Webdunia - Bharat's app for daily news and videos

Install App

సీఎం పీఠంపై శశి ఆశకు కారణం అదే?: జయలలితను ఎంజీఆర్, రాజీవ్ ఆనాడే హెచ్చరించారా?

1987వ సంవత్సరం ఓ రోజున ఎంజీఆర్.. జయలలితను పిలపించారు. "నీవు ఏమైనా చెయ్.. మద్దతిస్తా... అయితే శశికళను మాత్రం నీ చెంతన ఉంచుకోవద్దు'' అంటూ ఎంజీఆర్ దీన గొంతుతో హెచ్చరించారు. శశికళ అనే మహిళ జయలలితను కీలుబ

Webdunia
గురువారం, 9 ఫిబ్రవరి 2017 (16:13 IST)
వలంపురి జాన్ అన్నాడీఎంకే ఎంపీగా కొనసాగారు. అన్నాడీఎంకే కీలక నేతలు ఎంజీఆర్, జయలలితతో ఆయన అనుభవాలను అప్పట్లో ఓ వారపత్రికలో పేర్కొన్నారు.. వలంపురి జాన్. ఈ స్టోరీ 1990లో రాయబడింది. ఆ స్టోరీలో వలంపురి జాన్ ఆసక్తికర విషయాలను వెల్లడించారు.

1987వ సంవత్సరం ఓ రోజున ఎంజీఆర్.. జయలలితను పిలపించారు. "నీవు ఏమైనా చెయ్.. మద్దతిస్తా... అయితే శశికళను మాత్రం నీ చెంతన ఉంచుకోవద్దు'' అంటూ ఎంజీఆర్ దీన గొంతుతో  హెచ్చరించారు. శశికళ అనే మహిళ జయలలితను కీలుబొమ్మలా మార్చేసిందనే విషయం అప్పటి ప్రధాన మంత్రి రాజీవ్ గాంధీ చెవులకు కూడా చేరింది. 
 
రాజీవ్ గాంధీ కూడా జయలలిత ఓ తమిళ కాంగ్రెస్ నేత ద్వారా శశితో స్నేహం వద్దని సమాచారం పంపారు. ఎంజీఆర్ చివరి రోజుల్లో తిరునావుక్కరసర్ కూడా జయలలితను కాపాడాలని శశికళకు సంబంధించిన వివరాలను ఎంజీఆర్‌కు అందించారు. వడుకంపట్టి ధర్మరాజు అప్పట్లో శశికళ ఆస్థాన జ్యోతిష్కుడు. ఆయన మాట శశికళకు వేదవాక్కు. ఈయనే ఓ సందర్భంలో శశికళ ఓ సందర్భంలో సీఎం అయిపోతుందని చెప్పాడు.

ఇది నిజమేనా? అనే క్లారిటీ కోసం శశికళ పలువురు జ్యోతిష్కులను కూడా సంప్రదించిందట. మరి ఈ జ్యోతిష్కుడి మాట నిజమైపోతుందా? అని ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అందుకే చిన్నమ్మకు సీఎం పీఠంపై ఆశలు ఎక్కువయ్యాయని సన్నిహితులు అంటున్నారు.

మహేష్ బాబు సినిమాపై ఆంగ్ల పత్రికలో వచ్చిన వార్తకు నిర్మాత కె.ఎల్. నారాయణ ఖండన

వీరభద్ర స్వామి ఆలయానికి జూనియర్ ఎన్టీఆర్ గుప్త విరాళం

అల్లు అర్జున్ ఆర్మీ అంత పనిచేసింది.. నాగబాబు ట్విట్టర్ డియాక్టివేట్

రెండు వారాల పాటు థియేటర్లు మూసివేత.. కారణం ఇదే

రాజు యాదవ్‌ చిత్రం ఏపీ, తెలంగాణలో విడుదల చేస్తున్నాం : బన్నీ వాస్

మహిళలు రోజూ ఒక దానిమ్మను ఎందుకు తీసుకోవాలి?

‘కీప్ ప్లేయింగ్‘ పేరుతో బ్రాండ్ అంబాసిడర్ తాప్సీ పన్నుతో కలిసి వోగ్ ఐవేర్ క్యాంపెయిన్

కరివేపాకు టీ ఆరోగ్య ప్రయోజనాలు

వేరుశనగ పల్లీలు ఎందుకు తినాలి?

టీ తాగేవారు తెలుసుకోవాల్సిన విషయాలు

తర్వాతి కథనం
Show comments