కారులో వెళ్తూ.. డోర్ తెరిచి.. ఓ ఇంటి మెట్లపై పసికందును వుంచి?

నిన్నటికి నిన్న నాచారంలో అప్పుడే పుట్టిన ఆడశిశువును ముళ్లపాలు చేసిన సంగతి తెలిసిందే. గత ఆదివారం కేరళలో ఐదు రోజుల పసిపాపను ఓ జంట చర్చి వద్ద వదిలిపెట్టి వెళ్లిపోయింది. నాలుగో బిడ్డను కన్నామని అందరూ తమను

Webdunia
గురువారం, 7 జూన్ 2018 (09:13 IST)
నిన్నటికి నిన్న నాచారంలో అప్పుడే పుట్టిన ఆడశిశువును ముళ్లపాలు చేసిన సంగతి తెలిసిందే. గత ఆదివారం కేరళలో ఐదు రోజుల పసిపాపను ఓ జంట చర్చి వద్ద వదిలిపెట్టి వెళ్లిపోయింది. నాలుగో బిడ్డను కన్నామని అందరూ తమను చిన్నచూపు చూస్తారనే ఉద్దేశంతో ఆ బిడ్డను చర్చి వద్ద వదిలిపెట్టామని తల్లిదండ్రులు పోలీసులకు చెప్పారు. ఆ తర్వాత వీరిని పోలీసులు అరెస్ట్ చేశారు.
 
తాజాగా ఓ మహిళ కారులో వెళ్తూ వెళ్తూ డోర్ తెరిచి గుడ్డలో చుట్టి వుంచిన బిడ్డను ఓ ఇంటి మెట్లపై వుంచి వెళ్లిపోయింది. ఈ ఘటన ఉత్తరప్రదేశ్‌లో చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే.. ఉత్తరప్రదేశ్‌లోని ముజఫర్‌నగర్‌లో జరిగిన ఈ ఘటన సీసీటీవీలో రికార్డ్ అయ్యింది. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ కావడంతో పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు జరుపుతున్నారు.
 
ఇంకా చిన్నారిని ప్రభుత్వ అధికారులు కాపాడి.. స్థానిక ఆస్పత్రిలో చికిత్స నిమిత్తం తరలించారు. అయితే అప్పుడే పుట్టిన పాపను అలా వదిలిపెట్టి వెళ్లిపోవడం దారుణమని.. ప్రస్తుతం పాప పరిస్థితి విషమంగానే ఉందని జిల్లా చీఫ్ మెడికల్ ఆఫీసర్ తెలిపారు. చిన్నారి కోలుకుంటుందనే ఆశాభావం వ్యక్తం చేశారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Chiranjeevi: క్లైమాక్స్ ఫైట్ షూటింగ్ లో మన శంకరవరప్రసాద్ గారు

Prashanth Varma: నా పై ఆరోపణలు అబద్దం, ప్రతీకారం గా జరుగుతున్నాయి: ప్రశాంత్ వర్మ

Suma: దంపతుల జీవితంలో సుమ కనకాల ఎంట్రీ తో ఏమయిందనే కథతో ప్రేమంటే

Sudheer: సుడిగాలి సుధీర్, దివ్యభారతి జంటగా G.O.A.T షూటింగ్ పూర్తి

ఆకాష్ జగన్నాథ్ ఆవిష్కరించిన వసుదేవసుతం టైటిల్ సాంగ్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఔషధంలా ఉపయోగపడే లవంగాలు, ఏమేమి ప్రయోజనాలు?

అదేపనిగా సెల్ ఫోన్లు, ల్యాప్‌టాప్‌ల ముందు కూర్చుంటున్నారా?

రోగనిరోధక శక్తిని పెంచే హెర్బల్ టీలు

నాట్స్ విస్తరణలో మరో ముందడుగు, షార్లెట్ చాప్టర్ ప్రారంభించిన నాట్స్

కార్తీక మాసంలో నేతి బీరకాయ పచ్చడి ఎందుకు తింటారు? ఆరోగ్య ప్రయోజనాలు ఏమిటి?

తర్వాతి కథనం
Show comments