పైరసీపై ముంబై హైకోర్టు సంచలన తీర్పు: ఆన్‌లైన్‌లో సినిమాలు చూడొచ్చు.. కానీ?
పైరసీపై ముంబై హైకోర్టు సంచలన తీర్పు ఇచ్చింది. ఆన్‌లైన్‌లో పైరసీ సినిమాలు చూడటం నేరం కాదని, శిక్షార్హం కూడా కాదని ముంబయి హైకోర్టు వ్యాఖ్యానించింది. పైరసీ భూతంతో నిర్మాతలు, దర్శకులు కోట్లాది రూపాయలు నష్
పైరసీపై ముంబై హైకోర్టు సంచలన తీర్పు ఇచ్చింది. ఆన్‌లైన్‌లో పైరసీ సినిమాలు చూడటం నేరం కాదని, శిక్షార్హం కూడా కాదని ముంబయి హైకోర్టు వ్యాఖ్యానించింది.
పైరసీ భూతంతో నిర్మాతలు, దర్శకులు కోట్లాది రూపాయలు నష్టపోతున్న సంగతి తెలిసిందే. విడుదలైన తొలిరోజే నెట్లో సినిమా ప్రత్యక్షమవుతోంది. తద్వారా కోట్ల రూపాయల నష్టం తప్పట్లేదని ఫిల్మ్ ప్రొడ్యూసర్ల సమాఖ్య ముంబయి హైకోర్టులో కేసు వేసింది.
అందుకు గాను కోర్ట్ సైతం ఆన్లైన్ మూవీ సైట్స్‌ను బ్యాన్ చేసారు. కాగా ఈ కేసుకు సంబంధించి కోర్ట్ సంచలన తీర్పు ఇచ్చింది. ఆన్‌లైన్‌లో పైరసీ సినిమాలు చూడటం నేరం కాదని కాకపోతే వీటిని పబ్లిక్‌గా చూడటం, డౌన్‌లోడ్ చేసుకోవడం లేదా ఇతరులకు షేర్ చేయడం వంటివి నేరం కిందకే వస్తాయని పేర్కొంది. అంతేకాకుండా ఆ వీడియోలు డౌన్‌లోడ్ కాకుండా జాగ్రత్తపడాలని కోరింది. ప్రతి ఐఎస్‌పీ ఒక నోడల్ ఆఫీసర్‌ను నియమించుకోవాలని సూచించింది.
ఇంకా వెబ్ సైట్ యూఆర్ఎల్‌లలో నిబంధనలు పాటించని సైట్లను బ్లాక్ చేస్తామనే మెసేజ్‌ను ఉంచాలని తెలిపింది. దీంతో పాటు పైరసీ ప్రింట్లను అందుబాటులో ఉంచుతున్న సైట్లను బ్లాక్ చేసి ''ఎర్రర్ మెసేజ్" ఫోటోను ఉంచాలని హైకోర్టు పేర్కొంది.