపై లైంగిక దాడి కేసు - నిర్దోషిగా మంజు వారియర్ మాజీ భర్త... న్యాయం జరగలేదు...

Bobby Simha: బాబీ సింహా, హెబ్బా పటేల్ కాంబినేషన్ లో చిత్రం లాంచ్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఉసిరి, నిమ్మకాయతో ఉప్పు.. గుండె ఆరోగ్యంతో పాటు రక్తపోటుకు చెక్

అప్పుడప్పుడు కాస్త పచ్చికొబ్బరి కూడా తింటుండాలి, ఎందుకంటే?

ఈ శీతాకాలంలో కాలిఫోర్నియా బాదంతో మీ చర్మానికి తగిన సంరక్షణను అందించండి

తులసి పొడితో హెయిర్ ప్యాక్ వేసుకుంటే.. జుట్టు నెరవదు.. తెలుసా?

Tomato Soup: శీతాకాలంలో టమోటా సూప్ తీసుకుంటే?

తర్వాతి కథనం
Show comments