Webdunia - Bharat's app for daily news and videos

Install App

నడి రోడ్డుపై వజ్రాలు ఏరుకున్న ప్రజలు.. ఎక్కడ?

Webdunia
సోమవారం, 25 సెప్టెంబరు 2023 (14:08 IST)
గుజరాత్ రాష్ట్రంలో కొందరు స్థానికులు నడి రోడ్డుపై వజ్రాలను ఏరుకున్నారు. తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ ఆసక్తికర సంఘటన వివరాలను పరిశీలిస్తే, గుజరాష్ట్రంలోని సూరత్‌లోని వరచ్చా అనే ప్రాంతం వజ్రాలకు ఎంతో ప్రసిద్ధి. 
 
ఇక్కడ వజ్రాల వ్యాపారం జోరుగా సాగుతుంది. ఈ క్రమంలో ఓ వ్యాపారి పొరపాటున వజ్రాల ప్యాకెట్‌ను రోడ్డుపై పడేసుకున్నట్టు ఓ వార్త చక్కర్లు కొట్టింది. నడి రోడ్డుపై పడిపోయిన ఈ వజ్రాల విలువ కొన్ని కోట్ల రూపాయల్లో ఉన్నట్టు ప్రచారం జరిగింది. 
 
అంతే.. ఈ వార్తను తెలుసుకున్న స్థానికులు.. రోడ్డుపై పడిపోయిన వజ్రాల కోసం ముమ్మరంగా గాలింపు చర్యలు చేపట్టారు. రోడ్డుపై అణువణువూ శోధించారు. దీంతో ఆ ప్రాంతమంతా జనాలతో రద్దీగా మారింది. ఇందుకు సంబంధించిన వీడియో ఒకటి వైరల్ అవుతుంది. 
 
కొందరికి కొన్ని వజ్రాలు కనిపించినా అవి ఇమిటేషన్ జ్యూవెలరీలో వాడే అమెరికన్ డైమండ్స్‌ అని తేలడంతో ఉసూరుమన్నారు. ఇది ఫ్రాంక్ అయి వుంటుందని మరికొందరు అంటున్నారు. అయితే, దీనికి సంబంధించిన వీడియో మాత్రం ఇపుడు సోషల్ మీడియాలో వైరల్ అయింది. 
అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Vijay: విజయ్ దేవరకొండ చిత్రం కింగ్ డమ్ కు టికెట్ల పెంపు పై సందిగ్థ

బ్రాట్ లో యుద్ధమే రానే పాటను సిద్ శ్రీరామ్ అద్భుతంగా పాడారు : డాక్టర్ నరేష్ వికే

Varun Sandesh: వన్ వే టికెట్ టైటిల్ బాగా నచ్చింది : వరుణ్ సందేశ్

Tarun Bhaskar:: సినిమాలకు ఎప్పుడూ హద్దులుండకూడదు : తరుణ్ భాస్కర్

మైసా చిత్రంలో గోండ్ మహిళగా రష్మిక మందన్న - నేడు కీలకసన్నివేశాల చిత్రీకరణ

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఆల్‌బుకరా పండ్లతో ఆరోగ్య ప్రయోజనాలు

జామకాయ తింటే ఎన్ని ప్రయోజనాలు, ఏంటి?

Snacks: బరువు తగ్గాలనుకునే మహిళలు హెల్దీ స్నాక్స్ తీసుకోవచ్చు.. ఎలాగంటే?

4 అలవాట్లు వుంటే వెన్నునొప్పి వదలదట, ఏంటవి?

ఒక్క ఏలుక్కాయను రాత్రి తిని చూడండి

తర్వాతి కథనం
Show comments