Webdunia - Bharat's app for daily news and videos

Install App

ప్రమాదకర స్థాయిలో గంగా - యమున నదులు - నీట మునిగిన ఉత్తరభారతం

Webdunia
సోమవారం, 10 అక్టోబరు 2022 (14:51 IST)
ఉత్తర భారతదేశంలో విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి. ఈ కుంభవృష్టి కారణంగా ఈ ప్రాంతంలోని అనేక నదులు పొంగి ప్రవహిస్తున్నాయి. ముఖ్యంగా, గంగా, యమున నదులు ప్రమాకరస్థాయిలో ప్రవహిస్తున్నాయి. ఈ నదుల్లో నీటి ప్రవాహం ఒక్కసారిగా పెరిగిపోవడంతో త్రివేణి సంగమమైన ఉత్తర్​ ప్రదేశ్​లోని ప్రయాగ్​ రాజ్​ నీట మునిగింది.
 
ఇరు నదులు ఉప్పొంగి ప్రవహించటం వల్ల ప్రయాగ్​రాజ్​లోని లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. నగరంలోని ప్రజలు బిక్కుబిక్కుమంటూ కాలం వెళ్లదీస్తున్నారు. దరగంజ్​, సలోరి, బఘద, రాజ్​పుర్​, నైనీ, ఝాన్సీ వంటి ప్రాంతాల్లో మొదటి అంతస్తు నీటిలో మునగటం వల్ల పైఅంతస్తులో తలదాచుకుంటున్న దృశ్యాలు కనిపిస్తున్నాయి. 
 
అనేక ప్రాంతాల్లోని వీధులన్ని నీట మునిగాయి. దీంతో వరద బాధితులను వీధుల నుంచి పడవలపై సురక్షిత ప్రాంతాలకు తరలిస్తున్నారు. ప్రయాగ్​రాజ్​లో గంగా నది 84.73 మీటర్ల మేర ప్రమాదకర స్థాయిలో ప్రవహిస్తోంది. మరోవైపు యమునా నది నైనీలో 83.88 మీటర్ల మేర ప్రవహిస్తోంది. దీంతో ఉత్తరభారత ప్రజలు ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని బిక్కుబిక్కుమంటూ జీవిస్తున్నారు. 

సంబంధిత వార్తలు

రాజకీయాల్లోకి వచ్చినా సినిమాలకు దూరం కాను.. కంగనా రనౌత్

ధనుష్ నటిస్తున్న రాయన్ ఫస్ట్ సింగిల్‌ కు సమయం వచ్చింది!

మలేషియా లో నవతిహి ఉత్సవం 2024 పేరుతో తెలుగు సినిమా 90 ఏళ్ల వేడుక ఖరారు

వెస్ట్రన్ కంట్రీస్ బాటలోనే బాహుబలి: క్రౌన్ ఆఫ్ బ్లడ్ చేశాం : ఎస్ఎస్ రాజమౌళి

హీరో అల్లు అర్జున్‍‌ను పెళ్లి చేసుకుంటానంటున్న తమిళ నటి!!

శరీరంలోని కొవ్వు కరగడానికి సింపుల్ సూప్

acidity కడుపులో మంట తగ్గటానికి ఈ చిట్కాలు

ఆ సమస్యలకు వెల్లుల్లి వైద్యం, ఏం చేయాలంటే?

బాదంపప్పును ఎండబెట్టినవి లేదా నానబెట్టివి తినాలా?

ఎన్నికల సీజన్‌లో కొన్ని బాదంపప్పులతో చురుకుగా, శక్తివంతంగా ఉండండి

తర్వాతి కథనం
Show comments