Webdunia - Bharat's app for daily news and videos

Install App

వివాహితపై కన్నేశారు.. లోపలికి పిలిచి కోరిక తీర్చమన్నారు.. కాదనేసరికి?

Webdunia
మంగళవారం, 9 అక్టోబరు 2018 (12:48 IST)
వివాహితపై కన్నేశాడు. ఆమెను ఎలాగైనా లోబరుచుకోవాలనుకున్నాడు. ఆమెతో వివాహేతర సంబంధం పెట్టుకోవాలనుకున్నాడు. ఆ తర్వాత అతని స్నేహితునికి కూడా ఆమెను పంచాలనుకున్నాడు. అయితే వివాహేతర సంబంధానికి ఆమె అంగీకరించకపోవడంతో.. ఆ మహిళను ఆ దుర్మార్గుడు దారుణంగా హత్య చేశాడు. ఈ ఘటన ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో చోటుచేసుకుంది.
 
వివరాల్లోకి వెళితే.. ఉత్తరప్రదేశ్‌లోని బిజ్నూర్ ప్రాంతంలో ఉండే సుశీల్(40) వాచ్‌మెన్‌గా విధులు నిర్వహిస్తున్నాడు. వివేక్ విహార్ ఏరియాలో ఖాళీగా ఉండే ఓ ఇంటికి కాపలా కాస్తున్నాడు. అదే ప్రాంతంలో 42 ఏళ్ల మహిళపై సుశీల్, అతని స్నేహితుడు మోజు పడ్డారు. ఈ నెల 6న ఇంటి ముందు నుంచి వెళుతున్న మహిళను లోపలికి పిలిచి.. తమ కోరిక తీర్చాల్సిందిగా బలవంతం చేశారు. అందుకు ఆమె అంగీకరించకపోవడంతో.. ఆవేశంతో ఆమెపై దాడికి పాల్పడ్డారు. 
 
గొంతు నులిమి చంపేశారు. ఆపై ఆమె శవాన్ని అక్కడే వదిలేసి పరారయ్యారు. మహిళ మృతదేహన్ని గుర్తించిన స్థానికులు, పోలీసులకు సమాచారం అందించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు.. వాచ్‌మెన్‌ను అరెస్ట్ చేశారు. అతని స్నేహితుడు మాత్రం పరారిలో ఉన్నట్లు పోలీసులు తెలిపారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

రేపటి నుండి మ్యాడ్ స్వ్కేర్ స్క్రీనింగ్ లలో కింగ్ డమ్ టీజర్ ఎట్రాక్షన్

OG సినిమాలో నన్ను ధ్వేషిస్తారు, ప్రేమిస్తారు : అభిమన్యు సింగ్

Ntr: జపాన్‌ లో అందమైన జ్ఞాపకాలే గుర్తొస్తాయి : ఎన్టీఆర్

VB ఎంటర్‌టైన్‌మెంట్స్ ఫిల్మ్ అండ్ టీవీ, డిజిటల్ మీడియా అవార్డ్స్

డల్ గా వుంటే మ్యాడ్ లాంటి సినిమా చూడమని డాక్టర్లు కూడా చెప్పాలి : నాగచైతన్య

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

Green Peas: పచ్చి బఠానీలను ఎవరు తినకూడదో తెలుసా?

Jaggery Tea : మధుమేహ వ్యాధిగ్రస్తులు బెల్లం టీ తాగవచ్చా?

లోబీపి లక్షణాలు, సమస్యలు ఏంటి?

Healthy diet For Kids: పిల్లల ఆహారంలో పోషకాహారం.. ఎలాంటి ఫుడ్ ఇవ్వాలి..

Coconut Oil: మహిళలూ రాత్రిపూట కొబ్బరినూనెను ముఖానికి రాసుకుంటే?

తర్వాతి కథనం
Show comments