Webdunia - Bharat's app for daily news and videos

Install App

కుర్తా ధరించాలని ఉంది : మోదీ వేషధారణపై మనసు పారేసుకున్న ఒబామా..!

Webdunia
సోమవారం, 26 జనవరి 2015 (09:27 IST)
‘భారత ప్రధాని మోదీలో విషయముంది.. ఆయన స్టైలుగాడే.. గట్టి మనిషి.. మూడు గంటల నిద్ర చాలంటే ఆశ్చర్యపోయా... ఆయన కుర్తా ఫైజామా చాలా బాగున్నాయి. నాకు ధరించాలని ఉంది.’ ఇలా వ్యాఖ్యనించింది ఎవరో తెలుసా...! ఆయన అట్టాంటి ఇట్టాంటి వ్యక్తి కాదు. ప్రపంచంలోనే అత్యంత శక్తివంతమైన అమెరికా దేశానికి అధ్యక్షుడు. ఆయనే ఒబామా.. ఆయన సరదా సరదాగా గడిపిన విశేషాలు 
 
నల్లటి సూటు, టై కట్టుకుని రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ ఇచ్చిన విందుకు ఆదివారం రాత్రి హాజరైన ఒబామా చాలా ఉల్లాసంగా కనిపించారు. జోరుగా హుషారుగా మాట్లాడుతూ గడిపారు. మోదీ గురించి తనకు కొన్ని ఆసక్తికరమైన అంశాలు తెలిశాయని అన్నారు. కేవలం మూడు గంటల నిద్ర సరిపోతుందని, మిగిలిన 21 గంటలూ తాను పనిచేస్తానని మోదీ తనతో అన్నప్పుడు చాలా ఆశ్చర్యపోయానని ఒబామా తెలిపారు. తాను కనీసం ఐదు గంటలు పడుకోవాలని చెప్పారు.
 
అలాగే, మొసలి దాడి నుంచి ఒకసారి తప్పించుకున్న విషయం కూడా తనకు ఇప్పుడే తెలిసిందన్నారు. ఆయన చాలా గట్టి మనిషని ప్రశంసించారు. ఆయనలో మంచి స్టైలు కూడా ఉందని అన్నారు. ఆయన ధరించే కుర్తా చాలా బాగుటుందన్నారు. తనకూ ధరించాలని ఉందని ఒబామా తన కోరికను వెలిబుచ్చారు. ఒకప్పుడు మోదీ తండ్రి టీ అమ్ముకునేవారని, ఆయన తల్లి ఇళ్లలో పనిచేసుకునే వారని, కానీ వాళ్ల అబ్బాయి ప్రపంచంలోనే అతి పెద్ద ప్రజాస్వామ్య దేశానికి ప్రధానిగా మన ముందున్నారని ప్రశంసల్లో ముంచెత్తారు. 
 
2010 సంవత్సరంలో తాను తొలిసారి భారత పర్యటనకు వచ్చినప్పటి విశేషాలను ఆయన గుర్తు చేసుకున్నారు. ఆ రోజు తమ దంపతులతో డాన్సు చేయించారని అన్నారు. ముంబైలో కొందరు పిల్లలతో కలిసి మిషెల్ ఒబామా, బరాక్ ఒబామా డాన్సు చేశారు.  తనకంటే మిషెల్ బాగా డాన్సు చేస్తారని ఆయన అనడం కొసమెరుపు. 
 

పెళ్లిపీటలెక్కనున్న హీరో ప్రభాస్.. ట్వీట్ చేసిన బాహుబలి!!

మహేష్ బాబు సినిమాపై ఆంగ్ల పత్రికలో వచ్చిన వార్తకు నిర్మాత కె.ఎల్. నారాయణ ఖండన

వీరభద్ర స్వామి ఆలయానికి జూనియర్ ఎన్టీఆర్ గుప్త విరాళం

అల్లు అర్జున్ ఆర్మీ అంత పనిచేసింది.. నాగబాబు ట్విట్టర్ డియాక్టివేట్

రెండు వారాల పాటు థియేటర్లు మూసివేత.. కారణం ఇదే

మహిళలు రోజూ ఒక దానిమ్మను ఎందుకు తీసుకోవాలి?

‘కీప్ ప్లేయింగ్‘ పేరుతో బ్రాండ్ అంబాసిడర్ తాప్సీ పన్నుతో కలిసి వోగ్ ఐవేర్ క్యాంపెయిన్

కరివేపాకు టీ ఆరోగ్య ప్రయోజనాలు

వేరుశనగ పల్లీలు ఎందుకు తినాలి?

టీ తాగేవారు తెలుసుకోవాల్సిన విషయాలు

Show comments