Webdunia - Bharat's app for daily news and videos

Install App

భార్యకు మధ్యవర్తిగా ఉన్నాడనీ... స్నేహితుడిని హత్య చేసిన వ్యక్తి...

Webdunia
మంగళవారం, 26 సెప్టెంబరు 2023 (12:21 IST)
తన భార్య మరో వ్యక్తితో సన్నిహితంగా ఉండేందుకు సహకరిస్తున్నాడన్న అనుమానంతో తన స్నేహితుడిని ఓ వ్యక్తి హత్య చేశాడు. ఈ దారుణ ఘటన విశాఖపట్టణంలోని రామా టాకీస్ దరి శ్రీనగర్‌లో జరిగింది. తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ వివరాలను పరిశీలిస్తే, 
 
విశాఖ రామా టాకీస్ దరి శ్రీనగర్‌కు చెందిన డింగు శివకుమార్ ఆలియాస్ శివారెడ్డికి రెల్లివీధికి చెందిన కిరణ్ ద్వారా సీతంపేటకు చెందిన కలిశెట్టి కిశోర్ (26)తో స్నేహం ఏర్పడింది. కిశోర్ ఓ ప్రైవేటు సంస్థలో సేల్స్ ఎగ్జిక్యూటివ్‌గా పని చేసి ప్రస్తుతం ఖాళీగా ఉంటున్నాడు. 
 
అయితే, శివారెడ్డి మద్యం, గంజాయి తాగి ఇంటికి రావటంతో భార్యతో తరచూ గొడవలు జరిగేవి. ఎంత చెప్పినా ప్రవర్తన మారకపోవడంతో విసుగు చెందిన భార్య కొద్ది రోజుల క్రితం పుట్టింటికి వెళ్లిపోయింది. ఈ క్రమంలో కిశోర్... తన భార్య మరో స్నేహితుడు ఉదయ్‌‌తో సన్నిహితంగా ఉంటుందని, దీనికి కిషోర్ సహకరిస్తున్నట్టుగా శివారెడ్డి భావించాడు. దీంతో కిషోర్‌ను అంతం చేయాలన్న నిర్ణయానికి వచ్చాడు. 
 
ఈ క్రమంలో ఆదివారం రాత్రి మద్యం తాగేందుకు శ్రీనగర్‌‌లోని తన అపార్టుమెంటుకు రావాలని పిలవడంతో దేవా, కిరణ్‌తో కలిసి కిశోర్ అక్కడికి వెళ్లాడు. వీరంతా కలిసి మద్యం తాగుతుండగా.. కిశోశ్‌ను శివారెడ్డి పక్కకు తీసుకెళ్లి.. మూడంతస్తుల భవనం నుంచి కిందికి తోసేసి పారిపోయాడు. ఒక్కసారిగా పెద్ద శిబ్దం రావడంతో మిగిలిన ఇద్దరూ కిందకి చూడగా కిశోర్ తీవ్ర రక్తపు మడుగులో కనిపించాడు. ఆ వెంటనే కేజీహెచ్‌కు తరలించగా అక్కడ చికిత్స పొందుతూ మృతి చెందాడు. మృతుని సోదరుడు ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

నాన్నా పవన్... మా సమస్యలు ఓ సారి వినరాదూ!! : డిప్యూటీ సీఎంకు పరుచూరి విన్నపం (Video)

తిరగబడరసామీ లో యాక్షన్, ఎమోషన్స్, ఎంటర్ టైన్మెంట్ చాలా కొత్తగా వుంటుంది : రాజ్ తరుణ్

శేఖర్ కమ్ముల 'కుబేర' నుంచి రష్మిక మందన్న ఫస్ట్ లుక్ రాబోతుంది

కొరియోగ్రాఫర్ నుంచి అధ్యక్షుడిగా ఎదిగిన జానీ మాస్టర్

20 కోట్ల బడ్జెట్ తో పీరియాడిక్ థ్రిల్లర్ గా హీరో కిరణ్ అబ్బవరం చిత్రం ?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

పరగడుపున తినకూడని 8 పండ్లు ఏమిటి?

డ్రై ఫ్రూట్ హల్వా ఆరోగ్యకరమైనదా?

పిల్లలకు నచ్చే మలాయ్ చికెన్ ఇంట్లోనే చేసేయవచ్చు.. ఇలా..?

రక్తదానం చేస్తే కలిగే ఆరోగ్య ప్రయోజనాలు ఏమిటి?

గుమ్మడి విత్తనాలు తింటే 7 ప్రయోజనాలు, ఏంటవి?

తర్వాతి కథనం
Show comments