Webdunia - Bharat's app for daily news and videos

Install App

నా భర్తను చూడాలి.. పెరోల్ మంజూరు చేయండి... శశికళ

గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతూ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న తన భర్తను చూసేందుకు అనుమతి ఇవ్వాలని బెంగుళూరు పరప్పణ అగ్రహార జైలు అధికారులను అన్నాడీఎంకే మాజీ ప్రధాన కార్యదర్శి శశికళ కోరారు. ఇందుకోసం

Webdunia
మంగళవారం, 3 అక్టోబరు 2017 (07:31 IST)
గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతూ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న తన భర్తను చూసేందుకు అనుమతి ఇవ్వాలని బెంగుళూరు పరప్పణ అగ్రహార జైలు అధికారులను అన్నాడీఎంకే మాజీ ప్రధాన కార్యదర్శి శశికళ కోరారు. ఇందుకోసం తనకు పెరోల్ మంజూరు చేయాలంటూ ఆమె దరఖాస్తు చేసుకున్నారు. 
 
కాగా, శశికళ భర్త వి.నటరాజన్ గత కొంతకాలంగా కాలేయం, మూత్రపిండాల సమస్యలతో బాధపడుతూ... ఆసుపత్రిలో డయాలసిస్‌ చికిత్స తీసుకుంటున్నారు. ఈ నేపథ్యంలో భర్తను చూసేందుకు శశికళ పెరోల్ కోరారని ఆమె బంధువు, అన్నాడీఎంకే అసమ్మతి నేత టీటీవీ దినకరన్ తెలిపారు. ఒకవేళ ఆమె పెరోల్ పై వస్తే తమిళనాడు రాజకీయాలు మరిన్ని మలుపులు తిరిగే అవకాశం కనిపిస్తోంది. దీంతో రాష్ట్ర వ్యాప్తంగా హైఅలెర్ట్ ఇప్పటికే ప్రకటించిన విషయం తెల్సిందే. 
 
మరోవైపు.. టీటీవీ దినకరన్‌తో పాటు.. ఆయన అనుచరులపై దేశ ద్రోహం కేసు నమోదైంది. తమ రాష్ట్ర ముఖ్యమంత్రి పళనిస్వామితో పాటు కేంద్ర ప్రభుత్వాన్ని తీవ్ర పదజాలంతో దూషిస్తూ ఉన్న కరపత్రాలను పంచినందుకు గాను ఈ కేసు నమోదైంది. 
 
సోమవారం సీఎం ప‌ళ‌ని స్వామి త‌మ అధికారుల‌తో కీల‌క స‌మావేశం నిర్వ‌హిస్తుండ‌గా, దిన‌క‌ర‌న్‌ త‌న మ‌ద్ద‌తుదారుల‌తో క‌లిసి ఆ కరపత్రాలను పంచారు. ఈ కేసులో ఆయ‌న‌తో పాటు మరో 15 మంది అతడి అనుచరులపై దేశద్రోహం కేసు నమోదైంది. ఇ‌ప్ప‌టికే దేశ ద్రోహం కేసులో మాజీ ఎమ్మెల్యే వెంకటాచలాన్ని అదుపులోకి తీసుకున్న విషయం తెల్సిందే. 

సంబంధిత వార్తలు

సుచి లీక్స్ గోల.. ధనుష్, త్రిషనే కాదు.. మాజీ భర్తను కూడా వదిలిపెట్టలేదు..

పుష్ప2 నుంచి దాక్షాయణి గా అనసూయ తిరిగి రానుంది

థియేటర్ల మూత అనంతరం డైరెక్టర్స్ అసోసియేషన్ ఈవెంట్

సత్యభామ కోసం కీరవాణి పాడిన థర్డ్ సింగిల్ 'వెతుకు వెతుకు.. వచ్చేసింది

థియేటర్లు బంద్ లో మతలబు ఏమిటి ? - ఏపీలో మంత్రులంతా ఔట్ : నట్టికుమార్

వేరుశనగ పల్లీలు ఎందుకు తినాలి?

టీ తాగేవారు తెలుసుకోవాల్సిన విషయాలు

మెదడు ఆరోగ్యంపై ప్రభావం చూపే శారీరక శ్రమ

పరగడపున వేప నీరు తాగితే కలిగే ప్రయోజనాలు ఇవే

పిల్లల మానసిక ఆరోగ్యానికి దెబ్బతీసే జంక్ ఫుడ్.. ఎలా?

తర్వాతి కథనం
Show comments