Webdunia - Bharat's app for daily news and videos

Install App

మోడీ చేతుల మీదుగా అవార్డు.. తిరస్కరించిన సీనియర్ జర్నలిస్ట్ ముఖుల్

ప్రధాని నరేంద్ర మోదీ చేతుల మీదుగా అందుకోవాల్సిన 'రాంనాథ్ గోయింకా ఎక్సలెన్స్ ఇన్ జర్నలిజం' అవార్డును టైమ్స్ ఆఫ్ ఇండియా సీనియర్ జర్నలిస్టు అక్షయా ముఖుల్ తిరస్కరించడం సంచలనం రేపుతోంది. అవార్డు ఫంక్షన్ ను

Webdunia
గురువారం, 3 నవంబరు 2016 (17:01 IST)
ప్రధాని నరేంద్ర మోదీ చేతుల మీదుగా అందుకోవాల్సిన 'రాంనాథ్ గోయింకా ఎక్సలెన్స్ ఇన్ జర్నలిజం' అవార్డును టైమ్స్ ఆఫ్ ఇండియా సీనియర్ జర్నలిస్టు అక్షయా ముఖుల్ తిరస్కరించడం సంచలనం రేపుతోంది. అవార్డు ఫంక్షన్ నుంచి ముఖుల్ బాయ్ కాట్ చేశారు. ఆయన తరపున అవార్డును హార్పర్ కాలిన్స్ ఇండియా చీఫ్ ఎడిటర్ క్రిష్ణ చోప్రా అందుకున్నారు. 
 
బాయ్ కాట్ చేసిన అనంతరం అక్షయా ముఖుల్ మాట్లాడుతూ.. ఈ అవార్డు తనకు దక్కడం చాలా గర్వంగా ఉందని.. అయితే ప్రధాని చేతుల మీదుగా అవార్డును అందుకోవడం ఇష్టం లేకే కార్యక్రమం నుంచి వెళ్లిపోయానని ముఖుల్ తెలిపారు. మోదీ పక్కన నవ్వుతూ ఫోటోలకు ఫోజులివ్వడం తనకు ఇష్టం లేదని...మోదీ ఆలోచనలతో తాను కూడా జీవిస్తున్నట్టు ఉంటుందని... అందుకే ఈ కార్యక్రమాన్ని బాయ్ కాట్ చేశానని తెలిపారు. 
 
అక్షయా ముఖుల్ పుస్తకం 'గీతా ప్రెస్, ది మేకింగ్ ఆఫ్ హిందూ ఇండియా'కు ఈ అవార్డు దక్కింది. 2015 ఆగష్టులో ఈ పుస్తకం విడుదలైంది. ఆ తర్వాత బుక్ ఆఫ్ ది ఇయర్, అట్టా గలాట్టా - బెంగళూరు లిటరేచర్ ఫెస్టివల్ బుక్ ప్రైజ్‌లను కూడా ఈ పుస్తకం సొంతం చేసుకుంది. బుధవారం జరిగిన ఈ ప్రధానోత్సవంలో అవార్డు గ్రహీతలందరికీ మోదీ అభినందనలు తెలిపారు.
అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

హోంబాలే ఫిల్మ్స్ మహావతార్ నరసింహ హిరణ్యకశిపు ప్రోమో రిలీజ్

పాకీజాకు పవన్ అండ... పవర్ స్టార్ కాళ్ళు మొక్కుతానంటూ వాసుకి భావోద్వేగం

పోలీస్ వారి హెచ్చరిక లోని పాటకు పచ్చజెండా ఊపిన ఎర్రక్షరాల పరుచూరి

Pawan: పవన్ కళ్యాణ్ సాయంతో భావోద్వేగానికి లోనయిన నటి వాసుకి (పాకీజా)

Ranbir Kapoor: నమిత్ మల్హోత్రా రామాయణం తాజా అప్ డేట్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఆవు నెయ్యి అద్భుత ఆరోగ్య ప్రయోజనాలు

గుండెపోటు సంకేతాలు నెల ముందే కనిపిస్తాయా?

మిరప కారం చేసే మేలు ఎంతో తెలుసా?

నిద్రకు 3 గంటల ముందే రాత్రి భోజనం ముగించేస్తే ఏం జరుగుతుంది?

పరగడుపున తినకూడని 8 పండ్లు

తర్వాతి కథనం
Show comments